• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హోదా రావాల్సిందే.. 3 రాజధానులు కూడా పక్కా: మంత్రి బొత్స సెన్సేషనల్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

ఏపీలో హోదా ఇప్పుడు మళ్లీ కాక రేపుతోంది. కమిటీ ఏర్పాటు.. చర్చించాల్సిన అంశం నుంచి హోదా తీసేయడంతో అగ్గి రాజుకుంది. దీనిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్టణానికి రాజధాని రావటం తథ్యం అని బొత్స తేల్చిచెప్పేశారు. విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని.. ఇందులో ఎలాంటి సందేహానికి తావు లేదని చెప్పారు.

అలాగే మూడు రాజధానుల నిర్ణయం తమ ప్రభుత్వ విధాన నిర్ణయం అని తెలియజేశారు. ఎవరు ఎన్ని చెప్పినా రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని కుండబద్దలు కొట్టీ మరీ చెప్పారు. 3 రాజధానుల బిల్లులో లోపాలు సవరించి.. కొత్త బిల్లుతో ముందుకొస్తాం అని తెలిపారు. ప్రత్యేక హోదా విషయం విభజన చట్టంలో ఉందని.. పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు.

హోదా రావాల్సిందే..

హోదా రావాల్సిందే..


ఏపీకి ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బొత్స గుర్తుచేశారు. ప్రత్యేక హోదాని సాధించేవరకు పోరాటం చేస్తాం అని స్పష్టంచేశారు. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసిన ప్రతిసారి విభజన చట్టంలోని అంశాలపై అడుగుతున్నామని గుర్తుచేశారు. శనివారం రోజున సబ్‌ కమిటీ వచ్చే సమావేశంలో చర్చించడానికి తొమ్మిది అంశాలతో కేంద్ర హోంశాఖ ఎజెండాను తయారుచేసిన విషయం తెలిసిందే. ఇందులో ప్రత్యేక హోదా కూడా ఉంది. అయితే రెవెన్యూ లోటు తదితర అంశాలూ చేర్చారు. ఈ సమావేశానికి ఆహ్వానిస్తూ రాష్ట్రాలకు రాసిన లేఖలో కూడా ఇవే అంశాలు ఉన్నాయి. సాయంత్రానికి పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. ఏమయిందో ఏమోగానీ.. తొమ్మిది అంశాలు కాస్తా ఐదుకు తగ్గిన సంగతి తెలిసిందే.

వారి వల్లే వచ్చిందా..?

వారి వల్లే వచ్చిందా..?

ప్రత్యేక హోదా అంశం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని రెండు రాష్ట్రాల కమిటీ అజెండాలో ఉండేది కాదు. దీనిని వైసీపీ ఎంపీలు ఒత్తిడి మేరకు చేర్చారు. ఏపీకి హోదా ఇవ్వడానికి తెలంగాణ అభిప్రాయం కావాలా అనే దుమరం రేగింది. దీంతో నిన్న సాయంత్రం హూటహుటిన తీసివేశారు.

  CM KCR కొత్త రాజకీయ నినాదం Third Front ధీమా | Budget 2022| BJP VS CNG | Oneindia Telugu
  చివరి క్షణంలో తీసివేశారు..

  చివరి క్షణంలో తీసివేశారు..


  రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం పరిష్కారం కాకుండా మిగిలిన సమస్యలపై కేంద్ర హోంశాఖ సమావేశం ఏర్పాటు చేయాల‌ని నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి నేతృత్వంలోని క‌మిటీ స‌మావేశం నిర్వ‌హించ‌నుంది. ఈ నెల 17న ఉదయం 11 గంటల‌కు కమిటీ తొలి భేటీ నిర్వహిస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరగనున్న భేటీలో రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అంశాలపై ప్రధానంగా చర్చలు జ‌రుగుతాయి. ఏయే అంశాలు చర్చించాలన్న విష‌యంపై అధికారులకు కేంద్ర హోంశాఖ ఇప్ప‌టికే సమాచారం అందించింది. షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల విభజన, ఆస్తుల పంపకాలపై చర్చ జ‌రుపుతామ‌ని తెలిపింది. అలాగే, ఆర్థికపరమైన అంశాలపై చర్చ జ‌ర‌గ‌నుంది. స‌మావేశ అజెండాలో ప్ర‌త్యేక హోదా అంశం కూడా ఉంది. చివరి క్షణంలో దానిని తీసివేశారు.

  English summary
  andhra pradesh want special status minister botsa satyanarayana said. 3 capital also established in soon.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X