అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డేటా చోరీలో సీయం..లోకేష్ పాత్ర : అశోక్ ఎందుకు దాక్కున్నారు : అయిదు కోట్ల డీల్‌..!

|
Google Oneindia TeluguNews

ఏపి ముఖ్య‌మంత్రి చంద్రబాబు..మంత్రి లోకేష్ పై వైసిపి సీనియ‌ర్ నేత పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ఓటు కు నోటు వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు పాత్ర మ‌రింత బ‌ల‌ప‌డింద‌ని వ్యాఖ్యానించారు. ఐటి గ్రిడ్స్ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు..లోకేష్ పాత్ర సుస్ప‌ష్ట‌మ‌ని పేర్కొన్నారు. ఎటువంటి త‌ప్పు చేయ‌కపోతే అశోక్ ఎందుకు దాక్కున్నార‌ని పెద్దిరెడ్డి ప్ర‌శ్నించారు.

ఎర్రర్.. ఎర్రర్: టీడీపీ అధికారిక వెబ్ సైట్ కు ఏమైంది? కొన్ని గంటలుగా మూత ఎర్రర్.. ఎర్రర్: టీడీపీ అధికారిక వెబ్ సైట్ కు ఏమైంది? కొన్ని గంటలుగా మూత

చంద్ర‌బాబు పాత్ర బ‌ల‌ప‌డింది...
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు పాత్ర మరింత బలపడేవిధంగా 11 నిముషాల నిడివిగల వీడియో వెలుగు చూసిందని వైసిపి సీనియ‌ర్ నేత పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అన్నారు. ఎంఎల్ ఏ స్టీఫెన్ సన్ ,సెబాష్టియన్ ల మధ్య ఐదుకోట్ల కు డీల్ కుదిరినట్లు వారిద్దరి మధ్య సంభాషణలు వెల్లడిస్తున్నాయన్నారు. ఇందులో చంద్రబాబు 3.5 కోట్లు ఇస్తానన్నారని...కాని తాను ఐదు కోట్లకు పెంచానని కూడా సంభాషణలో ఉందని గుర్తు చేసారు. గతంలోనే బ్రీఫ్డ్ మీ అని చంద్రబాబు సంభాషణ ఫోరెన్సిక్ ద్వారా కూడా ప్రూవ్ అయిందని...ఇప్పుడు ఈ వీడియో ద్వారా అది మరింత బలపడిందిన్నారు. ఈ వ్యవహారంపై తెలంగాణా ప్రభుత్వం గత నాలుగేళ్లుగా ఎందుకు స్పందించలేదని పెద్దిరెడ్డి ప్ర‌శ్నించారు.

CBN behind Data theft Case : YCP leader Peddireddy serious allegation

ఐటి గ్రిడ్స్ లో వారిద్ద‌రి పాత్ర‌
ఓట్ల తొలగింపుకు సంభందించి ఐటి గ్రిడ్ వ్యవహారంలో తెలుగుదేశం చంద్రబాబు,లోకేష్ లపాత్ర స్పష్టమైందని పెద్ది రెడ్డి పేర్కొన్నారు. ఆధార్ ,ఓట్ల జాబితా కలర్ ఫోటోలతో కూడినది.సంక్షేమపధకాల లబ్దిదారులు,బ్యాంక్ అకౌంట్లు ఇ లా రహస్యంగా ఉండాల్సిన ఐదు డేటాలు సేవామిత్రాలో ఎలా వచ్చాయని ప్ర‌శ్నించారు. పబ్లిక్ డొమెయిన్ కు సంబం దించినది అని వాదన తెరపైకి తెస్తున్నారని..అది పబ్లిక్ డొమెయిన్ కు సంభందించింది అయితే మీరు ఎందుకు కం గారు పడుతున్నారని ప్ర‌శ్నించారు. దొేంగతనం కప్పిపుచ్చుకునేందుకు డ్రామాలు ఆడుతున్నారన్నారు. ఐటి గ్రిడ్స్ సంస్ద డైరక్టర్ అశోక్ ఎందుకు పరారీలో ఉన్నాడని..చోరీ భాగోతం బయటకు రాకుండా ఉండేందుకు అశోక్ ను దాచిపె ట్టారుని ఆరోపించారు. విజయవాడ రామవరప్పాడు ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద కృష్ణాజిల్లాకు సంబంధించిన సమరశం ఖారావం ఈనెల 13 వతేదీన నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

English summary
ycp senior leader peddireddy Rama Chandra Reddy serious comments on CM Chandrababu and minister Lokesh. He says both of them involved in IT Grids Data theft case. If the did not done any mistake Ashok no need to escape. Telangana govt should punish who involved in Vote for note case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X