అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప‌వ‌న్‌ కు చంద్ర‌బాబు ట్రాప్ : క‌న్వీన్స్ ఆర్ క‌న్ఫ్యూజ్ : జ‌న‌సేనాని లొంగేనా..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో ప‌ట్టు కోసం చంద్ర‌బాబు త‌న రాజ‌కీయ అనుభ‌వాన్నంతా వినియోగిస్తున్నారు. ఎలాగైనా అధికారం నిలుపుకొనే లక్ష్యంతో రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. ఇందులో భాగంగా..ఏపిలో త‌న‌కు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధులుగా ఉన్న జ‌గ‌న్ - ప‌వ‌న్ ల పై మైండ్ గేమ్ ప్రారంభించారు. వీలైతే త‌న తో క‌లిసే వారిని క‌న్వీన్స్ చేయ‌టం..లేదా వారిపై ఓట‌ర్ల‌లో క‌న్ఫ్యూజ్ చేయ‌ట‌మే ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. ఇందులో భాగంగానే..జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాన్ కు సీయం చంద్ర‌బాబు ట్రాప్ చేసిన‌ట్లు క‌నిపిస్తోంది...

అంతా వ్యూహాత్మ‌క‌మే ... ప‌క్కా ప్ర‌ణాళికా బ‌ద్దంగా..

అంతా వ్యూహాత్మ‌క‌మే ... ప‌క్కా ప్ర‌ణాళికా బ‌ద్దంగా..

ఎన్నిక‌ల ఏడాది ప్రారంభ‌మైంది. ఎలాగైనా త‌న ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్ల‌కు గండి కొట్టాలి. జ‌గ‌న్ త‌న‌కు ప్ర‌థాన రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ది. జ‌గ‌న్ ను దెబ్బ తీయాలి. త‌న‌కు 2014 లో మ‌ద్ద‌తుగా నిలిచి ఓట‌ర్లు ప‌క్క వైపు చూడ‌కూడ‌దు. ప‌వ‌న్ తో 2014 లో పొత్తు కార‌ణంగా వ‌చ్చిన ఓట్లు వీలైతే తిరిగి రాబ‌ట్టాలి..లేదా ప‌వ‌న్ కు ప‌డ‌కుండా చూడాలి. బిజెపి కార‌ణంగా వ‌చ్చిన ఓట్లు ఈ సారి ప్ర‌భావం చూపే అవ‌కాశం లేదు. దీంతో..ఎలాగైనా ప్ర‌త్య‌ర్ధి పార్టీల‌ను ట్రాప్ చేయాల‌ని.

ఒక వైపు పార్టీల్లోని నేత‌ల‌ను త‌మ దారిలోకి తెచ్చుకోవ‌టం..రెండోది..వారి కి ప్ర‌జ‌ల్లో బ‌లం లేద‌నే సంకేతాలు ఇవ్వ‌టం. శ‌త్రువు శ‌త్రువు మిత్రుడు అనే సిద్దాంతాన్ని ప‌క్కాగా అమ‌లు చేస్తున్నారు సీయం చంద్ర‌బాబు. ఇందులో భాగంగా.. ప్ర‌జాస్వామ్య రాజ కీయాల్లో ఎప్పుడూ శాశ్వ‌త మిత్రులు..శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌నేది చంద్ర‌బాబు న‌మ్ముకున్న ఫిలాస‌పీ. దీంతో..తాను గెల‌వ‌టానికి ముందున్న అన్ని ప్ర‌త్యామ్నాయాల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా..ప‌క్కా వ్యూహాత్మ‌కంగా వాడుకోవ‌ట‌మే ల‌క్ష్యం..

జగన్ తెచ్చిన కన్ఫ్యూజన్, పవన్ కళ్యాణ్‌పై చంద్రబాబుది మైండ్ గేమా, ఓటమి భయమా? జగన్ తెచ్చిన కన్ఫ్యూజన్, పవన్ కళ్యాణ్‌పై చంద్రబాబుది మైండ్ గేమా, ఓటమి భయమా?

ప‌వ‌న్ ఓట్లు..జ‌గ‌న్ కు మ‌ళ్ళ‌కుండా..!

ప‌వ‌న్ ఓట్లు..జ‌గ‌న్ కు మ‌ళ్ళ‌కుండా..!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు..జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు యాధృచ్చికం కావు. అవి వ్యూహాత్మ‌కంగా చేసిన వ్యాఖ్య‌లుగానే క‌నిపిస్తున్నాయి. కొద్ది కాలంగా ప‌వ‌న్ క‌ళ్యాన్ సైతం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. లోకేష్ ను ల‌క్ష్యంగా చేసుకొని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప‌దే ప‌దే ప్ర‌భుత్వం లోని అవినీతిని ప్ర‌శ్నిస్తున్నారు. జ‌గ‌న్ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు ప‌వ‌న్ సైతం తోడ‌వుతున్నారు. అయినా..ప‌వ‌న్ ను చంద్ర‌బాబు పార్ట‌న‌ర్ గానే జ‌గ‌న్ విమర్శిస్తు న్నారు. దీని ద్వారా ఎలాగో.

.ప‌వ‌న్ క‌ళ్యాన్ మ‌ద్ద‌తు దారులు జ‌న‌సేన కే ఓటు వేస్తారు. జ‌గ‌న్ -ప వ‌న్ మ‌ధ్య మ‌రింగా గ్యాప్ పెంచ‌టం ద్వారా ఓట్ల చీల‌క మరింత‌గా పెరిగి..టిడిపికి మేలు చేస్తుంద‌నే అంచ‌నా సైతం ఉంది. ఇక‌, ప‌వ‌న్ ను ఆద‌రించే వారిలో సైతం ఒక ర‌క‌మైన డైల‌మా సృష్టించి..ప‌వ‌న్ సైతం త‌నకు మ‌ద్ద‌తుగానే ఉన్నార‌నే భావ‌న క‌ల్పించి ప్ర‌ధానంగా వారి ఓట్ల‌లో ఎంత కొంత లాభం పొంద‌ట‌మే టిడిపి ల‌క్ష్య‌మ‌నే విశ్లేష‌ణ వినిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో.. ప‌వ‌న్ కార‌ణంగా గ‌త ఎన్నిక‌ల్లో త‌మ‌కు వ‌చ్చిన అద‌న‌పు ఓట్లలో..సాధ్య‌మైనంత ఎక్కువ ఓట్లు తిరిగి రాబ‌ట్టుకోవ‌టం లో భాగంగానే..వ్యూహాత్మ‌కంగా ప‌వ‌న్ ను ట్రాప్ చేస్తున్న‌ట్లు విశ్లేష‌కుల అంచ‌నా..

చంద్ర‌బాబు ట్రాప్ లో ప‌వ‌న్ చిక్కుతారా..

చంద్ర‌బాబు ట్రాప్ లో ప‌వ‌న్ చిక్కుతారా..

ఇప్ప‌టికే తాము ఒంట‌రిగా పోటీ చేస్తామ‌ని జ‌న‌సేన ప్ర‌క‌టించింది. ప‌వ‌న్ సైతం ఈ విష‌యాన్ని ప‌లుమార్లు దృవీక‌రిం చారు. తాను జ‌గ‌న్‌- చంద్ర‌బాబు ఇద్ద‌రితో దూర‌మ‌నే విధంగా ప‌లు విమ‌ర్శ‌లు చేసారు. అయితే, అవ‌న్నీ ప‌ట్టించుకో కుండా ప‌వ‌న్ త‌న‌తో క‌లిస్తే త‌ప్పేంట‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నిస్తున్నారు. దీని ద్వారా..పవ‌న్ స‌మాధానం వివ‌ర‌ణ ఇచ్చుకో వాల్సిన ప‌రిస్థితి ఎదురైంది.

చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల పై ప‌వ‌న్ ఇచ్చే స‌మాధానం కోసం అభిమానులు..జ‌న సైనికులు ఎదురు చూస్తున్నారు. ప‌వ‌న్ 2014 ఎన్నిక‌ల్లో మాదిరి చంద్రబాబు తో తిరిగి క‌లుస్తారా..లేక అస‌లు చంద్ర‌బాబు తో క‌లిసే ప్ర‌సక్తే లేద‌ని తేల్చ‌తారా అనేది స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. ఇక‌, జాతీయ రాజ‌కీయాల్లో బిజెపికి వ్య‌తిరేకంగా ప‌వ‌న్ త‌మ‌తో క‌ల‌వాల‌ని చంద్ర‌బాబు ఆహ్వానాన్ని సైతం ప‌వ‌న్ ఏ ర‌కంగా స్వీక‌రిస్తారో చూడాలి..

English summary
TDP Chief Chandra Babu Strategically Trap pawan Kalayn in Ap Politics. He asked pawan to join hands with him against BJP. Now, Pawan Kalyan fans and political analyists waiting for his reaction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X