అమ్మ ఒడి తేదీ కన్ఫామ్.. హాజరు తప్పనిసరి.. కరెంట్ కూడా 300 యూనిట్లు దాటొద్దు
అమ్మ ఒడి డబ్బులు విడుదల చేసే తేదీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. వచ్చే నెల 21వ తేదీన ఖాతాలో డబ్బులు వేస్తారు. జూన్ 21వ తేదీన అమ్మ ఒడి తల్లుల ఖాతాల్లో నగదు వేస్తాం అని ఉన్నతాధికారులు పేర్కొ న్నారు. 'గడప గడపకు ప్రభుత్వం' కార్యక్రమాన్ని నాణ్యతతో చేయాలని సీఎం చెప్పారని, వైసీపీ ఎమ్మెల్యేలు లేనిచోట్ల ప్రభుత్వ సిబ్బంది, పార్టీ కార్యకర్తలు కలిసి ఈ కార్యక్రమం చేస్తారు.
అమ్మఒడి పథకంలో ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు పొందాలంటే నిబంధనలు విధించింది. లబ్దిదారులు 2022 ఏడాదికి ఆధార్ బ్యాంకు ఖాతా లింక్ చేయాలి. చైల్డ్ ఇన్ఫోలో ఉన్న తల్లి ఆధార్ లింక్ చేసిన బ్యాంకు ఖాతాను నమోదు చేయాలని తెలిపింది. ఆధార్‌కి మొబైల్ లింక్ తప్పనిసరిగా ఉండాలి.

ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే ఎన్పీసీఐ మ్యాప్ అయిన ఖాతాలో మాత్రమే నగదు పడుతుంది. బ్యాంకుకి వెళ్లి ఎంపీటీసీ మ్యాప్ చేసుకోల్సి ఉంటుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో తల్లి, విద్యార్థి ఓకే మ్యాపింగ్‌లో ఉండాలి. వివరాలు వాలంటీర్ వద్ద ఉండే యాప్‌తో సరి చూసుకోవాల్సి ఉంటుంది. అందులో వివరాలు తప్పుగా ఉంటే వాలంటీర్ యాప్ హెచ్ హెచ్ మ్యాపింగ్ ద్వారా ఈకేవైసీ అప్ డేట్ చేసి.. సరిచేయాల్సి ఉంటుంది.
అలాగే మరో ముఖ్యమైన అంశం హాజురు శాతం 75 కన్నా తక్కువ ఉండొద్దు. నవంబర్ 8వ తేదీ 2021 నుంచి ఏప్రిల్ 30 2022 వరకు పరిగణలోకి తీసుకుంటారు. అలాగే ప్రతీ నెల 300 యూనిట్ల విద్యుత్ బిల్ మించరాదని తెలిపింది. కొత్త జిల్లాలను విద్యార్థులు ఆధార్ అడ్రస్‌లో అప్ డేట్ చేయడం తప్పనిసరి అని పేర్కొంది.