అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపికి అప్పు కావాలి : మూడు వేల కోట్లు అత్య‌వ‌స‌రం : 14 రోజులుగా ఓడి లో ఏపి..

|
Google Oneindia TeluguNews

ఏపి ఆర్దిక ప‌రిస్థితి దిగ‌జారింది. అప్పులు ఎవ‌రిస్తార‌నే ఎదురు చూసే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇప్ప‌టికే 14 రోజులుగా ఓడి లో ఉంది ఏపి రాష్ట్రం. ఇప్ప‌టికిప్పుడు మూడు వేల కోట్లు ఏపికి అత్య‌వ‌స‌రంగా మారాయి. దీంతో..కార్పోరేష‌న్ల ద్వారా ప్రాజెక్టుల‌ను త‌న‌ఖా పెట్టి రుణం తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. 14 రోజుల వ‌ర‌కు మాత్ర‌మే ఇచ్చి ఓడి స‌మ‌యం ముగియ‌టం తో ఆర్బీఐ నుండి ఒత్తిడి మొద‌లైంది..

ఏపి ఆర్దిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతోంది. ఇప్ప‌టికే అప్పులు చేసిన రాష్ట్రం మ‌రింత‌గా అప్పులు చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. త‌క్ష‌ణం మూడు వేల కోట్ల రూపాయాలు అవ‌స‌రంగా క‌నిపిస్తోంది. దీని కోసం కేంద్ర ప‌న్నుల వాటా తో పాటుగా ఇత‌ర‌త్రా అదాయం స‌మ‌కూర్చుకొనే మార్గాల పై ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. ఇందు కోసం కార్పోరేష‌న్ల ద్వా రా ప్రాజెక్టుల‌ను త‌న‌ఖా పెట్టి అద‌నంగా రుణాలు తెచ్చేందుకు ఏప ఆర్దిక శాఖ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

AP Govt in financial Crisis : since 14 days Govt in O.D...

కార్పోరేష‌న్ల రుణ ప‌రిమితిని పెంచేందుకు అనుకూలంగా ప్ర‌భుత్వ గ్యారెంటీ ఇచ్చే ఏర్పాట్ల‌ను వేగ‌వంతం చేసారు. ఆర్బీఐ వ‌ద్ద ఏ బదులు..ట్రెజ‌రీ అడ్వాన్సులు కాకుండా..ఏపి ఆర్దిక నిల్వ‌ల‌కు మించి దాదాపు రూ 350 కోట్లు ఆద‌నంగా ఆర్దిక శాఖ ఇప్ప‌టికే వాడుకుండి. అనివార్య ప‌రిస్థితిల్లో ఓడికి వెళ్లామ‌ని చెబుతున్న ఏపి ఆర్దిక శాఖ అధికారులు..

14 రోజులుకు మించి ఓడి వాడుకొనే అవ‌కాశం లేక‌పోవ‌టంతో ఇప్పుడు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. గ‌త 14 రోజులుగా ఏపి ఓడిలోనే ఉంది. స‌మ‌యం ముగియ‌టం తో ఆర్బీఐ నుండి ఒత్తిడి మొద‌లైంది. ఓడిగా తెచ్చిన మొత్తం సర్దుబాటు చేయ‌టానికి ఆర్దిక శాఖ అధికారులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.

మూడు వేల కోట్ల కోసం పాట్లు..
ఏపికి అత్య‌వ‌స‌రంగా ఇప్పుడు మూడు వేల కోట్ల రూపాయాలు అవ‌స‌రం. దీని కోసం ఇరిగేష‌న్ కార్పొరేషన్‌ ద్వారా రూ.3000కోట్లు అప్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కార్పొరేషన్‌ ద్వారా రూ.4000కోట్లు రుణం తీసు కువచ్చి వివిధ అవసరాలకు సర్దుబాటు చేశారు. గతంలో రుణాలు తీసుకునేందుకు ఈ కార్పొరేషన్‌పై ఉన్న పరిమితి నీ ఎత్తివేశారు.

అన్నం కూడా పెట్ట‌లేదు : ఈడీ పై కోర్టుకు సుజ‌నా ఫిర్యాదు.. అన్నం కూడా పెట్ట‌లేదు : ఈడీ పై కోర్టుకు సుజ‌నా ఫిర్యాదు..

ఇప్పుడు అదనంగా రూ.3000 కోట్లు బ్యాంకుల నుంచి జలవనరుల కార్పొరేషన్‌ సమీకరించనుందని సమాచారం. ఇక‌, ఇదే స‌మ‌యంలో కేంద్ర ప‌న్నుల వాటా పైనా ప్ర‌భుత్వం ఆశ‌లు పెట్టుకుంది.

రూ. 8000 వేల కోట్ల‌కు పైగా చెల్లింపులు పెండింగ్‌..
ప్ర‌స్తుతం ఆర్దిక శాఖ ప‌రిస్థితి అగమ్య గోచ‌రంగా మారుతోంది. త‌క్ష‌ణ అవ‌స‌రాల కోసం ప్ర‌తీ నెలా 20వ తేదీన కేంద్ర ప‌న్నుల వాటాగా వ‌చ్చే మొత్తం కోసం ఏపి ఆర్దిక శాఖ ఎదురు చూస్తోంది. ఈ విధంగా ఏపి ప్ర‌భుత్వానికి త‌క్ష‌ణం 2000 కోట్ల వ‌ర‌కు ఏపికి స‌మ‌కూరే అవ‌కాశం ఉంది. ఇందులో ఆర్బీఐ కి చెల్లించాల్సిన ఓడి మొత్తం..వ‌డ్డీని చెల్లించ‌ను న్నారు. ఇక ఏపి ప్ర‌భుత్వం వివిధ బ‌కాయిల కింద 8000 కోట్ల రూపాయ‌ల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో నెలాఖ‌రు నాటికి జీతాలు..ప్ర‌స్తుతానికి నిలిపివేసిన చెల్లింపులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక‌, పెథాయ్ తుఫాను కార‌ణంగా న‌ష్ట‌పోయిన బాధితుల‌కు ప‌రిహారం అందించాల్సి ఉంది. ప్ర‌స్తుత ఆర్దిక ప‌రిస్థిత‌ని ప‌ర్య‌వేక్షిస్తున్న ఆర్దిక శాఖ అధికారులు మాత్రం వ‌చ్చేది ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌టంతో..మ‌రిన్ని స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌నే అంచనా వేస్తున్నారు.

English summary
AP Govt in Financial Crisis. Ap govt pending bills total cost of rs 8000 cr. Govt need immediately rs 3000 cr. Ap Govt waiting for state Govt share in Central Taxes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X