అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుల ఊబిలో ఏపి : మూడు నెల‌ల్లో 22వ సారి ఓడికి..

|
Google Oneindia TeluguNews

నూత‌న రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ అప్పుల ఊబి లో కూరుకుపోతోంది. వృద్ధి గొప్పగా ఉరదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుం టున్నప్ప టికీ, ఆర్థిక పరిస్థితి మాత్రం అరదుకు భిన్నంగా ఉరది. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో డబుల్‌ డిజి ట్‌ వృద్ధి సాధించామని ప్రభుత్వం చెబుతున్న తరుణంలోనే ఆర్థిక పరిస్థితి అయోమయంగా మారినట్లు కనిపిస్తోరది. రాష్ట్ర ఖజానా ఓవర్‌ డ్రాఫ్ట్‌(ఓడీ)లోకి వెళ్లిపోతోంది. తాజా నివేదికల మేరకు రెరడు రోజుల క్రితం కూడా 1768 కోట్ల రూపా యల వరకు ఓవర్‌ డ్రాఫ్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోరది. అది తాజా లెక్క‌ల ప్ర‌కారం దాదాపు రూ.500 కోట్లకు తగ్గినప్పటికీ, ఇరకా ఓవర్‌డ్రాఫ్ట్‌లోనే కొనసాగు తోరది. ఇలా ఓడీలో కొనసాగడం వరుసగా ఐదో రోజు కావడం గమనార్హం.

Andhra Pradesh in financial crisis. Govt went Overdraft for 22nd time in last four and half years..

ఏపి ప్ర‌భుత్వం ఈ నాలుగున్నారేళ్ల కాలంలో 22 సార్లు ఓవ‌ర్ డ్రాఫ్ట్ కు వెళ్లింది. ప్ర‌త్యేకించి ప్ర‌స్తుత త్రైమాసికంలో 22 రోజుల పాటు ఓడిలో ఉండటం అనేది ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. వంద శాతం వేస్ అండ్ మీన్స్ ప‌రిధి దాటి ఓడిలోకి వెళ్లటం కూడా ఈ నెలలోనే చోటు చేసుకుంది. ప్ర‌స్తుత త్రైమాసికంగా లో ఈ విధంగా రెండు సార్లు చోటు చేసు కుంది. సాధార‌ణంగా రాష్ట్ర అర్ధిక ప‌రిస్థితి బాగోలేని స‌మ‌యంలో అప్పుల‌కు వెళ్ల‌టం స‌హ‌జం. ముందుగా వేస్ అండ్ మీన్స్ కు వెళ్లి..అప్ప‌టికీ ఇబ్బందులు త‌ప్ప‌క‌పోతే ఓడికి వెళ్తారు. ఒక‌వైపు న‌వంబ‌ర్ నెల‌లో గ‌త ఏడాది న‌వంబ‌ర్ కంటే ఆదాయం పెరిగింద‌ని చెబుతూనే..మ‌రోవైపు ఓడికి వెళ్ల‌టం అధికారులు ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ఆర్ధిక ప‌రిస్థితి పై ఆర్దిక మంత్రి య‌న‌మ‌ల స‌మీక్షించారు. ఏపి లో ఆదాయం పెరిగింద‌ని స్ప‌ష్టం చేసారు.
ఏపిలో వృద్ది రేటు అద్భుతంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి ప‌దేప‌దే చెప్పుకొచ్చారు. తాజా గా ఏపిలో ఆర్దిక ప‌రిస్థితి నాలుగు వేల కోట్ల వ‌ర‌కు ఖ‌జానాలో నిల్వ ఉన్న‌ట్లు అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో రాష్ట్ర ఆర్దిక శాఖ ఓడిలోకి వెళ్ల‌టం పై అధికారుల్లో ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. అయితే, ప్ర‌స్తుత ఆర్దిక ప‌రిస్థితి ఓడిలోకి వెళ్లాల్సి వ‌చ్చింద‌నే దాని పై స్ప‌ష్ట‌త ఇవ్వటం లేదు. రాజ‌కీయంగా తీసుకుంటున్న నిర్ణ‌యాలు..ఎడాపెడా ఇస్తున్న హామీలు..నియంత్ర‌ణ లేని ఖ‌ర్చులు..ఈ ప‌రిస్థితికి దారి తీసాయ‌ని అధికారులు వివ‌రిస్తున్నారు. మ‌రి..ప్ర‌భుత్వ పెద్ద‌లు ఈ ప‌రిస్థితి ఎలా చ‌క్క‌దిద్దుతారో అనే అందోళ‌న అధికారుల్లో వ్య‌క్తం అవుతోంది.

English summary
Andhra Pradesh in financial crisis. Govt went Over Draft for 22nd time in last four and half years. Financial Officials concern about financial status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X