అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డేటా తొలగింపు: 'ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి, కీలక సూత్రధారులు బొత్స, పీకే'

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య డేటా చోరీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీలో ప్రజలు, పోలీసులను, అధికారులను ఎవరినీ నమ్మని జగన్ ఏపీలో పేరును కోల్పోయారని, దీంతో హైదరాబాదులోని తమ అనుకూల సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం ద్వారా దాడులు చేయించడం ద్వారా అధికారంలోకి రావాలని చూస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.

తమ ఓట్లను తొలగించాలని ప్రయత్నాలు చేస్తున్నారంటే.. తమ ఓట్లను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. డేటా చోరీ అంశంపై సోమవారం ఉదయం తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రులు కౌంటర్ ఇచ్చారు.

ఓట్ల తొలగింపు సూత్రధారి బొత్స, ఇందులో పీకే దిట్ట

ఓట్ల తొలగింపు సూత్రధారి బొత్స, ఇందులో పీకే దిట్ట

ఓట్లు తొలగించడంలో ప్రశాంతి కిషోర్ చాలా దిట్ట అని ఏపీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఓట్లు తొలగించే అధికారంలోకి వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరి ఓట్లు తొలగించడం లేదని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే ఆ పని చేస్తోందని ధ్వజమెత్తారు. ఇందుకు తాము సాక్ష్యాధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 8 లక్షల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నం జరిగిందని తాము భావిస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్ ఈ విషయంలో విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో డేటా చోరీ జరిగితే ఏపీలో కేసు నమోదు చేయాలి కానీ, తెలంగాణలో చేయడం ఏమిటని ప్రశ్నించారు. లబ్ధిదారుల డేటా సేకరించడం మా బాధ్యత అని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. ఓట్ల తొలగింపు సూత్రధారి వైసీపీ నేత బొత్స సత్యనారాయణే అని ఆయన చెప్పారు. ఓట్లు తొలగించడంలో ప్రశాంత్ కిషోర్ (పీకే) దిట్ట అన్నారు.

డేటా చోరీలో షాకింగ్: ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసు, వాళ్లు ఎందుకిలా చేశారో.. సీపీ సజ్జనార్డేటా చోరీలో షాకింగ్: ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసు, వాళ్లు ఎందుకిలా చేశారో.. సీపీ సజ్జనార్

కేసీఆర్ చెప్పిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనా?

కేసీఆర్ చెప్పిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనా?

వైసీపీ క్రిమినల్ మైండ్ బయటపడిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 75వేల ఓట్లు తొలగించమని వైసీపీ ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేసిందని చెప్పారు. బల్క్‌గా ఓట్లు తొలగించమని అప్లై చేస్తే కేసులు పెడతారని చెప్పారు. అందుకే కేసులు నమోదయ్యాయని అన్నారు. సేవామిత్ర తమ పార్టీ కార్యక్రమం అన్నారు. వైసీపీ నేతలకు ఏపీ ప్రజలు, పోలీసులపై కూడా నమ్మకం లేదన్నారు. ఏపీ పోలీసుల హక్కులను తెలంగాణ కాలరాస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇస్తామని చెప్పిన రిటర్న్ గిఫ్టి ఇదేనా అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వెళ్తోందన్నారు.

డేటా చోరీలో కీలక ఆధారాలు, ఎంత పెద్దవారున్నా వదలం, ఏపీలో అసలేం చేశారంటే..: సీపీడేటా చోరీలో కీలక ఆధారాలు, ఎంత పెద్దవారున్నా వదలం, ఏపీలో అసలేం చేశారంటే..: సీపీ

జగన్‌తో సంబంధాలు.. కేటీఆర్ చాలా తెలివిగా మాట్లాడారు

జగన్‌తో సంబంధాలు.. కేటీఆర్ చాలా తెలివిగా మాట్లాడారు

వైయస్ జగన్‌ను అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీలు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అని, కేసీఆర్ సొత్తు కాదన్నారు. జగన్‌తో సంబంధాలు పెట్టుకొని తెలంగాణ మంత్రి కేటీఆర్ చాలా తెలివిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏపీ ప్రజలకు చెందిన సర్వర్ హైదరాబాదులో ఉంటే తప్పేమిటని ప్రశ్నించారు. ఏపీలో జగన్‌కు ఆదరణ లేదని, అందుకే కుట్రలు చేసి అధికారంలోకి రావాలని భావిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఏపీ పోలీసులకు బదలాయించాలని కూడా తెలియదా?

ఏపీ పోలీసులకు బదలాయించాలని కూడా తెలియదా?

జగన్‌కు ఏపీ నుంచి ప్రతిపక్ష నేతగా జీతం కావాలని, పోలీసుల నుంచి రక్షణ కావాలని, ప్రజల ఓట్లు కావాలని, కానీ ఆయన మాత్రం ఏపీ పోలీసులు, డాక్టర్లు, అధికారులు, ప్రజలను నమ్మరని, ఇదేమిటని నారా లోకేష్ ప్రశ్నించారు. అందుకే తెలంగాణలో ఉంటూ తెరాస సహకారంతో ఏపీలో అలజడి సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో పోటీపడలేక ఏపీలో బలహీనమైన సీఎం ఉంటే తెలంగాణకు ఏపీ నుంచి పోటీ ఉండదని, వారి ఆటలే సాగుతాయనేది తెరాస కుట్ర అన్నారు. ఎన్నిసార్లు కోర్టు చివాట్లు పెట్టినా మీకు బుద్ది రాలేదని, అమెరికాలో పర్సు పోతే అక్కడ ఫిర్యాదు చేస్తారా లేక హైదరాబాద్‌లో చేస్తారా అని ప్రశ్నించారు. ఏపీకి చెందిన డేటా పోయిందని ఫిర్యాదు వస్తే ఏపీ పోలీసులకు కేసు బదలాయించాలని కూడా మీకు తెలియదా అన్నారు.
కేసీఆర్, జగన్‌ల జోడి కేటీఆర్ మాటల్లో మరోసారి బయటపడిందని, కేటీఆర్ ఇచ్చిన స్క్రిప్ట్‌నే వైసీపీ నాయకులు చదువుతున్నారని, వైసీపీ ప్రొడక్షన్, టిఆర్ఎస్ డైరెక్షన్లో టీడీపీ పార్టీ సభ్యత్వం, సర్వే డేటా దొంగిలించారని, డేటా చోరీ చరిత్ర మీది, బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీ తమది అన్నారు.

English summary
By using police and embracing extra judicial tactics, TDP data has been stolen and handed over to the YSRCP alleged Andhra Pradesh minister Nara Lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X