అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హోదా తో కుస్తీ : ఎన్నిక‌ల ముందు భేటీలు : ప‌వ‌న్ నాయ‌కత్వం వ‌హిస్తారా..!

|
Google Oneindia TeluguNews

ఏపికి ప్ర‌త్యేక హోదా మరోసారి ఏపిలో కీల‌క అంశం గా మారుతోంది. మ‌రి కొద్ది రోజుల్లో ఎన్నిక‌ల షెడ్యూల్ రానుండ టంతో ఈ అంశం మ‌రో సారి తెర మీద‌కు వ‌చ్చింది. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీల అమ‌లు పైనా చ‌ర్చ లు మొద‌ల‌య్యాయి. రెండు అఖిల ప‌క్ష భేటీలు ఏర్పాటు చేసారు. ఇందులో రాజ‌కీయ ల‌క్ష్యాలు ఉన్నాయి. పార్టీలుగా విడివిగా పోటీ చేసినా..హోదా కోసం క‌లిసి రావాల‌ని ప‌వ‌న్ పిలుపునిచ్చారు. మ‌రి..అందుకు పార్టీలు అంగీక‌రిస్తాయా. మ‌రి ఏ పార్టీ ఎవ‌రిని కార్న‌ర్ చేస్తుంది..ఎవ‌రెటు వైపు మొగ్గుతారు..

ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ నేతృత్వంలో..

ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ నేతృత్వంలో..

ఏపి పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం అమ‌లు..ఏపికి ప్ర‌త్యేక హోదా అంశాల ప్ర‌ధాన అజెండా మాజీ ఎంపి ఉండ‌వ‌ల్లి అరుణ్‌ కు మార్ అఖిల‌క్ష స‌మావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో వైసిపి మిన‌హా మిగిలిన పార్టీలు హాజ‌ర‌వుతున్నాయి. ఈ వేదిక ద్వారా ఏపికి దక్కాల్సిన ప్ర‌యోజ‌నాలు..వాటి స్థితి గ‌తులు..భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక పై చ‌ర్చించ‌నున్నారు. ఈ వేదిక ద్వారా పార్టీలు ఏపికి రావాల్సిన ప్ర‌యోజ‌నాల పై చ‌ర్చించ‌నున్నారు. అయితే, భ‌విష్య‌త్ లో వ్య‌వ‌హ‌రించాల్సిన తీరు పై ఎవ‌రు నాయ‌క‌త్వం వ‌హిస్తారు. ఈ వేదిక ద్వారా బిజెపి ల‌క్ష్యంగా మారుతుందా. మ‌రోసారి కాంగ్రెస్ చేసిన విభ‌జ‌న తీరు పై చ‌ర్చ సాగుతుందా. అస‌లు ఈ వేదిక ద్వారా ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ సాధ్య‌మా అనే చ‌ర్చ సాగుతోంది.

జనసేనలో చేరేలా ఆయనను ఒప్పించా, రాక కోసం వేచి చూస్తున్నా: పవన్ కళ్యాణ్ జనసేనలో చేరేలా ఆయనను ఒప్పించా, రాక కోసం వేచి చూస్తున్నా: పవన్ కళ్యాణ్

టిడిపి సై ... వైసిపి నై

టిడిపి సై ... వైసిపి నై

ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఏర్పాటు చేసిన అఖిల‌ప‌క్ష సమావేశానికి ఇప్ప‌టికే అన్ని పార్టీల‌ను ఆహ్వానించారు. ఇందు లో కాంగ్రెస్ -బిజెపి- వామ‌ప‌క్షాల‌తో పాటుగా టిడిపి-జ‌న‌సేన సైతం పాల్గొంటున్నాయి. టిడిపి ఉన్న వేదిక తాము పంచు కోలేమంటూ వైసిపి ఈ స‌మావేశాన్ని బ‌హిష్క‌రించింది. ఇదే స‌మ‌యంలో వైసిపి రాని విష‌యాన్ని నిర్ధారించుకొని చివ రి నిమిషంలో టిడిపి ఈ స‌మావేశానికి హాజ‌రు కావాల‌ని నిర్ణ‌యించింది. ఇందు కోసం టిడిపి నుండి న‌క్కా ఆనంద‌బాబు ,సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న రెడ్డి హాజ‌రు కానున్నారు. తాము బిజెపి తో విబేధించిన తీరు..రాహుల్ హోదా కోసం హామీ ఇవ్వ‌టంతో వారికి ద‌గ్గ‌రైన విధానాన్ని నేత‌లు వివ‌రించనున్నారు. ఇక‌, కాంగ్రెస్ - బిజెపి నేత‌లు త‌మ వాద‌న‌ను గ‌తం లో లాగానే వినిపించే అవ‌కాశం ఉంది. ఇందులో ప్ర‌జా సంఘాలు సైతం హాజ‌రు కానుండ‌టంతో..వారి ఇప్ప‌టికే ఫిబ్ర‌వ రి 1న బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ సమావేశం ద్వారా ఆ బంద్ కు ముక్త‌కంఠంతో బంద్ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించే అవ‌కా శం క‌నిపిస్తోంది.

ప‌వ‌న్ నాయ‌క‌త్వం వ‌హిస్తారా..

ప‌వ‌న్ నాయ‌క‌త్వం వ‌హిస్తారా..

ఈ స‌మావేశం ద్వారా కేంద్రం పై పోరాటానికి సిద్దం కావాల‌ని తీర్మానించే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి ఢిల్లీలో దీక్షకు సిద్దం అవుతున్నారు. ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ ఉమ్మ‌డి పోరాటానికి పిలుపునిచ్చారు. టిడిపి ఆ పోరాటా నికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. దీని ద్వారా వైసిపి ని ల‌క్ష్యంగా చేసుకోవాల‌ని టిడిపి భావిస్తోంది. ఇదే స‌మ యం లో ఇత‌ర పార్టీలు.. ప్ర‌జా సంఘాలు సైతం ప‌వ‌న్ నాయ‌క‌త్వానికి మ‌ద్ద‌తు ఇచ్చే ఛాన్స్ క‌నిపిస్తోంది. ప‌వ‌న్ ఎన్నిక ల స‌మ‌యంలో ఈ పోరాటానికి సిద్దం అవుతారా..అన్ని పార్టీల‌ను త‌న నాయ‌క‌త్వంలో ఒక‌టిగా ముందుకు తీసుకెళ్తారా అనేదే ఇప్పుడు చ‌ర్చ‌. అయితే, ఉండ‌వ‌ల్లి ఈ అఖిల‌పక్ష స‌మావేశానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్నా..ప‌వ‌న్ నాయ‌క‌త్వం లో భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ అమ‌లు చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి..వ‌ప‌న్ నిర్ణ‌యం ఏంటో చూడాలి.

English summary
Once again Special status issue becoming key factor in AP politics. Undavalli Arun Kumar conducting all party meeting on this issue. except YCP all parties participatining this meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X