అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Rain alert:మరో 3 రోజులు వాన, ఏపీలో ఇక్కడ వర్షం

|
Google Oneindia TeluguNews

వాన వదలడం లేదు. కాస్త గ్యాప్ ఇస్తూ వర్షం పడుతూనే ఉంది. అవును తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. రైతులను పనిచేసుకోనివ్వడం లేదు. వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాస్త గ్యాప్ దొరికితేనే తమ పనులను వారు చేసుకుంటున్నారు

ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వెంబడి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం వచ్చే 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఇది ఒడిశా, ఛత్తీస్ గఢ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఇవాళ ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

another 3 days rain lashes in the andhra pradesh state weather officials said.

మిగతా చోట్ల అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. ఈ సారి వానలు బాగానే కురుస్తున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఎగువ నుంచి కూడా వరదనీరు భారీగా వస్తోంది.

వరదనీటితో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో 3 రోజులు వర్షం పడుతుందని తెలియగా.. బెంబేలెత్తిపోతున్నారు. ఈ వర్షం ఏంటీ ఇంతలా పడుతుందని ఆందోళన చెందుతున్నారు. అతివృష్టితో జనం పరేషాన్ అవుతున్నారు. కాస్త వాన వెలిసిందని అనుకోగా.. మరోసారి అల్పపీడనం, వాయుగుండాలు ఏర్పడుతున్నాయి. దీంతో వర్షం కురుస్తూనే ఉంది.

English summary
another 3 days rain lashes in the andhra pradesh state weather officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X