అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్ కు ఆది నుండీ రాజధాని కష్టాలే .. శాశ్వత రాజధానే లేని ఏపీ ప్రస్థానం ఇదే !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌కు ఆది నుండి రాజధాని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాటి నుండి నేటి వరకు శాశ్వత రాజధాని యోగం లేదు అంటే అతిశయోక్తి కాదు. ఏపీ రాజధాని తరచూ మార్పులకు గురవుతున్న విషయం గత చరిత్ర నుండి గమనిస్తే మనకు అర్థమవుతుంది. అప్పటి మద్రాస్‌ నుంచి ఇప్పటి అమరావతి వరకూ జరిగిన, జరుగుతున్న పరిణామాలు అన్ని ఏపీకి శాశ్వత రాజధాని యోగం లేదు అనే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.

 మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే ముగ్గురు సీఎంలు కావాలి .. రాజధాని మహిళల మండిపాటు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే ముగ్గురు సీఎంలు కావాలి .. రాజధాని మహిళల మండిపాటు

సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనతో గందరగోళం

సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనతో గందరగోళం

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే బాగుంటుందని ప్రతిపాదన తెరమీదకు తీసుకువచ్చారు. దీంతో నిన్న మొన్నటి వరకు ఏపీ రాజధాని అమరావతి అని చెప్పిన నేపథ్యంలో, అమరావతి ప్రాంత భవిష్యత్తు అయోమయంలో పడింది. అసెంబ్లీ సాక్షిగా సీఎం వైఎస్‌ జగన్ చేసిన ఈ ప్రకటనే అమరావతిలో అగ్గిరాజేసింది. రాజధానిపై ఏదో జరుగుతుంది అన్న ఆందోళనను మరింత పెంచేసింది.

 నిపుణుల కమిటీ నివేదిక కూడా సీఎం ఆలోచనలకూ తగ్గట్టే

నిపుణుల కమిటీ నివేదిక కూడా సీఎం ఆలోచనలకూ తగ్గట్టే

ఇదిలా ఉంటే రాజధానిపై నిపుణుల అధ్యయన కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం అంటూ సీఎం జగన్ చెప్పారు. ఇక నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డికి నివేదిక సమర్పించిన జి ఎన్ రావు కమిటీ ఏపీ రాజధాని మార్పు చెందబోతుందనే విషయాన్ని స్పష్టంగా తేల్చి చెప్పేశారు. ఒక పక్క సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటన, మరోపక్క నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక రెండూ అమరావతిలో పూర్తిస్థాయి రాజధాని ఉండదన్నది తేల్చి చెప్పేశాయి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్ ఉండొచన్న ప్రకటనతో అదే రాజధానిగా చెలామణీ అవుతుందనే భావన అందరిలో వ్యక్తమవుతోంది.
రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలోపే రాజధానిగా అమరావతి పేరు చెరిగిపోతున్న తీరుఅమరావతి ప్రాంత వాసులను షాక్ కు గురి చేసింది.

ఏపీ రాజధానికి ఆది నుండీ అన్నీ కష్టాలే

ఏపీ రాజధానికి ఆది నుండీ అన్నీ కష్టాలే


ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రస్థానం చూస్తే ఆంధ్రప్రదేశ్ కు రాజధాని వివాదం ఇది మొదటిసారి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర చూసినట్లయితే అసలు శాశ్వత రాజధాని ఆంధ్రప్రదేశ్ కు లేనేలేదు అనేది అర్ధం అవుతుంది. ఆంధ్ర ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక రాజధాని ఉండాలంటూ మొదలైన పోరాటానికి శతాధిక సంవత్సరాల చరిత్ర ఉంది. స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసింది. మద్రాసుతో కలిపి ఏపీ రాష్ట్రాన్ని విభజించాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరులయ్యారు.

మొదట మద్రాస్ కోసం, తర్వాత కర్నూలు , హైదరాబాద్

మొదట మద్రాస్ కోసం, తర్వాత కర్నూలు , హైదరాబాద్

ఇక స్వాతంత్రం వచ్చిన తరువాత, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలు రాజధానిగా పాలన జరిగింది. అయితే అది కూడా ఎంతో కాలం జరగలేదు. మూడేళ్లలోపే ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్‌ రాష్ట్రం విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో హైదరాబాద్ రాజధాని అయ్యింది. కానీ తెలంగాణలో ఉన్న రాజధాని హైదరాబాద్ తమది కాదన్న భావన మొదటినుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉండి పోయింది. తొలి దశ తెలంగాణా ఉద్యమ సమయంలోనే ఆ విషయం ఆంధ్ర ప్రాంత వాసులకు అర్ధం అయ్యింది .

విభజనతో రాజధానే లేకుండా పోయిన ఏపీ

విభజనతో రాజధానే లేకుండా పోయిన ఏపీ


అయితే అప్పటి ఉద్యమాన్ని అప్పటి ప్రభుత్వాలు అణచి వేసినప్పటికీ, మలిదశ ఉద్యమం ఉద్ధృతంగా సాగింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన జరిగిపోయింది. అయితే విభజించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. అలా రాజధాని కూడా లేకుండా విభజించబడిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేయడానికి గత టిడిపి ప్రభుత్వం నానా తంటాలు పడాల్సి వచ్చింది.

అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించాలని భావించిన బాబు

అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించాలని భావించిన బాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కీర్తి కెరటంలా ఉండేలా రాజధాని నిర్మాణం చేపట్టాలని భావించిన చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. హైదరాబాద్‌తో ముడిపడిన బంధాన్ని విభజన వల్ల వదులుకోవాల్సి వచ్చిన ఆంధ్ర ప్రజలు అమరావతితో ఇక శాశ్వత రాజధాని ఉంటుందన్న నమ్మకానికి వచ్చారు. అందుకోసం చంద్రబాబు తీవ్రంగా శ్రమించారని చెప్పాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో, ప్రపంచ దేశాలను ఆకర్షించే విధంగా దేశంలోనే ఎక్కడా లేనట్లుగా సింగపూర్ టెక్నాలజీ తో రాజధానిని నిర్మిస్తామంటూ అప్పటి ప్రభుత్వం ప్రకటన చేసింది.

 టీడీపీ ఓటమితో రాజధానిపై నీలినీడలు

టీడీపీ ఓటమితో రాజధానిపై నీలినీడలు

33 వేల ఎకరాలకు పైగా విలువైన భూములను రాజధాని కోసం రైతులు ఇచ్చారు. పరిహారంగా డబ్బులకు బదులు.. అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించేలా ఒప్పందం చేసుకున్న నాటి ప్రభుత్వం ఇంకా చాలా వరకు రైతులకు ఇవ్వాల్సిన ఫ్లాట్ లను లేదు.గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు కావడం, వైసిపి తిరుగులేని మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకోవడం తో అమరావతి పై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఆరు నెలలుగా సైలెంట్ గా ఉన్న జగన్ .. తాజాగా ఏపీ రాజధాని విషయంలో ప్రకటన

ఆరు నెలలుగా సైలెంట్ గా ఉన్న జగన్ .. తాజాగా ఏపీ రాజధాని విషయంలో ప్రకటన

రాజధాని మార్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని గత ఆరు నెలల నుండి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూనే ఉంది. ఇక అనుమానాలకు ఊతం ఇస్తూ అధికారం చేపట్టిన ఏడు నెలల తర్వాత రాజధాని విషయంలో అసెంబ్లీ వేదికగా నోరువిప్పి మాట్లాడిన సీఎం జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి తీరాలని, అందుకోసం మూడు రాజధానిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చారు. దానికి తగ్గట్టు జిఎన్ రావు కమిటీ నివేదిక కూడా జగన్ ఆలోచనలకు తగ్గట్టుగానే సాగినట్లుగా కమిటీ సభ్యులు చేసిన వ్యాఖ్యల వల్ల తెలుస్తోంది.

డిసెంబర్ 27 నకేబినెట్ భేటీ .. నిపుణుల కమిటీ నివేదికపై చర్చ

డిసెంబర్ 27 నకేబినెట్ భేటీ .. నిపుణుల కమిటీ నివేదికపై చర్చ

డిసెంబర్ 27 నకేబినెట్ భేటీలో నివేదికపై చర్చించిన తర్వాత సీఎం రాజధాని మార్పుపై అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది. కచ్చితంగా రాజధాని ముక్కలు ముక్కలుగా మూడు ప్రాంతాల్లోనూ ఉండబోతుందని, మార్పు జరిగి తీరుతుందని ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్వాతంత్ర్యం రాకముందు నుండీ స్వరాష్ట్రం కోసం ఆ తర్వాత పొట్టి శ్రీరాములు చేసిన ఉద్యమ ఫలితంగా ఏర్పడిన కర్నూలు కోసం, హైదరాబాద్ లో విలీనమైన తరువాత హైదరాబాద్ కోసం పోరాటం చేశారు.

 ఆది నుండీ రాజధాని కోసం పోరాటమే ...

ఆది నుండీ రాజధాని కోసం పోరాటమే ...

తెలంగాణ ఉద్యమ ప్రభావంతో మనది కాదని తెలిసిన హైదరాబాద్ కోసం, విభజన తర్వాత అతికష్టం మీద ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూ ఒక రూపం ఇవ్వడానికి చంద్రబాబు ప్రయత్నించిన అమరావతి కోసం పోరాటం సాగిస్తూనే ఉన్నారు ఆంధ్ర ప్రజలు. ఇక ఈ పోరాటానికి ఇప్పటి తో ఫుల్ స్టాప్ పడుతుంది అన్న నమ్మకం లేదు. ఆంధ్ర రాష్ట్రానికి నాటి నుండి నేటి వరకు రాజధాని కష్టాలు మాత్రం పోవడం లేదు.

English summary
Andhra Pradesh has been chasing capital from the beginning. It is no exaggeration to say that there is no permanent capital from Andhra Pradesh to the present day. We can understand from past history that AP capital is constantly undergoing change. The developments that have taken place from then Madras to present-day Amravati have been made clear that AP has no permanent capital
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X