అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డేటా లీకేజీకి అవకాశమే లేదు .. ఏపీ ఐటీశాఖ కార్యదర్శి స్పష్టీకరణ

|
Google Oneindia TeluguNews

అమరావతి : ఐటీ గ్రిడ్ డాటా ఇష్యూ తెలుగు రాష్ట్రాల్లో కాకరేపుతోంది. ఏపీకి సంబంధించిన డాటాపై అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఇదిలా ఉంటే డేటా లీకేజీ జరుగలేదని ఏపీ ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్ స్పష్టంచేశారు. మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఆధార్ డేటా చోరికి గురయ్యే ఆస్కారం లేదని స్పష్టంచేశారాయన.

భద్రంగా డేటా

భద్రంగా డేటా

కంప్యూటకరీంచిన డేటా భద్రంగా ఉందని తెలిపారు. ప్రతిసారి ప్రజాసాధికార సర్వే జరుగుతుందని .. ఇందులో కొత్తేం లేదన్నారు. సర్వే ద్వారా తీసుకున్న డాటా మొత్తం సేఫ్, అండ్ సెక్యూర్ గా ఉందని స్పష్టంచేశారు. ఏపీ ప్రజలకు సంబంధించి ప్రభుత్వ శాఖ అడిగితే ఇస్తామని పేర్కొన్నారు. ఆ సమాచారాన్ని ప్రభుత్వ శాఖలు మాత్రమే వెబ్ సర్వీస్ ద్వారా యాక్సిస్ చేసి .. లబ్ధిదారులకు సేవలు అందిస్తాయని తెలిపారు.

నిరాధార ఆరోపణలు చేయొద్దు

నిరాధార ఆరోపణలు చేయొద్దు

ప్రజాసాధికార సర్వే డేలా లీక్ అయిందనే వార్తలను తోసిపుచ్చారాయన. అలాంటి సమస్యే ఉత్పన్నం కాదన్నారు. ఈ డేటా బేస్ ఆధారంగానే 26 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు, 4 లక్షలకు పైగా నిరుద్యోగులకు భృతి, తిత్లీ బాధిత రైతులకు నష్టపరిహారం, 95 లక్షలకుపైగా మహిళలకు పసుపు కుంకుమ పంపిణీ చేశామని గుర్తుచేశారు. 54 లక్షలమందికి ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు పంపిణీ చేశామని .. పూర్తిస్థాయి భద్రతతో కూడిన డేటా బేస్ కావడం వల్లే .. ఇంత భారీగా లబ్ధిదారులకు సేవలు అందించామని పేర్కొన్నారు.

 భయంకర వ్యాధిని గెలిచాడు .. జన్యు పోలికల శస్త్రచికిత్సతో హెచ్ఐవీ దూరం ...<br /> భయంకర వ్యాధిని గెలిచాడు .. జన్యు పోలికల శస్త్రచికిత్సతో హెచ్ఐవీ దూరం ...

1100 డేటా కూడా సేఫ్

1100 డేటా కూడా సేఫ్

ప్రజాసాధికార డేటాతో పాటు ఫిర్యాదు చేసే 1100 సమాచారం కూడా సేఫ్ అని తేల్చిచెప్పారు. ఈ సమాచారం ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లే అవకాశం లేదన్నారు. ప్రభుత్వ శాఖలు అడిగిన ఆ సమాచారం ఇవ్వడం లేదని .. నిరాధార ఆరోపణలు చేసి ప్రజలను గందరగోళానికి గురిచేయొద్దని సూచించారు.

English summary
The computational data is safe. Every time a public surveys are going on, there is nothing new. The data taken by the survey indicates that it is safe and secure. Asked by the Government of India regarding the AP people, ap it secretary vijayanand said. Only government departments have access to the information through the web service and will provide services to the beneficiaries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X