అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అశోక్ అమెరికా లో ఉన్నా.. : డేటా ఎవ‌రిచ్చార‌నేది ముఖ్యం : ఐటి గ్రిడ్స్‌లో తెలంగాణ డేటా: స‌్టీఫెన్..

|
Google Oneindia TeluguNews

డేటా చోరీలో ప్రమేయం ఉన్నవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ప్రధాన నిందితుడు అశోక్‌ అమరావతి లో ఉన్నా...అమెరికాలో ఉన్నా వదిలేది లేదని సిట్ అధికారి స్టీఫెన్ ర‌వీంద్ర స్ప‌ష్టం చేసారు. చట్టం ముందు అందరూ సమానులే అని, నిందితులు ఎవరైనా వదిలేది లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో ఎన్నో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దర్యాప్తు పారదర్శకంగా చేయాలని చూస్తున్నామన్నారు.

వైసిపి లో చేరిన జ‌య‌సుధ : పోటీ ఎక్క‌డి నుండి అంటే..! వైసిపి లో చేరిన జ‌య‌సుధ : పోటీ ఎక్క‌డి నుండి అంటే..!

ఐటి గ్రిడ్స్ లో తెలంగాణ డేటా..!

ఐటి గ్రిడ్స్ లో తెలంగాణ డేటా..!

రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న డేటా చోరీ కేసు దర్యాప్తులో పురోగతి సాధించినట్లు సిట్‌ చీఫ్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. తెలంగాణ ప్రజల డేటాను కూడా ఐటీ గ్రిడ్స్‌ సంస్థ తీసుకుందని, ఈ కేసులో ప్రతి అంశంపైనా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. డేటా చోరీలో ప్రమేయం ఉన్నవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ప్రధాన నిందితుడు అశోక్‌ అమరావతిలో ఉన్నా...అమెరికాలో ఉన్నా వదిలేది లేదని తెలిపారు. చట్టం ముందు అం దరూ సమానులే అని, నిందితులు ఎవరైనా వదిలేది లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో ఎన్నో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దర్యాప్తు పారదర్శకంగా చేయాలని చూస్తున్నామన్నారు. ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్స్ మొబైల్ టెక్నాలజీతో పాటు ఇంకా ఈ కేసులో ఎవరైన ఉన్నారా అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

డేలా ఎలా వ‌చ్చింది..

డేలా ఎలా వ‌చ్చింది..

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డేటా కూడా ఉండటంతో తమకు అనేకు అనుమానాలు వచ్చాయన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారం ఐటీ గ్రిడ్స్‌ సంస్థకు ఎలా వచ్చింది... విశ్వసనీయంగా ఉంచాల్సిన డేటా ప్రయివేట్‌ సంస్థకు ఎవరిచ్చారు... తెలంగాణ ప్రజల డేటాతో ఎవరికి ప్రయోజనం కలిగించాలనుకుంటున్నారు.. అనే అంశాలపై లోతుగా దర్యాప్తు చేపట్టామన్నారు. టీడీపీ సేవామిత్ర యాప్‌లో ఏపీ, తెలంగాణకు చెందిన కొందరు ఓటర్ల వ్యక్తిగత సమాచారం ఉందని అన్నారు. ఇక డేటా గ్రిడ్స్‌ సీఈవో అశోక్‌ ఎక్కడున్నాడనేది ఇంకా తెలియలేదని, అతడి కోసం గాలిస్తున్నట్లు స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో పురోగతి ఉందని, మరింత సమాచారం కోసం నిపుణుల సహకారం తీసుకుంటున్నామన్నారు.

వ్య‌క్తిగ‌త స‌మాచారం గుర్తించాం

వ్య‌క్తిగ‌త స‌మాచారం గుర్తించాం

ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై గతంలో సోదాలు చేసిన నేపథ్యంలో ఏపీ ప్రజల డేటాను గుర్తించామని, ఆ డేటాతో పాటు వారికి చెందిన ఆధార్‌ వివరాలు ఉన్నాయని స్టీఫెన్ ర‌వీంద్ర చెప్పుకొచ్చారు. అలాగే ఈ కేసులో అమెజాన్‌, గూగుల్‌ సంస్థల కు నోటీసులు ఇచ్చామని, ఇంకా వాటి దగ్గర నుంచి సమాధానం లేదన్నారు. డేటా చోరీపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యా దు చేసిన తర్వాత సేవామిత్రలో ఉన్న కొన్ని యాప్స్‌ తొలగించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. దోషులు ఎవ‌రై నా వ‌దిలేది లేద‌ని స్టీఫెన్ ర‌వీంద్ర స్ప‌ష్టం చేసారు.

English summary
SIT started enquiry on Data Stolen case. Sit Chief Stephen Ravindra says no body can escape from police. He stated they will catch Ahok if he is in Amaravati or in America. Telangana data also found in IT Grids.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X