అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిరుద్యోగుల‌కు తీపి క‌బురు : 1051 పంచాయితీ కార్య‌ద‌ర్శుల పోస్టుల కు నోటీఫికేషన్..

|
Google Oneindia TeluguNews

ఏపి లో ఉద్యోగాల భ‌ర్తీ పై ఏపిపిఎస్సీ దృష్టి సారించింది. గ‌తంలో జ‌రిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 వేల పోస్టులు భ‌ర్తీ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే డిఎస్సీ..పోలీసు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు విడుద‌ల అయ్యాయి. ఇక‌, ప‌లు శాఖ‌ల్లోనూ ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్నారు. తాజాగా, మ‌రో 1051 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది.

ఏపిలో ఉద్యోగాల భ‌ర్తీకి నిర్ణయాలు జరుగుతున్నాయి. ఏపి ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు ఏపిపిఎస్సీ భ‌ర్తీ కి సంభందించి నోటిఫికేష‌న్లు విడుద‌ల చేస్తోంది. అందులో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా 1051 పంచాయతీ కార్యదర్శుల పోస్టు లకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఏపిపిఎస్సీ విడుద‌ల చేసిన పోస్టుల వివ‌రాలు చూస్తే..శ్రీకాకుళం- 107, విజయనగరం-119, కర్నూలు-88, విశాఖ- 105, తూ.గో- 92, ప.గో- 21, కృష్ణా- 19, గుంటూరు- 48, ప్రకాశం- 167, నెల్లూరు- 62, చిత్తూరు- 134, అనంతపురం- 38 పోస్టుల భ‌ర్తీకి సంబందించి ఈ నోటిపికేష‌న్ జారీ అయింది.

APPSC notification for 1051 panchayat Secretary Posts..

ఇక‌, తాజాగా జ‌రిగిన క్యాబినెట్ స‌మావేశంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పోలీసు శాఖ‌లో ప‌దోన్నుతుల కు ఏపి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపి లో వివిధ జిల్లాల్లో హెడ్‌ కానిస్టేబుళ్ల పోస్టులు, పదోన్నతులకు ఆమోదముద్ర వేశారు. అలాగే 566 ఏఎస్‌ఐ పోస్టుల మంజూరుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాక‌ముందే మ‌రిన్ని పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ‌కు నోటిఫికేష‌న్లు జారీ అయ్యే అవ‌కాశం ఉంది.

English summary
APPSC released notification for 1051 Pnachayat Secretary posts. Ap Cabinet approved 566 ASI posts and promotions for Head conistables in police department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X