అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిసెంబర్ 24 నుంచి ఏపీ డీఎస్సీ పరీక్షలు.. కొత్త షెడ్యూల్ రిలీజ్

|
Google Oneindia TeluguNews

అమరావతి : ఏపీ డీఎస్సీ పరీక్షలను రెండు వారాల పాటు వాయిదా వేసిన నేపథ్యంలో కొత్త షెడ్యూల్ విడుదలయింది. డిసెంబర్ 24 నుంచి పరీక్షలు మొదలుకానున్నాయి. తొలుత షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 6 నుంచి డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ప్రకటనకు, పరీక్షలకు మధ్య సమయం తక్కువుందన్న అభ్యర్థుల వినతి మేరకు మంత్రి గంటా శ్రీనివాసరావు 2 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. అదలావుంటే డీఎస్సీ పరీక్షలు ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు.

కొత్త షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరిగే తేదీలు, వివరాలు :

AP DSC exams new schedule released
1. హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ : డిసెంబరు 10 నుంచి
2. స్కూల్ అసిస్టెంట్‌ (భాషేతర) పరీక్షలు : డిసెంబరు 24, 26, 27
3. స్కూల్ అసిస్టెంట్‌ (భాషలు) పరీక్షలు : డిసెంబరు 28న
4. పోస్టుగ్రాడ్యుయేట్‌ ఉపాధ్యాయ పరీక్షలు: డిసెంబరు 29న
5. ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ ఉపాధ్యాయ, వ్యాయామ(పీఈటీ) పరీక్షలు : డిసెంబరు 30 నుంచి జనవరి 1 వరకు
6. ప్రిన్సిపళ్లు, మ్యూజిక్‌, క్రాఫ్ట్‌, ఆర్ట్‌, డ్రాయింగ్‌ పరీక్షలు : జనవరి 2న
7. భాషాపండితులకు సంబంధించిన పరీక్షలు : జనవరి 3న
8. సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ (ఎస్జీటీ) పరీక్షలు : జనవరి 18 నుంచి 30వరకు

వాస్తవానికి డిసెంబర్ 6న జరగాల్సిన పరీక్షలను రెండు వారాల పాటు వాయిదా వేశారు. అయితే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాత్రం సమయం పొడిగించలేదు.

English summary
The new schedule has been released in the wake of the two weeks delayed AP DSC exams. Examinations will start from December 24. DSC exams will conducted online.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X