• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టార్గెట్.. 2024: సోము నియమాకంపై బీజేపీలో జోష్: ఆర్ఎస్ఎస్ ముద్ర: డైహార్డ్ నేతగా: కన్నా సహా

|

అమరావతి: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ పగ్గాలు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజుకు లభించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. బీజేపీలో మొదటి నుంచీ కొనసాగుతోన్న నేతల్లో జోష్ నింపుతోంది. అసలైన బీజేపీ నేతకు పార్టీ అధిష్ఠానం సరైన న్యాయం చేసిందనే అభిప్రాయాలు నెలకొన్నాయి. సోము వీర్రాజు నియామకం పార్టీ దిశ-దశ మార్చేస్తుందని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కావడానికి దోహదపడుతుందని చెబుతున్నారు.

2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన ప్రత్యామ్యాయ పార్టీగా ఆవిర్భవించడానికి అవకాశం లభించినట్టయిందని అంటున్నారు. సోము వీర్రాజు ప్రారంభంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో పని చేశారు. అనంతరం బీజేపీలో చేరారు. సుమారు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయనకు ఉంది. ఇది పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు నాయకులు. అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లే మనస్తత్వం ఉండటం ఆయనకు ఉన్న ప్రధాన బలం అని, అది ఎన్నికల్లో ఓటుబ్యాంకుగా మారుతుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

BJP leaders wishes to Somu Veerraju, who is appointed as AP BJP State President

బీజేపీతో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న సోము వీర్రాజు నాయకత్వంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఎదుగుతామని జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు, ఉపాధ్యక్షుడు సోమగుంట విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. సోముకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 42 ఏళ్లపాటు వివిధ పదవుల్లో ఆయన ఎంతో నిబద్ధతతో పనిచేశారని చెప్పారు. అపార రాజకీయ అనుభవం ఉన్న ఆయన తప్ప పార్టీ పగ్గాలను అందుకోవడానికి మరొకరికి అర్హత లేదని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

బీజేపీలోని టీడీపీ మాజీలకు చెక్ పెట్టేలా: కన్నాను తొలగించిన రోజే..షోకాజ్‌ జారీ: భారీ ప్రక్షాళన

సోము నియామకం పట్ల తాజా మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, వంటి పలువురు నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధిష్ఠానం సీనియారిటీకి పట్టం కట్టిందని వ్యాఖ్యానించారు. ఆయన నాయకత్వంలో ఏపీలో బీజేపీ విజయ శిఖరాలను అందుకుంటుందని ఆశిస్తున్నట్లు బండి సంజయ్ కుమార్ చెప్పారు.

  BJP MLC Somu Veerraju Fired On Chandrababu Naidu ! || చంద్రబాబు పై విరుచుకుపడ్డ సోము వీర్రాజు

  English summary
  Bharatiya Janata Party Andhra Pradesh and Telangana leaders wishes to Somu Veerraju, who is appointed as AP BJP State President. Rajya Sabha member GVL Narasimha Rao, S Vishnuvardhan Reddy and Telangana President Bandi Sanjay, MP Dharmapuri Arvind greets to Somu Veerraju.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X