అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రం పై పోరాటానికి సిద్దం...ఏపి అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముహూర్తం ఖ‌రారు.

|
Google Oneindia TeluguNews

ఏపి శాస‌న‌స‌భా శీతాకాల స‌మావేశాలకు ముహూర్తం ఖ‌రారైంది. పార్ల‌మెంట్ స‌మావేశాల‌తో పాటుగానే ఏపి అసెంబ్లీ స‌మా వేశాల‌ను నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్న శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ స్థానాన్ని ఇదే స‌మా వేశాల్లో భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే మండ‌లి ఛైర్మ‌న్ గా ష‌రీఫ్ పేరును ఖ‌రారు చేసారు. కాగా, డిసెంబ‌ర్ 11న అయిదు రాష్ట్ర ఎన్నిక‌ల ఫ‌లితాలు రానున్నాయి. అదే స‌మ‌యంలో స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. కేంద్రం పై అస్త్రాను మ‌రింత‌గా ఎక్కుపెట్ట‌టానికి శాస‌న‌స‌భ‌ను వేదిక‌గా మ‌ల‌చుకొనే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ప్ర‌తిప‌క్షం వైసిపి ఈ స‌మావేశాల‌కు హాజ ర‌య్యే ఛాన్స్ క‌నిపించ‌టం లేదు.

ఒక వైపు అయిదు రాష్ట్రఆల ఎన్నిక‌లు..మ‌రో వైపు ఏపిలో వేడెక్కిన రాజ‌కీయ ప‌రిస్థితుల న‌డుమ ఏపి అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబ‌ర్ ప‌దో తేదీ నుండి పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల స‌మ‌యంలోనూ ఏపి లోనూ అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందు కోసం ఏర్పాట్లు చేయాల‌ని స్పీక‌ర్ సి బ్బందిని ఆదేశించారు. దాదాపు ప‌ది రోజుల పాటు స‌మావేశాలు జ‌రిగే అవ‌కాశం ఉంది. స‌మావేశాల తొలి రోజున ఇటీవ‌ల మావోయిస్టుల కాల్పుల్లో మ‌ర‌ణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు కు స‌భ నివాళి అర్పించ‌నుంది.

AP winter session starts from December 1st week...

అదే విధం గా శాస‌న మండ‌లి లో కొత్త‌గా ఛైర్మ‌న్ ఎన్నిక జ‌ర‌గాల్సి ఉంది. మండ‌లి స‌మావేశ‌మైన స‌మ‌యంలోనే ఛైర్మ‌న్ ఎన్నిక జ‌ర‌గ నుండి. ఇప్ప‌టి వ‌ర‌కు మండ‌లి ఛైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రించిన ఫ‌రూక్ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌టంతో..ఆయ‌న స్థానం లో ష‌రీప్ నూత‌న ఛైర్మ‌న్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. ఇక‌, కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రం పై నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుం ద‌ని చెబుతున్న ప్ర‌భుత్వం...అంశాల వారీగా శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ‌లు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది.

పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే అక్క‌డ ఎంపీలు నిర‌స‌న కొన‌సాగిస్తూ..ఇక్క‌డ శాస‌న‌స‌భ ద్వారా త‌మ వాయిస్ ను బ‌లంగా వినిపించాల‌నేది ప్ర‌భుత్వ వ్యూహం.

ఇక‌, ఈ స‌మావేశాల స‌మ‌యంలోనే అయిదు రాష్ట్ర ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి. బిజెపి కి వ్య‌తిరేకంగా కూట మి కోసం వివిధ పార్టీల నేత‌ల‌తో స‌మావేశం అవుతున్న స‌మ‌యంలో ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏపిలో హాట్ టాపిక్ గా మార నున్నాయి. కాంగ్రెస్ -టిడిపి పొత్తు తో తెలంగాణ బ‌రిలో దిగ‌టంతో అక్క‌డి ఫ‌లితాల పై రాజ‌కీయ పార్టీల‌తో పాటుగా సాధా ర‌ణ ప్ర‌జ‌లు సైతం దృష్టి సారించారు. దీంతో..అసెంబ్లీ స‌మావేశాల స‌మ‌యంలోనూ దీని పై ఆస‌క్తి క‌ర చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హ‌ణ పై త్వ‌ర‌లోనే నోటిఫికేషన్ విడుద‌ల కానుంది.

English summary
AP assembly winter sessions may start from December first week. Ap govt planning to conduct assembly sessions similar to parliament sessions which starts from December 10th. In this sessions AP council chairman election take place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X