అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ పంచాయతీ ఏకగ్రీవాలపై ఫోకస్, అక్రమంగా జరిగితే అంతే, కలెక్టర్లు, ఎస్పీలకు నిమ్మగడ్డ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన దూకుడు కొనసాగిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడమే గాక.. అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే క్యాస్ట్, ఇన్ కం సర్టిఫికెట్ జారీలో ఆలసత్వం వహించొద్దు అని స్పష్టంచేశారు. ఒకవేళ కావాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇక కలిసి పనిచేద్దాం..

ఇక కలిసి పనిచేద్దాం..

కలెక్టర్లు, ఎస్పీలు ఇదివరకు జరిగిన అన్నీ విషయాలు మరచిపోవాలని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. అన్నీ సజావుగా జరిగేలా చూడాలని కోరారు. ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్క్షానం వినియోగించాలని కోరారు. ఓటింగ్ ప్రక్రియ పర్యవేక్షించేందుకు ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నామని తెలిపారు. వీడియో, ఫోటో యాప్ ద్వారా అప్‌లోడ్ చేయొచ్చని సూచించారు.

ప్రచారం నో..

ప్రచారం నో..

పంచాయతీ ఎన్నికల్లో వాలంటీర్లను వినియోగించొద్దు అని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ప్రచారం కార్యక్రమంలో పాల్గొనొద్దని.. ఒకవేళ వెళితే చర్యలు తప్పవని చెప్పారు. నోటిఫికేషన్ విడుదల చేసిన చోట ఏకగ్రీవాలపై ఫోసకస్ చేశామని తెలిపారు. యూనానిమస్ ఎలా అవుతుందో అనే అంశంపై దృష్టిసారించామని తెలిపారు. అంతేకాదు అక్రమ పద్దతిలో ఏకగ్రీవంగా అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకు ఆర్వో, ఏఆర్వో బాధ్యులు అవుతారని వార్నింగ్ ఇచ్చారు. తప్పుచేసినా వారిని ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టంచేశారు.

Recommended Video

Andhra Pradesh Governor Biswabhushan Harichandan ON AP 3 Capitals | Oneindia Telugu
డేగా కన్ను

డేగా కన్ను

ఏపీలో ఎస్ఈసీ వర్సెస్ సర్కార్ వార్ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గత ఏడాది ఎన్నికలకు నిమ్మగడ్డ వాయిదా వేయడంతో వివాదం చెలరేగింది. ఆయనను తప్పించడం.. కొత్త ఎస్ఈసీ నియమించడం కూడా జరిగిపోయింది. అయితే హైకోర్టు జోక్యంతో.. తిరిగి నిమ్మగడ్డ పదవీ చేపట్టారు. అప్పటినుంచి వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నిక నిర్వహణకు ఎస్ఈసీ సిద్దమయ్యారు. అయితే ఏకగ్రీవాలపై డేగా కన్ను వేశామని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు.

English summary
andhra pradesh sec nimmagadda ramesh kumar instructions to officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X