అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్ర విభ‌జ‌న రాజ్యంగా విరుద్దం : పార్టీలు క‌లిసి పోరాడాలి : ఉండ‌వ‌ల్లి

|
Google Oneindia TeluguNews

తాను నిర్వ‌హించిన అఖిల ప‌క్ష స‌మావేశం ఫ‌లప్ర‌దంగా జ‌రిగింద‌ని మాజీ ఎంపి ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చా రు. అన్ని పార్టీల నేత‌లు ఆస‌క్తితో ఈ స‌మావేశంలో పాల్గొన్నార‌ని..అనేక అంశాల పై చ‌ర్చ జ‌రిగింద‌ని వివ‌రించారు. కానీ, త‌మ స‌మావేశం పై అనేక ర‌కాలుగా నెగ‌టివ్ ప్ర‌చారం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. రాష్ట్ర విభ‌జ‌న రాజ్యంగ విరుద్దంగా జ‌రిగిం ద‌ని..చెబుతూ నాటి ప‌రిణామాల‌ను వివ‌రించారు.

AP Bifurcation in unconstitutional : EX Mp Undavalli Arun Kumar..

విభ‌జ‌న రాజ్యాంగ విరుద్దం..
2014 లో జ‌రిగిన రాష్ట్ర విభ‌జ‌న రాజ్యంగా విరుద్దంగా జ‌రిగింద‌ని మాజీ ఎంపి ఉండ‌వ‌ల్లి వివరించారు. ఏపి అసెంబ్లీకి వ‌చ్చి న బిల్లు పై వంద‌లాది స‌వ‌ర‌ణ‌లు ప్ర‌తిపాదించ‌టంతో పాటుగా బిల్లును తిరస్క‌రించార‌ని గుర్తు చేసారు. అసెంబ్లీ తిరస్క రించిన బిల్లు ను పార్ల‌మెంట్ లో ఎలా చ‌ర్చ‌కు పెడ‌తార‌ని చ‌ర్చించారు. లోక్‌స‌భ లో బిల్లు ప్ర‌తిపాదించే మందుగానే ఏపి కి చెందిన 14 మంది స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేసార‌ని గుర్తు చేసారు. అదే విధంగా లోక్‌స‌భ త‌లుపులు కేవ‌లం డివిజ‌న్ స‌మ యంలోనూ మూస్తార‌ని వివ‌రించారు. ఏపి విభ‌జ‌న బిల్లు పై ఎలాంటి డివిజ‌న్ జ‌ర‌గ‌లేద‌ని.. స్పీక‌ర్ నిర్ణ‌యం మేర‌కు బిల్లు పాస్ అయిన‌ట్లు ప్ర‌క‌టించార‌ని గుర్తు చేసారు. ఇక‌, పార్ల‌మెంట్‌లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాలు ప్రారంభం అయిన త‌రువాత ఏనా డు ప్ర‌సారాలు నిలిపివేయ‌లేద‌ని... ఆ రోజు మాత్ర‌మే ప్ర‌సారాలు నిలిపివేసి బిల్లు పాస్ చేసారని వివ‌రించారు. ప‌లువురు మీరు ఆ స‌మ‌యంలో ఏం చేసార‌ని ప్ర‌శ్నిస్తున్నార‌ని..తాము అస‌లు ఆ స‌మ‌యంలో స‌భ‌లో లేకుండా చేసార‌ని ఉండ‌వ‌ల్లి చెప్పుకొచ్చారు.

స‌మావేశం సంతృప్తి ఇచ్చింది...
తాము నిర్వ‌హించిన అఖిల ప‌క్ష స‌మావేశం సంతృప్తి క‌రంగా సాగింద‌ని ఉండ‌వ‌ల్లి పేర్కొన్నారు. వైసిపి..సిపియం మిన‌హా అన్ని పార్టీల ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యార‌ని వివ‌రించారు. అయితే, ఎక్క‌డ హోదా కోసం తీర్మానం చేయ‌లేద‌నే విష‌యం పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని..తాము నిర్వ‌హించిన స‌మావేశ ల‌క్ష్య‌మే రాజ్యాంగ విరుద్దంగా విభ‌జ‌న జ‌రిగింద ని చెప్ప‌ట‌మే అని వివ‌రించారు. దీని కోస‌మే న్యాయ కోవిదులు అయిన సుప్రీం మాజీ న్యాయ‌మూర్తి జస్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్ ను ఆహ్వానించామ‌న్నారు. ఎన్నిక‌ల్లో ఎలా విమ‌ర్శ‌లు చేసుకున్నా..ఏపి ప్ర‌యోజ‌నాల విష‌యంలో ఒక్క‌టిగా ఉండాల ని కోరామ‌ని చెప్పారు. స‌మావేశం లో అన్ని పార్టీల నేత‌లు ఏపికి జ‌రిగిన అన్యాయం పై ఆందోళ‌న వ్య‌క్తం చేసార‌ని ఉం డ‌వ‌ల్లి వివ‌రించారు.

English summary
Ex Mp Undavalli Arun Kumar once again state that Ap division is unconstitutional. He says State Assembly rejected bill should not present in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X