అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యోగాల జాత‌ర : కొత్త‌గా 14 నోటిఫికేష‌న్లు: నెలాఖ‌రు లోగా జారీకి నిర్ణ‌యం..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో ఎన్నిక‌ల ఏడాది కావ‌టంతో ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ వేగ‌వంతం అవుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉద్యోగాల భ‌ర్తీ కోసం 21 ప్ర‌క‌ట‌న‌లు జారీ చేసిన ఆంధ్ర ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ కొత్త‌గా మ‌రో 14 నోటిఫికేష‌న్ల‌ను జారీ చేసేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఈ నెలాఖ‌రులోగానే ఈ నోటిఫికేష‌న్ల‌ను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించింది.

APPSC Planning for fill up posts : 14 new notifications ready..

ఆ శాఖ‌ల‌దే ఆల‌స్యం.. మేము సిద్దం..

రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌త సెప్టెంబ‌ర్ లో తీసుకున్న ఉద్యోగాల భ‌ర్తీ నిర్ణ‌యానికి అనుగుణంగా ఇప్ప‌టి వ‌ర‌కు 3,255 ఉద్యోగా ల భ‌ర్తీకి సంబంధించి 21 నోటిపికేష‌న్లు విడుద‌ల చేసిన‌ట్లు ఏపిపిఎస్సీ చెబుతోంది. ఇంకా రెవిన్యూ శాఖ నుండి పూర్తి స్థాయిలో స‌మాచారం రాక‌పోవ‌టంతో 670 జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, అట‌వీ శాఖ‌కు చెందిన అసిస్టెంట్ బీట్ ఆఫీస‌ర్ ఉద్యోగాలు 330, ఇత‌ర శాఖ‌ల ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క‌ట‌న‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ఇవ్వ‌లేక పోయిన‌ట్లు క‌మిష‌న్ ఛైర్మ‌న్ స్వ‌యంగా వెల్ల‌డించారు. సంబంధిత శాఖ‌ల నుండి స‌మాచారం అంద‌గానే నోటిఫికేష‌న్లు విడుద‌ల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని..ఈ నెల‌ఖ‌రులోగా కొత్త‌గా 14 ఉద్యోగ నోటిఫికేష‌న్లు జారీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇదే స‌మ‌యం లో ఎన్నిక‌ల‌కు..ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధం లేద‌ని తేల్చి చెప్పారు. ప‌బ్లిక స‌ర్వీసు క‌మిష‌న్ స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌లిగిన సంస్థ అని..ఎన్నిక‌ల‌తో ఎటువంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేస్తోంది ఏపిపిఎస్సీ.

భ‌ర్తీ చేయాల‌ని భావిస్తున్న పోస్టులు..

ఏపిపిఎస్సీ ఈ నెలాఖ‌రులోగా జారీ చేసే నోటిఫికేష‌న్ల‌లో భ‌ర్తీ కానున్న ఉద్యోగాల వివ‌రాల‌ను వెల్ల‌డించారు. అందులో ప్ర‌ధానంగా.. డిపిఆర్ ఓ పోస్టులు.. 4, ఎగ్జిక్యూటివ్ అధికారులు..గ్రేడ్‌-2..60, అసిస్టెంట్ స్టాటిస్టిక‌ల్ ఆఫీస‌ర్లు..78, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ (ఏపి ఎక‌నామిక్స్ అండ్ స్టాటిస్టిక‌ల్స్‌)..6, తెలుగు రిపోర్ట‌ర్‌..5, ఇంగ్లీషు రిపోర్ట‌ర్ (లెజిస్లేచ‌ర్‌)..10, జూనియ‌ర్ అసిస్టెంట్- కంప్యూట‌ర్ అసిస్టెంట్‌.. 670 పోస్టులు భ‌ర్తీ కావాల్సి ఉంది. ఇక‌, వీటితో పాటుగా ఫారెస్ట్ సెక్ష‌న్ ఆఫీస‌ర్‌..10, సెరిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్‌..13, ఫారెస్ట్ బీట్ ఆఫీస‌ర్‌..330, లెజిస్లేటివ్ ఆఫీస‌ర్‌..3, అసిస్టెంట్ బీట్ ఆఫీస‌ర్‌..100, రీసెర్చ్ ఆఫీస‌ర్‌..2, అసిస్టెంట్ ఇంజ‌నీర్‌..190 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు విడుద‌ల కానున్నాయి.

English summary
APPSC Planning to release 14 new notifications for fill up vacancies in AP govt. By end of this month 14 new notifications may release.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X