అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

76 వేల మంది పోలీసు సిబ్బంది వీడియో కాన్ఫరెన్స్: ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై నిర్దేశం..

|
Google Oneindia TeluguNews

ఒక నెగిటివ్ పనితో చేసిన మంచి పని కూడా పోతోంది. ఇదీ పోలీసులకు చక్కగా పనిచేస్తోంది. ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో 76 వేల మంది పోలీసులతో డీజీ గౌతమ్ సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీసీలో ఫ్రెండ్లీ పోలీసింగ్ తరహాలో ఉండాలని వివరించారు. ఇటీవల జరిగిన శిరోముండనం ఘటనతో పోలీసుల ప్రవర్తన నియమావళిపై దిశానిర్దేశం చేశారు. దీనిపై నిన్ననే పోలీసు ఉన్నతాధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే డీజీపీ తమ కార్యాచరణ ప్రారంభించారు.

ప్రజలను గౌరవించాలి.. నేరస్తులు భయపడాలి.. కానీ..

ప్రజలను గౌరవించాలి.. నేరస్తులు భయపడాలి.. కానీ..

ప్రజలు పోలీసులను గౌరవించాలని.. నేరస్తులు భయపడాలని గౌతమ్ సవాంగ్ అన్నారు. కానీ వారిని చిన్నచూపు చూడొద్దన్నారు. కరోనా వైరస్ సోకిన సమయంలో పోలీసులు మంచి పేరు తెచ్చుకున్నారని గుర్తుచేశారు. కానీ శిరోముండనం ఘటనతో ఒక పీఎస్‌లో తప్పు జరిగితే అందరినీ నిందిస్తారని పేర్కొన్నారు. పోలీసుల్లో మార్పు ముఖ్యమని.. సామాన్య ప్రజలకు పోలీసుల సేవలు అందుబాటులో ఉండాలన్నారు.

తప్పుగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు

తప్పుగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు

ప్రజలతో మిస్ బీహెవ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు సిబ్బంది మీద పోలీసులే చర్యలు తీసుకోవడం బాధాకరంగా ఉంటుందని.. కానీ చెడు వెళ్లడం వల్ల తప్పడం లేదన్నారు. ప్రతీ పోలీసు ఆత్మ విమర్శ చేసుకొని పనిచేయాలని సూచించారు. అందరం కలిసి పనిచేద్దామని.. మార్పు దానంతట అదే వస్తుందని చెప్పారు. వచ్చే 2 నెలలు పోలీసు సిబ్బంది ఓరియంటేషన్ క్లాసులకు అటెండ్ కావాలని కోరారు. ప్రతీ పోలీసు స్టేషన్‌లో మార్పు కనిపించాలని స్పష్టంచేశారు. స్టేషన్ వచ్చినవారిని జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవాలని మరీ మరీ చెప్పారు.

Recommended Video

Visakhapatnam : మధురవాడ కొమ్మాది సమీపంలో Quarantine Centre లో అగ్ని ప్రమాదం ! || Oneindia Telugu
 మనతో సమానమే కదా...

మనతో సమానమే కదా...

పోలీసులు ఎవరైనా తప్పు చేస్తే చర్యలు తప్పవని సీఐడీ ఏడీజీపీ సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం సంబంధిత అధికారి కూడా నేరస్తుడు అవుతాడని తెలిపారు. సాక్షుల వద్ద తీసుకునే వివరాలు 161crpc ప్రకారం వీడియోగ్రాఫ్ తీసుకుంటామని పేర్కొన్నారు. సమస్యతో వచ్చిన వారితో దుర్భాషలాడొద్దని సూచించారు. పోలీసులు చట్టానికి సైనికులు మాత్రమేనని తేల్చిచెప్పారు.

English summary
andhra pradesh dgp goutham sawang video conference by 76 thousand police staff in today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X