అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

25 మీట‌ర్లు ఎత్తు: ఇనుప నిచ్చెన : నేనే భ‌య‌ప‌డితే ఎలా..

|
Google Oneindia TeluguNews

అది భారీ ప్రాజెక్టు నిర్మాణం జ‌రుగుతున్న ప్రాంతం. 25 మీట‌ర్ల ఎత్తులో ఓ కార్య‌క్ర‌మం. ఇనుప నిచ్చెన ద్వారా పైకి ఎక్కి నిర్వ‌హించాలి. ఒక వైపు జ‌డ్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌. మ‌రోవైపు ఆయ‌న ఎలా చేస్తారా అని ఆస‌క్తితో స్థానికులు. భ‌ద్ర‌తా సిబ్బంది సైతం ఆయ‌న్ను పైకి ఎక్క‌టానికి వారించారు. కానీ, ఈయ‌న విన‌లేదు. నేనే భ‌య‌ప‌డితే ఎలా అంటూ పైకి ఎక్కేసారు..

పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ద్ద స్పిల్ వే లో తొలి రేడియల్‌ గేటు ఏర్పాటు కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అక్క‌డికి చేరుకున్నా రు. స్పిల్ వే వ‌ద్ద 25 మీట‌ర్ల ఎత్తులో క్ర‌స్ట్ లెవ‌ల్ లో రేడియ‌ల్ గేటు బిగించాలి. అక్క‌డ ఆ ప్ర‌దేశంలో ముఖ్య‌మంత్రి పూజ నిర్విహించాలి.

C.M refused Security alert : C.M pooja at 25 mts height

దీని కోసం అక్క‌డే ఉన్న ఇనుప నిచ్చెన ద్వారా పైకి ఎక్కేందుకు ముఖ్య‌మంత్రి సిద్ద‌మ‌య్యారు. ఇంత‌లో భ‌ద్ర‌తా కార‌ణాల వ‌ల‌న అంత ఎత్తు ఎక్క‌కూడ‌ద‌ని భ‌ద్ర‌తా సిబ్బంది అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. కానీ, ముఖ్య‌మంత్రి వారి మాట విన‌లేదు. ఇంత చిన్న చిన్న విష‌యాల‌కు తానే భ‌య‌ప‌డితే ఎలాగ‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు..పోల వ‌రం వ‌ద్ద ప‌ని చేసే కార్మికులు..అధికారులు..సిబ్బందికి భ‌రోసా ఎవ‌రిస్తార‌ని ప్ర‌శ్నించారు. దీంతో...భ‌ద్ర‌తా సిబ్బంది మ‌రో మాట మాట్లాడ‌కుండా వీలైనంత వ‌ర‌కూ త‌గిన ఏర్పాట్లు చేసారు.

పోల‌వ‌రం లో కీల‌కం : తొలి రేడియల్ గేటు ఏర్పాటు : 61 శాతం ప‌నులు పూర్తిపోల‌వ‌రం లో కీల‌కం : తొలి రేడియల్ గేటు ఏర్పాటు : 61 శాతం ప‌నులు పూర్తి

అనంతరం ఇనుప నిచ్చెన ద్వారా స్పిల్‌వే పైకి ఎక్కి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పూజలు నిర్వహించారు. ఆయ‌న నిచ్చె న ఎక్కి..పూజ ముగించి కింద‌కు దిగే వ‌ర‌కూ భ‌ద్ర‌తా సిబ్బంది లో టెన్ష‌న్ క‌నబ‌డింది. కానీ, ముఖ్య‌మంత్రి మాత్రం అవేవీ లెక్క చేయ‌కుండా.. పోల‌వ‌రం లాంటి ప్రాజ‌క్టులో కీల‌క‌మైన గేట్ల ఏర్పాటు పూజ‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. త‌న జీవితంలో ఇది మ‌రిచిపోలేని రోజ‌ని ఆనందంతో వ్యాఖ్యానించారు.

English summary
AP C.M Chandra Babu refused Security alert and climb 25 meters height and done pooja for Polavaram Gates Installation. He says he have to give moral support for Polavaram Ground staff.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X