అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్‌-చంద్ర‌బాబు చెరో ఫ్రంట్ : ప‌వ‌న్ కు కేసీఆర్ ఆహ్వానం లేదా ..! మ‌రి..జ‌న‌సేనాని రూటెటు..?

|
Google Oneindia TeluguNews

ఏపిలో మూడు ప్ర‌ధాన పార్టీల‌దీ మూడు దార్లుగా క‌నిపిస్తోంది. టిడిపి అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికే బిజెపీత‌ర కాంగ్రెస్ మ‌ద్ద‌తు కూట‌మి లో ఉన్నారు. తాజాగా, కేసీఆర్ ప్ర‌తిపాదిత ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లోకి జ‌గ‌న్ ను ఆహ్వానించారు. అదే ఫ్రంట్ లోకి ప‌వ‌న్ కు ఆహ్వానం వ‌స్తుందా లేదా అనుమాన‌మే. వ‌చ్చినా ప‌వ‌న్ అందులో చేరుతారా. దీంతో..చంద్ర‌బాబు - ప‌వ‌న్ ఇద్ద‌రూ త‌మ కూట‌ముల‌ను దాదాపు ఎంచుకున్నారు. మ‌రి..జ‌న‌సేనాని రూటెటు.. ఏ గ‌ట్టున ఉంటారు..

చంద్ర‌బాబు ఖాయం - జ‌గ‌న్ ఎంట్రీ దాదాపు ఖ‌రారు..

చంద్ర‌బాబు ఖాయం - జ‌గ‌న్ ఎంట్రీ దాదాపు ఖ‌రారు..

ఏపిలో ఉన్న మూడు ప్ర‌ధాన పార్టీల్లో అధికారంలో ఉన్న టిడిపి ఇప్ప‌టికే జాతీయ రాజ‌కీయాల్లో కాంగ్రెస్ కు మ‌ద్దిస్తూ బిజెపీయ‌త‌ర ఫ్రంట్ కి తుది మెరుగులు దిద్దటంలో చంద్ర‌బాబు బిజీగా ఉన్నారు. అయితే, రాహుల్ గాంధీ ప్ర‌ధాని అభ్య ర్ధిత్వాన్ని వ్య‌తిరేకిస్తున్న మ‌మ‌తా, మాయావ‌తి, అఖిలేష్ వంటి వారు తొలుత ఈ కూట‌మి వైపు ఆస‌క్తి చూపించి నా..ఇప్పు డు దూరంగా ఉంటున్నారు. ఈనె 19న క‌ల‌క‌త్తాలో జ‌రిగే తృణ‌మూల్ ర్యాలీ త‌రువాత కాంగ్రెస్ తో తృణ‌మూ ల్ క‌లిసేదీ లేనిదీ క్లారిటీ రానుంది. ఇక‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిపాదిన ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కోసం జాతీయ స్థాయిలో ప్ర య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇందులో భాగంగా..ఏపి ప్ర‌తిప‌క్ష పార్టీ వైసిపిని ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌లోకి కేసీఆర్ ఆహ్వానించారు. ఇందులో చేరేందుకు జ‌గ‌న్ అధికారికంగా సంసిద్ద‌త వ్య‌క్తం చేయ‌క‌పోయినా..ఆయ‌న మాటలు మా త్రం ఫెడ‌ర‌ల్ కూట‌మి కి అనుకూలంగానే ఉన్నాయి. కాంగ్రెస్ - బిజెపి కూట‌ముల‌తో జ‌గ‌న్ క‌లిసే ఛాన్స్ ఏ మాత్రం లేదు. దీంతో..ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ వైపే మొగ్గు చూప‌టం ఖాయంగా క‌నిపిస్తోంది.

జ‌గ‌న్ ప్లాన్ ఇదీ..అలా చేస్తేనే...!

జ‌గ‌న్ ప్లాన్ ఇదీ..అలా చేస్తేనే...!

ఏపి రాజ‌కీయాల్లో వేలు పెడ‌తాన‌ని చెప్పిన కేసీఆర్..త‌న కుమారుడి ద్వారా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో చేరాలంటూ జ‌గ‌న్ వ‌ద్ద కు రాయ‌బారం పంపారు. ఇందు కోసం కేసీఆర్ తానే స్వ‌యంగా విజ‌య‌వాడ వ‌చ్చి జ‌గ‌న్ ను క‌లుస్తాన‌ని ఫోన్ చేసి చెప్పారు. జ‌గ‌న్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో క‌లుస్తాన‌ని ప్ర‌క‌టించ‌క‌పోయినా..కేసీఆర్ ప్ర‌య‌త్నాల‌ను స్వాగ‌తించారు. దీంతో.. కేసీఆర్ తో చ‌ర్చ‌ల త‌రువాత ఆయ‌న కేసీఆర్ తో ప్ర‌త్యేక హోదా పై విజ‌య‌వాడ కేంద్రంగా ప్ర‌క‌ట‌న చేయించి..ఆ త రువాత ఫ్రంట్‌కు ఏ ర‌కంగా మ‌ద్ద‌తివ్వాల‌నే దాని పై స్ప‌ష్ట‌త ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే కేటీఆర్ తో జ‌గ‌న్ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌టం పై టిడిపి నేత‌లు మండిప‌డుతున్నారు. ఏపికి అన్యాయం చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. దీంతో.. జ‌గ‌న్ కేసీఆర్ ద్వారా ఏపి ప్ర‌యెజ‌నాలకు అనుగుణంగా మాట్లాడిని త‌రువాత‌.. ప్ర‌ధానికి కేసీఆర్ లేఖ రాస్తే..అప్పుడు ఫ్రంట్ కు మ‌ద్ద‌తు విష‌యంలో సానుకూలంగా స్పందిస్తార‌ని వైసిపి నేత‌లు చెబుతున్నారు.

ప‌వ‌న్ ను ఆహ్వానించ‌రా..ఆయ‌న రూటెటు..

ప‌వ‌న్ ను ఆహ్వానించ‌రా..ఆయ‌న రూటెటు..

ఏపిలో టిడిపి ఒక కూట‌మి..వైసిపి మ‌రో కూట‌మి అనే విష‌యం తేలి పోయింది. ఇప్ప‌టికే ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బా బు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం బిజెపికి వ్య‌తిరేకంగా త‌మ‌తో క‌లిసి రావాల‌ని ఆహ్వానించారు. టిడిపి తో క‌లిసి ప‌ని చేయ టానికి తాము సిద్దంగా లేమ‌ని..ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. ఇక‌, ఇప్పుడు కేసీఆర్ ఆహ్వానం మేర జ‌గ‌న్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లోకి ఎంట్రీ పై అధికారికంగా నిర్ణ‌యం జ‌ర‌గ‌లేదు. మ‌రి..ఈ ఇద్ద‌రి పై ఏపిలో రాజ‌కీయ పోరాటం చేస్తున్న ప‌వ‌న్ ఈ రెండు ఫ్రంట్ ల్లోకి వెళ్లే సాహ‌సం చేస్తారా అనేది సందేహ‌మే. ప‌వ‌న్ ను సైతం ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లోకి ఆహ్వానించాల‌నుకుంటే జ‌గ‌న్ తో పాటే ప‌వ‌న్ వ‌ద్ద‌కూ త‌మ బృందాన్ని కేసీఆర్ పంపేవార‌ని..పంప‌లేదంటే ప‌వ‌న కు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లోకి ఎంట్రీ లేద‌న్న‌ట్లుగా ప్రచారం జ‌రుగుతోంది. ఒక‌వేళ‌..ఆహ్వానం వ‌చ్చినా..జ‌గ‌న్ ఉంటున్న ఫ్రంట్ లో ప‌వ‌న్ చేరుతారా అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఇక‌, మిగిలింది ఎన్డీఏ కూట‌మి. అందులో వెళ్లే సాహ‌సం ప‌వ‌న్ చేసే అవ‌కాశం లేదు. మ‌రి...ఇప్పుడు ప‌వ‌న్ రూటెటు..ఏపిలో ఎవ‌రితో ఉంటారు..జాతీయ స్థాయిలో ఎవ‌రికి మ‌ద్ద‌తుగా నిలుస్తారో..వేచి చూడాల్సిందేనా..

English summary
In Ap Politics ruling party TDP in UPA and opposition party YCP may support Federal Front Directly or indirectly. So, Now janasena to decide to their partner in national politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X