అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గవర్నర్‌తో భేటీ కానున్న సోము వీర్రాజు- అంతర్వేది సహా ఇతర అంశాలపై ఫిర్యాదు...

|
Google Oneindia TeluguNews

ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో విజయవాడ రాజ్‌భవన్‌లో భేటీ కానున్నారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు భేటీ కోసం సోముకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఖరారు చేశారు. దీంతో ఆయన ఏపీలో తాజాగా చోటు చేసుకున్న పలు ఘటనలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు వివరాలతో బయలు దేరారు.

సోము వీర్రాజు టీమ్ ఇదే: బీజేపీ పదాధికారుల లిస్ట్: టీడీపీ మాజీమంత్రులకు కీలక పోస్టులుసోము వీర్రాజు టీమ్ ఇదే: బీజేపీ పదాధికారుల లిస్ట్: టీడీపీ మాజీమంత్రులకు కీలక పోస్టులు

ఉదయం విజయవాడ చేరుకున్న సోము వీర్రాజు కనకదుర్గమ్మ రథంపై వెండి సింహాల మాయం ఘటన నేపథ్యంలో ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం ఆయన అధికారులతో వివరాలు తీసుకోనున్నారు. అనంతరం గవర్నర్‌తో భేటీకి వెళతారు.

ap bjp chief somu veerraju to seek governor action on antarvedi incident and others

ఏపీలో కొన్నిరోజులుగా చోటు చేసుకుంటున్న మతపరమైన ఘటనలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ హరిచందన్‌ను సోము వీర్రాజు కోరనున్నారు. ముఖ్యంగా అంతర్వేది ఆలయ ఘటనలో నిందితులను ఇప్పటికీ గుర్తించలేకపోవడం, ఈ ఘటనకు నిరసనగా అంతర్వేది వెళ్లిన బీజేపీ కార్యకర్తలపై కేసుల నమోదు వంటి అంశాలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లనున్నారు.

అంతర్వేది ఘటనతో పాటు కనకదుర్గమ్మ ఆలయం రథంపై సింహాల మాయంపైనా గవర్నర్‌ చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు కోరబోతున్నారు. దీంతో పాటు వరుసగా మతపరమైన ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సోము ఫిర్యాదు చేయబోతున్నారు. ఈ మేరకు అవసరమైన వివరాలను కూడా సోము సేకరించినట్లు తెలుస్తోంది.

English summary
andhra pradesh bjp state president somu veerraju will meet governor biswabhushan harichandan today in rajbhavan. somu will seek governor action on antarvedi and other religious incidents occured recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X