అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అదీ వైసీపీ కేంద్ర కార్యాలయం కాదు.. కుట్రలకు నిలయం..?, కళా వెంకట్రావ్ విమర్శలు..

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ కమిటీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ మండిపడ్డారు. గత 15 నెలల్లో చేసిన అవినీతి నుంచి ప్రజలదృష్టి మరల్చడం కోసం పడుతున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని ప్రశ్నించారు. కానీ టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఇది సరికాదు అని.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు.

వైసీపీలో 50 మంది ఎమ్మెల్యేలు నేర చరితులే - సుప్రీం ఆదేశంతో జగన్, సాయిరెడ్డికి వణుకు: కళా వెంకట్రావువైసీపీలో 50 మంది ఎమ్మెల్యేలు నేర చరితులే - సుప్రీం ఆదేశంతో జగన్, సాయిరెడ్డికి వణుకు: కళా వెంకట్రావు

 అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు..

అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు..

వైసీపీ సర్కార్ తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. గత 15 నెలల హయాంలో జరిగిన అవినీతి కప్పిపుచ్చుకునేందుకే రోజుకో అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని ఫైరయ్యారు. హవాలా వ్యవహారంలో వైసీపీ మంత్రి బాలినేని పేరు బయటకు రాలేదా అని అడిగారు. కానీ మాజీమంత్రి అచ్చెన్నాయుడిపై మాత్రం అక్రమంగా తప్పుడు కేసు పెట్టారని గుర్తుచేశారు.

సీబీఐ విచారణ దృష్టి మరల్చేందుకు

సీబీఐ విచారణ దృష్టి మరల్చేందుకు

వైఎస్ఆర్ కుటుంబంపై సీబీఐ విచారణ దృష్టి మళ్లించడానికి మరో తప్పుడు కేసు నమోదుచేయాలని చూస్తున్నారని ఆరోపించారు. జగన్ అధికారం చేపట్టినప్పటీ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలపై ప్రణాళికబద్ధంగా దాడులు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న కుట్రలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం కాదు, కుట్రలకు కేంద్రాలయం అని మండిపడ్డారు. ఘటనకు అన్నీ ఇక్కడ స్క్రిప్టు ప్రకారం జరుగుతున్నాయని చెప్పారు.

అందరినీ ఇబ్బంది పెట్టి..

అందరినీ ఇబ్బంది పెట్టి..

తొలుత పెట్టుబడిదారులను ఇబ్బందులకు గురిచేశారని.. గత ప్రభుత్వ పథకాలు రద్దు చేశారని.. ఎన్నికల కమిషన్ పై దాడి చేశారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టి బెదిరించారని.. చివరకు మీడియాను కూడా వదల్లేదు అని మండిపడ్డారు. దళితులు, మైనారిటీలపై దాడి చేసి.. పోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక మాఫియా, మద్యం కుంభకోణాలు వైసీపీ అవినీతి చాలానే ఉన్నాయని తెలిపారు.

 ఇన్ సైడర్ ట్రేడింగ్..

ఇన్ సైడర్ ట్రేడింగ్..

3 రాజధానులపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇన్ సైడర్ ట్రెడింగ్ తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. కరోనా కిట్లలో ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని కళా వెంకట్రావ్ ఆరోపించారు. అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారని వైసీపీ కార్యకర్తలే కోర్టులో పిటిషన్ వేశారని గుర్తుచేశారు. తిరుపతిలో భూకుంభ కోణం జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపిన విషయాన్ని పేర్కొన్నారు.

Recommended Video

Rice Cards To Transgenders & Orphans : AP Govt ట్రాన్స్ జెండర్ లకు అండగా ఏపీ సర్కార్ || Oneindia
రఘురామ ఆరోపణలు..

రఘురామ ఆరోపణలు..

ఆలయ భూములు, హుండీల్లోని డబ్బులు వైసీపీ నేతలు కొట్టేస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన ఆరోపణలను ప్రస్తావించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అవినీతి పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా గురించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారా అని అడిగారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని ప్రాజెక్టులు.. ఎన్ని వేల కోట్ల నిధులు తీసుకొచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

English summary
andhra pradesh tdp chief kala venkat rao slams government on various issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X