అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు నిర్వాకం..! ఏపీ నెత్తిన అప్పు 3.62 ల‌క్ష‌ల కోట్లు.. శ‌్వేత‌ప‌త్రం విడుద‌ల‌..!

|
Google Oneindia TeluguNews

రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత నాటి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఆర్దిక ప‌రిస్థితిని దీన స్థితిలోకి తెచ్చింద‌ని ఆర్దిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాధ్ ఆరోపించారు. రాష్ట్ర ఆర్ధిక ప‌రిస్థితి పైన ఆయ‌న శ్వేత ప‌త్రం విడుద‌ల చేసారు. 2014-19 మధ్య ఏపీ అస్తవ్యస్థమైందని, ప్రజలు అనుకున్నట్టు పరిపాలన సాగలేదని, ఏ రంగంలోనూ పురోగమనం చూడలేదని దుయ్య‌బ ట్టారు. ప్రస్తుతం రాష్ట్రం రూ.66వేల కోట్ల ఆర్థిక లోటులో ఉందని, విభజన నాటికి రూ.20వేల కోట్ల ఆర్థికలోటులోనే ఉన్నామని తెలిపారు. ఏపీకి ప్రస్తుతం రూ.3.62లక్షల కోట్ల అప్పు ఉందని మంత్రి బుగ్గ‌న వివ‌రించారు.

ఆర్దిక ప‌రిస్థితి పైన శ్వేత‌ప‌త్రం..

ఆర్దిక ప‌రిస్థితి పైన శ్వేత‌ప‌త్రం..

ఏపీ ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. దేశంలో ద్రవ్యోల్బణం 2014 నాటికి బాగా తగ్గుముఖం పట్టిందని, ఆ సమయంలో ఏపీలో ధరలు విపరీతంగా పెరిగాయని ఆయన చెప్పారు. 2014-19 మధ్య ఏపీ అస్తవ్యస్థమైందని, ప్రజలు అనుకున్నట్టు పరిపాలన సాగలేదని, ఏ రంగంలోనూ పురోగమనం చూడలేదని చెప్పుకొ చ్చారు. రాష్ట్ర విభ‌జ‌న నాటికి రాష్ట్ర రెవిన్యూ లోటు 16 వేల కోట్లుగా నిర్ధారించార‌ని..ప్ర‌స్తుతం అది 66 వేల కోట్ల‌కు చేరిం ద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వం ఎన్నిక‌ల నాటికి కాంట్రాక్ట‌ర్ల బిల్లుల‌ను చెల్లించి..మిగిలిన రంగాల్లో అలాగే పెండింగ్ పెట్టార‌ని లెక్క‌లు చెప్పారు. ప్ర‌స్తుతం 18 వేల కోట్ల‌కు పైగా పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉంద‌ని వివ‌రించారు. రాష్ట్రంలో ఆర్ది క ప‌రిస్థితి ఇలా ఉంటే..అభివృద్ది అంటూ లేని లెక్క‌లు చెప్పార‌న్నారు. గ‌త ప్ర‌భుత్వ హయాంలో వ్యవసాయరంగంలో అద్భుత ఫలితాలు వచ్చాయన్నది అబద్ధమన్నారు.

ఏపీ పైన అప్పు 3.62 ల‌క్ష‌ల కోట్లు..రెవెన్యూ లోటు రూ. 66 వేల కోట్లు

ఏపీ పైన అప్పు 3.62 ల‌క్ష‌ల కోట్లు..రెవెన్యూ లోటు రూ. 66 వేల కోట్లు

ప్ర‌స్తుతం ఏపి పైనా 3.62ల‌క్ష‌ల కోట్ల మేర అప్పు ఉంద‌ని బుగ్గ‌న తేల్చి చెప్పారు. ఏపీలో వినియోగ ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో పెద్ద ఎత్తున అప్పులు చేసిందని.. ప్రస్తుతం ఆ అప్పులు రాష్ట్రానికి భారంగా మారాయని పేర్కొన్నారు. మొత్తంగా రాష్ట్రంపై 3 లక్షల 62 వేల కోట్ల రూపాయల అప్పు భారం మోపారన్నారు. తమ ప్రభుత్వం మానవ వనరులపై దృష్టి సారించి వారిపైనే ఎక్కువ పెట్టుబడి పెట్టాలనే యోచనలో ఉందన్నారు.ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట ప్రకారం రాష్ట్ర జీడీపీలో 3 శాతం దాటి అప్పులు చేయకూడదు. కానీ గత ప్రభుత్వం ఆ పరిమితిని దాటి అప్పులు చేసింది. పన్ను రూపంలో వచ్చే ఆదాయం పరంగా చూసినట్లైతే తెలంగాణ కంటే మనం బాగా వెనుకబడి ఉన్నాం. మౌలిక రంగాల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టలేదు. రాష్ట్ర రెవెన్యూ లోటు 66 వేల కోట్ల రూపా యలకు పెరిగింద‌ని బుగ్గ‌న వివ‌రించారు.

అయిదేళ్లూ ఓవ‌ర్ డ్రాఫ్ట్ పైనే..

అయిదేళ్లూ ఓవ‌ర్ డ్రాఫ్ట్ పైనే..

గత ఐదేళ్ల పాటు ఏపీ ఓవర్‌ డ్రాఫ్ట్‌ మీదే బతికిందని, పోతూపోతూ మన నెత్తిన అప్పును గుమ్మరించి పోయారని బుగ్గ‌న దుయ్యబట్టారు. విద్యుత్‌ లాంటి రంగాలు పూర్తిగా కుదేలయ్యాయని, పౌరసరఫరాలాంటి శాఖల నిధులను పసుపు-కుంకుమకు వాడేశారని ఆరోపించారు. చంద్రన్న కానుకల కోసం ఖర్చుపెట్టిన సొమ్ముకూడా చంద్రబాబు భర్తీ చేయలేదని ఆర్దిక మంత్రి చెప్పుకొచ్చారు. రాజ‌ధాని గురించి ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ప్ర‌జ‌ల క‌నీస అవ‌స‌రాల ను వ‌దిలి లండ‌న్‌..పారిస్ క‌డ‌తామ‌ని చెప్ప‌లేమ‌ని..ఖ‌చ్చితంగా రాజ‌ధాని సైతం నిర్మాణం చేస్తామ‌ని స్ప‌ష్టం చేసారు. ఆర్దిక ప‌రిస్థితి గురించి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ భ‌య‌ప‌డ‌టం లేద‌ని..ఖ‌చ్చితంగా ప‌రిస్థితిని కంట్రోల్‌లోకి తీసుకొస్తామ‌ని బుగ్గ‌న ధీమా వ్య‌క్తం చేసారు. తమ బ‌డ్జెట్‌లో అన్న రంగాల‌కు ప్రాధాన్య‌త ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసారు.

English summary
AP finance minister released white paper on state financial status. Minister said that AP is in loans of 3.62 cr lakhs. At the samt time AP is in 66,000 cr revenue deficit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X