అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెట్టుబ‌డుల స్వ‌ర్గధామం అమ‌రావతి..! దావోస్ లో లోకేష్ ప్ర‌సంగం..!!

|
Google Oneindia TeluguNews

దావోస్/హైద‌రాబాద్ : దావోస్ లో మంత్రి లోకేష్ బిజీ బిజీ గా గ‌డిపేస్తున్నారు. ప‌లు ఐటి దిగ్గ‌జాల‌ను సంప్ర‌దిస్తూ అమ‌రావతిలో ఐటి సంస్థ‌ల ఏర్పాటు అంశాల పై లోతుగా చ‌ర్చిస్తున్నారు. హెచ్ పీ ఈ కంపెనీ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ విశాల్ లాల్ తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన నైపుణ్యం ఉన్న యువతీ, యువకులు ఉన్నారని లోకేష్ వివరించారు. ఐటీ రంగం అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పారు.

డీటీపీ పాలసీ, క్లౌడ్ హబ్ పాలసీలు తీసుకొచ్చాం. పాలసీలు, రాయితీలు వలన అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి వస్తున్నాయి. అదాని గ్రూపు రాక తో ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ హబ్ గా మారబోతుంది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలి అని ఆహ్వానిస్తున్నాను.

Amravati is the haven of investment..! Lokesh speech in Davos .. !!

ఏపీ మంత్రి లోకేష్ దావోస్ ప‌ర్య‌ట‌న ఆశించిన ఫ‌లితాలు ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది. వివిద కంపెనీలతో ఆయ‌న జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌ద‌మైన‌ట్టు స‌మాచారం. యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు పై జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్, మైక్రో సాప్ట్ అధినేత బిల్ గేట్స్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు దేశాల మంత్రులు పాల్గొని స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు సాధన కోసం తీసుకోవాల్సిన చర్యల పై చర్చించారు.

ఆంధ్రప్రదేశ్ లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు సాధన కోసం తీసుకుంటున్న చర్యలు, గ్రామాలకు టెన్ స్టార్ రేటింగ్, గ్రామాల్లో ప్రతి కుటుంబానికి నెలకి పదివేల ఆదాయం తదితర అంశాలను గురించి మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. వివిధ శాఖల అనుసంధానం తో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించారు. ప‌లు పెట్టుబ‌డుల స‌ర‌ళీక్రుత అంశాల‌పై ప్ర‌సంగించిన లోకేష్ రేపు అమ‌రావ‌తికి రానున్నారు.

English summary
AP IT minister Lokesh is busy in Davos. Lokesh who is in Davos had met many investors and explained the need to invest in AP. He also brought to their attention about the skilled youth in AP. Many steps were being taken to develop the IT sector in AP, said the Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X