అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రతి మండలానికి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ : అధికారులను ఆదేశించిన సీఎం జగన్

|
Google Oneindia TeluguNews

ప్రతి మండలానికి ఓ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఉండేలా చర్యలు చేపట్టాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రస్థుతం ఉన్న స్కూళ్లను క్రమపద్దతిలో కాలేజీలుగా మార్చేందుకు ఎలాంటీ చర్యలు తీసుకోవాలో నివేదిక తాయారు చేయాలని అధికారులు సూచించారు.నాడు-నేడు కార్యక్రమం ద్వారా రానున్న రోజుల్లో 44,512 ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.ప్రభుత్వ స్కూళ్ల అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇక రానున్న విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ స్కూళ్లలో ఒకటవ తరగతి నుండి 8th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడీయం విద్యను ప్రవేశపెట్టనున్నట్టు సీఎం తెలిపారు.ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మీడీయం విద్యార్థులకు భోదినలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు చెప్పారు.ఇక ప్రతి ఏడాది జనవరిలోనే ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ చేయాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వంలో ఏశాఖలో ఉద్యోగాలు భర్తి చేయాలన్న జనవరిలోనే పరీక్షలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. రానున్న విద్యా సంవత్సరం నుండి పుస్తకాలు, యూనిఫారమ్స్‌, షూ, స్కూలు బ్యాగ్‌ వంటివన్ని పాఠశాల ప్రారంభమైన మొదటి రోజే అందించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారు.

AP CM Jagan Mohan Reddy reviewed government education system.

ఇక ప్రయివేట్ కాలేజీల్లో సరైన మౌళిక సదుపాయాలు ఉన్నప్పుడు అనుమతులు ఇస్తామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వ కాలేజీల్లో పెద్ద ఎత్తున సౌకర్యాలు మెరుగుపరుస్తున్నందున ప్రైవేట్,స్కూళ్లు కాలేజీల్లో కూడ మౌలిక వసతులకు చర్యలు చేపట్టాలని చెప్పారు. విద్యా సంస్థలు కనీస వసతులు లేకుండా ఉండడం సరైన పద్దతి కాదని ఆయన చెప్పారు.

English summary
AP CM Jagan Mohan Reddy has directed the officials to ensure that there is a government junior college in each mandal in the state. that the government should prepare a report on what measures should be taken to convert the existing schools into colleges he siad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X