అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపి ప‌ధ‌కాల ల‌బ్ది దారుల డేటా చోరీ: విజ‌య‌సాయి రెడ్డి ఫిర్యాదు : సైబ‌రాబాద్ పోలీసుల సోదాలు..!

|
Google Oneindia TeluguNews

ఏపిలోని ప్ర‌భుత్వం అందిస్తున్న సంక్షేమ ప‌ధ‌కాల ల‌బ్ది దారుల డేటా మొత్తం చోరికి గురైంది. ఓ ప్ర‌యివేటు కార్యాల యం లో ఈ డేటా ఉందంటూ వైసిపి ఎంపి పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. దీని పై పోలీసులు విచార‌ణ ముమ్మ‌రం చే సారు. ఓట‌ర్ల జాబితా తొలిగింపు..చేరిక‌ల పై ఏపిలో ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్న ప‌రిస్థితుల్లో ఇప్పుడు ఈ డేటా ప్రైవేటు కార్యాల‌యం లో దొర‌క‌టం సంచ‌ల‌నం గా మారింది.

ప‌ధ‌కాల ల‌బ్దిదారుల డేటా చోరీ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల డేటా మొత్తం చోరీకి గురైంది. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటా మొత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కార్యాలయంలో ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఈ మేరకు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్లూ ఫ్రాగ్ మొబైల్స్ టెక్నాలజీ కంపెనీపై కేసు నమోదు చేసి, కూకట్‌పల్లిలోని ఆ సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఓటర్ కార్డు, ఆధార్ కార్డులు ఆ కంపెనీలో ఉన్నట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఆ కంపెనీకి చెందిన రెండు ప్రధాన కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

AP Govt Schemes tags beneficiary list found in Pvt company : Polilce start enquiry

ఓట్ల చేరిక‌లు..మార్పుల‌కు లింకు ఉందా..
ఏపిలో భారీగా ఓట‌ర్ల మార్పులు..తీసివేత‌లు జ‌రుగుతున్నాయంటూ కొంత కాలంగా ప్ర‌తిప‌క్ష వైసిపి పెద్ద ఎత్తున ఆరోప ణ‌లు చేస్తోంది. దీని పై ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిసి నేరుగా వైసిపి అధినేత జ‌గ‌న్ ఫిర్యాదు చేసారు. దీని పై కోర్టులోనూ కేసులు న‌మోదు చేసారు. దీనికి కౌంట‌ర్ గా టిడిపి నేత‌లు ఇదే ర‌క‌మైన ఆరోప‌ణ‌ల‌తో ముందుకు వ‌చ్చారు. నేరుగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దీని పై టెలి కాన్ఫిరెన్స్ లోనూ స్పందించారు. వైసిపి నేత‌లు ఓట్ల‌ను తొలిగిస్తూ కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. ఇప్పుడు హైద‌రాబాద్ కేంద్రంగా ఓ ప్ర‌యివేటు సంస్థ‌లో ఇలా ప్ర‌భుత్వం వ‌ద్ద ఉం డాల్సిన స‌మాచారం దొర‌కటం క‌ల‌క‌లం రేపుతోంది. అందునా ఈ వ్య‌వ‌హారం పై వైసిపి ఎంపి విజ‌య‌సాయిరెడ్డి ఫిర్యాదు చేయ‌టం..పోలీసులు సోదాలు నిర్వ‌హించ‌టం తో ఈ విష‌యం ఎటువైపు మ‌లుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ మొద‌లైంది.

English summary
AP Govt Schemes beneficiary list found in pvt company in cybereabad. YCP MP Vijaya Sai Reddy complain on this issue to Police. Hyderabad police found date in this office and started enquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X