అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టార్గెట్ కొడాలి నాని : టిడిపికి ప్ర‌తిష్ఠాత్మ‌కం : తెర పైకి కొత్త అభ్య‌ర్ధి : సై అంటున్న నాని..!

|
Google Oneindia TeluguNews

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల ఖ‌రారు పై దృష్టి సారించిన టిడిపి అధినేత చంద్ర‌బాబు ఇప్పుడు వైసిపి లో కీల‌క నేత‌ల పై దృష్టి సారించారు. గ‌తంలో టిడిపి నుండి రెండు సార్లు గెలిచి..ఇప్పుడు వైసిపి ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని కి ఎలాగైనా చెక్ పెట్టాల‌ని భావిస్తున్నారు. ఇందు కోసం కొత్త అభ్య‌ర్ధుల‌ను తెర పైకి తెస్తున్నారు. ఎలాగైనా ఈ సారి గుడివాడ‌లో టిడిపి గెల‌వాల‌ని ల‌క్ష్యంగా పెట్టెకున్నారు. మ‌రి..వారి ల‌క్ష్యం నెర‌వేరుతుందా..

కొడాలి నాని ల‌క్ష్యంగా అడుగులు..

కొడాలి నాని ల‌క్ష్యంగా అడుగులు..

కృష్ణా జిల్లాలో గుడివాడ తొలుత టిడిపికి కంచుకోట‌. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో రెండు సార్లు మిన‌హా ప్ర‌తీ సారి టిడిపి అక్క‌డ గెలుస్తూ వ‌చ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో వైసిపి నుండి పోటీ చేసిన కొడాలి వెంక‌టేశ్వ‌ర రావు (నాని) టిడిపి అభ్య‌ర్ధి పై గెలుపొందారు. టిడిపి లో ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుండి రెండు సార్లు గెలిచిన నాని వైసిపి లో చేరిన త‌రువాత నేరుగా చంద్ర‌బాబును ల‌క్ష్యంగా చేసుకొని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీంతో..టిడిపి అధినాయ‌కత్వం గుడివాడ నుండి ఈ సారి ఎలాగైనా నానిని ఓడించాల‌నే లక్ష్యంతో ఉంది. దీని కోసం మ‌రో రెండు రోజుల్లో గుడివాడ టిడిపి నేత‌ల‌తో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌మావేశం కానున్నారు. కొడాలి నాని దూకుడును త‌ట్టుకోగ‌లిగిన నేత కోసం టిడిపి అన్వేషి స్తోంది. ఇందు కోసం స్థానికంగా ఉన్న నేత‌ల‌తో పాటు గా మ‌రో కొత్త పేరు తెరపైకి తీసుకొచ్చారు.

రావి తో పాటుగా దేవినేని అవినాష్‌..

రావి తో పాటుగా దేవినేని అవినాష్‌..

కొడాలి నానికి చెక్ పెట్టాలంటే అదే సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తిని..నాని ని త‌ట్టుకోగ‌లిగిన స‌మ‌ర్ధ‌నేత కోసం టిడిపి అధినాయ‌క‌త్వం ఎదురు చూస్తోంది. దీనిలో భాగంగా.. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, దేవినేని అవినాష్‌ పేర్లు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దేవినేని ఆవినాష్ టిడిపి యువ‌త రాష్ట్ర అధ్య‌క్షుడిగా నియ‌మితుల‌య్యా రు. కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లో ప్ర‌ధాన సామాజిక వ‌ర్గంలో దేవినేని కుటుంబానికి ఓ ప్ర‌త్య‌క గుర్తింపు ఉంది. కొడాలి నాని ని ఎదుర్కోగ‌లిగిన నేత‌ల వడపోతలు అయిన తర్వాత తుది పరిశీలనలో రావి వెంకటేశ్వరరావు, దేనినేని అవినాష్‌ పేర్లు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గంలో ఇప్పటికే పలుమార్లు నిర్వహించిన సర్వేలు రావికి సా నుకూలంగా ఉన్నా ఆయన ఎంత వరకు నానిని ధీటుగా ఎదుర్కొనగలరన్న అంశాన్ని పార్టీ వర్గాలు పరిశీలిస్తు న్నా యి. రావి వెంక‌టేశ్వ‌ర‌రావు ఆర్దికంగా ఆచితూచి వ్య‌వ‌హ‌రిచే వ్య‌క్తి కావ‌టంతో అది ఆయ‌న‌కు ప్ర‌తిబంధ‌కంగా మారింది.
దీంతో..అవినాష్ పేరును ముఖ్య‌మంత్రి ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం.

కొడాలి నానికి చెక్ పెట్ట‌గ‌ల‌రా..ముందుగానే అభ్య‌ర్ధి ఖ‌రారు..

కొడాలి నానికి చెక్ పెట్ట‌గ‌ల‌రా..ముందుగానే అభ్య‌ర్ధి ఖ‌రారు..

ఏదేమైనా కొడాలి నానికి ఈ సారి ఎన్నిక‌ల్లో చెక్ పెట్టాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఇందు కోసం వీలైనంత త్వ‌ర‌గా గుడివాడ టిక్కెట్ ను ఖ‌రారు చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. రెండు రోజుల్లో గుడివాడ నేత‌లతో సీయం స‌మావేవం కానున్నారు. గ‌త నాలుగున్నారేళ్ల కాలంగా గుడివాడ లో స్థానికంగా నాని ని దెబ్బ తీయాల‌ని అనేక వ్యూహాల‌ను టిడిపి సిద్దం చేసింది. అయితే, నాని వాట‌న్నింటినీ స‌మ‌ర్ధంగా ఎదుర్కొన్నారు. ఇక‌, ఢీ అంటే ఢీ అనే మ‌న‌స్త‌త్వం ఉన్న నాని ఈ సారి ఎన్నిక‌ల్లో సైతం సై అంటున్నారు. నంద‌మూరి కుటుంబానికి మ‌ద్ద‌తు దారుడిగా..జూనియ‌ర్ ఎన్టీఆర్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. హ‌రికృష్ణ మ‌ర‌ణం స‌మ‌యంలోనూ నాని పూర్తిగా అక్క‌డే స‌మ‌యం కేటాయించి.. అన్ని కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌లో త‌న వంతు స‌హ‌కారం అందించారు. ఇక‌, ఇప్పుడు టిడిపి కి రాజ‌కీయ ల‌క్ష్యంగా మారారు. మ‌రి..అక్క‌డ అభ్య‌ర్ధిని మారిస్తే..నాని గెల‌వ‌కుండా ఆప‌గ‌ల‌రా అనేదే చ‌ర్చ‌. టిడిపి చివ‌ర‌కి ఎవ‌రిని బ‌రిలోకి దించుతుందో..ఫ‌లితం ఎలా ఉంటుందో చూడాలి.

English summary
TDP concentrated on Gudivada constituency to defeat Kodali Nani. Chandra Babu focused on this segment planning to decide candidate as early possible. C.M seems to be consider Devineni Avinash name from Gudivada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X