అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీఎస్ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్.. 22 వరకు డెడ్‌లైన్..!

|
Google Oneindia TeluguNews

అమరావతి : ఏపీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమాన్యం తీరు నిరసిస్తూ కార్మికులు మళ్లీ రోడ్డెక్కనున్నారు. ఆ మేరకు ఎన్ఎంయూ కార్మిక సంఘం నేతలు బుధవారం సమ్మె నోటీసు ఇచ్చారు. 46 డిమాండ్లతో కూడిన నోటీసును ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుకు అందించారు. అటు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు కూడా గురువారం నాడు సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ యాజమాన్యం దిగిరాని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అంటున్నారు.

డిమాండ్ల సాధన కోసం సమ్మె సైరన్

డిమాండ్ల సాధన కోసం సమ్మె సైరన్

డిమాండ్ల సాధన కోసం మరోసారి ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కనున్నారు. ఇదివరకు పలుమార్లు యాజమాన్యంతో జరిపిన చర్యలు సఫలం కాలేదు. దాంతో మరోసారి సమ్మె సైరన్ మోగింది. కార్మికులకు వేతన సవరణ బకాయిలు వెంటనే చెల్లించాలనే ప్రధాన డిమాండుతో పాటు సిబ్బంది కుదింపు, గ్రాట్యుటీ తగ్గింపు తదితర నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అద్దె బస్సులను పెంచాలనే నిర్ణయాన్ని కూడా కార్మిక సంఘాలు తప్పుపడుతున్నాయి. దాన్ని కూడా ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు.

కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, తద్వారా ఆర్టీసీని రక్షించే ప్రయత్నం చేయాలని కోరారు. ఒకవేళ యజమాన్యం స్పందించని పక్షంలో ఈ నెల 22 తర్వాత ఏ క్షణమైనా రాష్ట్రమంతటా బస్సులను నిలిపివేస్తామని ఎన్‌ఎంయూ కార్మిక సంఘం నేతలు హెచ్చరించారు. ఆ మేరకు ఆర్టీసీ యజమాన్యానికి నోటీసు ఇచ్చారు. అదలావుంటే గురువారం నాడు ఆర్టీసీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు కూడా సమ్మె నోటీసు ఇవ్వాలని డిసైడయ్యారు.

 టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందా?.. ఆరు నెలలా, రెండేళ్లా.. కాంగ్రెస్ నేతల మర్మమేంటి? టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందా?.. ఆరు నెలలా, రెండేళ్లా.. కాంగ్రెస్ నేతల మర్మమేంటి?

 ప్రధాన డిమాండ్లతో నోటీసు

ప్రధాన డిమాండ్లతో నోటీసు

ఆర్టీసీ యాజమాన్యానికి ఎన్ఎంయూ కార్మిక సంఘం నేతలు సమర్పించిన నోటీసులో ప్రధాన డిమాండ్లు పేర్కొన్నారు. అవి ఏంటంటే.. ప్రధానంగా కార్మికులకు వేతన బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన 650 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేయాలి. కార్మికుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. నష్టాల నుంచి బయటపడేలా ప్రతి సంవత్సరం కొత్త బస్సుల కొనుగోలుకు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించేలా చర్యలు తీసుకోవాలి.

అప్పట్లో మంత్రి హామీ.. నెల దాటినా జాడలేదు..!

అప్పట్లో మంత్రి హామీ.. నెల దాటినా జాడలేదు..!


ఆర్టీసీలో గత కొంతకాలంగా యాజమాన్యం, కార్మికుల మధ్య సఖ్యత లేదనే చెప్పొచ్చు. డిమాండ్ల సాధన కోసం 2018, డిసెంబరులో కార్మిక సంఘాలన్నీ కలిపి సమ్మె నోటీసులు ఇచ్చాయి. ఇక సమ్మెకు వెళ్లడమే తరువాయి అనుకున్న సందర్భంలో ప్రభుత్వం స్పందించింది. కార్మికుల డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి మొదటివారంలో మంత్రి అచ్చెన్నాయుడు కార్మిక సంఘాల నేతలతో భేటీ అయ్యారు. వారి డిమాండ్లలో ప్రధానమైన వేతన సవరణ బకాయిల డిమాండ్ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. 2003 నుంచి కార్మికులకు రావాల్సిన వేతన సవరణ బకాయిలను ఉగాది పండుగ రోజున చెల్లించడానికి ఓకే చెప్పారు. కానీ, ఉగాది పండుగ గడిచిపోయి నెల రోజులు దాటుతున్నా.. ఇంతవరకు దాని ఊసే లేదు. దాంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు మరోసారి సమ్మెకు సన్నద్ధమవుతున్నాయి.

English summary
Once Again Strike Notice in APSRTC given by Labours Union NMU. The Employees demanding for previous salary dues clearance according to changes. If the RTC Officials not responding, then they go to strike and not run the buses acrross AndhraPradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X