అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిపుణుల కమిటీ నియామకాన్ని సవాల్‌ చేస్తూ రాజధాని కమిటీపై మరో పిటీషన్

|
Google Oneindia TeluguNews

రాజధాని ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడంపై రాజధాని అమరావతి రైతులు భగ్గుమన్నారు. ఈ మేరకు వారు హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని అమరావతి అంశంతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సిఫారసులు చేసేందుకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జీఎన్‌రావు నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తూ గతనెల 13న రాష్ట్రప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక వైసీపీ సర్కార్ జారీ చేసిన జీవో 585ను సవాల్‌ చేస్తూ గుంటూరు జిల్లా బోరుపాలెంకు చెందిన రైతులు చనుమోలు శివలింగయ్య, రామారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక దీని పై వాదనలు కూడా కొనసాగుతున్నాయి.

అమరావతి ఇప్పట్లో తేలదా..: అడ్డు తిరిగిన రైతులు: ఆ కమిటీ రద్దు చేయండంటూ కోర్టుకు..!అమరావతి ఇప్పట్లో తేలదా..: అడ్డు తిరిగిన రైతులు: ఆ కమిటీ రద్దు చేయండంటూ కోర్టుకు..!

ఇదే సమయంలో రాజధాని ఏర్పాటుపై నిపుణుల కమిటీ వేయాల్సిన అవసరం ఏమిటో చెప్పాలని రాజధాని రైతులు డిమాండ్ చేస్తున్న వేళ నిపుణుల కమిటీపై మరో పిటిషన్‌ దాఖలైంది.నిపుణుల కమిటీ నియామకాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో మరికొందరు రాజధాని రైతులు పిటిషన్ వేశారు.గుంటూరు జిల్లా తుళ్లూరుకు చెందిన డి.లక్ష్మీసురేష్‌, గుజ్జర్లపూడి శేషగిరమ్మ,నేలపాడుకు చెందిన గుజ్జర్లపూడి రాజ్యలక్ష్మి, నీరుకొండకు చెందిన మాదాల సురేంద్ర, హైదరాబాద్‌కు చెందిన దాసరి స్వప్న, పర్చూరుకు చెందిన కొల్లూరి జ్యోత్స్న, కురగల్లుకు చెందిన మాదాల శివరామకృష్ణ, వెలగపూడికి చెందిన జి.భానుప్రకాష్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాజధాని కోసం రైతుల వద్ద భూములు కూడా తీసుకుని ఇన్ని ఏళ్ళు గడుస్తుంటే ఇప్పుడు నిపుణుల కమిటీ వెయ్యటం కరెక్ట్ కాదని వారు అంటున్నారు.

Another petition on the Capital Committee challenging the appointment of the Expert panel

రాజధాని కమిటీ విషయంలో కోర్టు ఇప్పటికే పలు పిటీషన్లు దాఖలు అవుతుంటే కౌంటర్‌ దాఖలు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర సీఎస్‌, సీఆర్‌డీఏ కమిషనర్‌, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, నిపుణుల కమిటీకి నోటీసులు జారీ చేసింది. రాజధాని అమరావతి ప్రణాళికల్ని పునస్సమీక్షించేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీ నియామకాన్ని సవాల్‌ చేస్తూ మరికొంతమంది రైతులు హైకోర్టును ఆశ్రయించడం, అమరావతి రైతులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై ఉన్న వ్యతిరేకతను అర్థమయ్యేలా చెబుతుంది.

English summary
Another petition was filed by the farmers against Expert Panel, capital farmers have petitioned in the High Court challenging the appointment of an expert committee on capital. They say that government taken the lands three years ago from the farmers for capital, now the expert committee for capital is not correct.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X