అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెన‌క్కు త‌గ్గిన కేంద్రం : ఆంక్ష‌లు ఎత్తివేత : బాబు దావోస్ ప‌ర్య‌ట‌న కు అనుమ‌తి ..!

|
Google Oneindia TeluguNews

ఎట్ట‌కేల‌ను కేంద్ర ప్ర‌భుత్వం త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంది. ఏపి ముఖ్య‌మంత్రి దావోస్ ప‌ర్య‌ట‌న‌లో విధించిన ఆంక్ష‌ల ను స‌వ‌రించింది. ఏపి ప్ర‌భుత్వం ..కేంద్రం విధించిన ఆంక్ష‌ల పై నేరుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ‌తో సంప్ర‌దింపులు జ‌రిపింది. ఫ‌లితంగా..ముఖ్య‌మంత్రి బృందంలోని 17 మందికి ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తిస్తూ...ప‌ర్య‌టన ను మాత్రం నాలుగు రోజుల‌కే కుదించింది...

17 మంది ప్ర‌తినిధుల‌కు అనుమ‌తి..

17 మంది ప్ర‌తినిధుల‌కు అనుమ‌తి..

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బృందం దావోస్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి కేంద్రం త‌న నిర్ణ‌యాన్ని పున‌స‌మీక్షించి.. తొలుత తీసుకున్న నిర్ణ‌యాల‌కు స‌డ‌లింపు ఇచ్చింది. వైఖ‌రి మార్చుకున్న కేంద్రం ముఖ్య‌మంత్రి బృందంలోని 17 మంది ప్ర‌తినిధ‌లుకు దావోస్ వెళ్లేందుకు అనుమ‌తి ఇచ్చింది.

కేంద్ర విదేశాంగ శాఖ ఆంక్ష‌లు

కేంద్ర విదేశాంగ శాఖ ఆంక్ష‌లు

అయితే, ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ఆరు రోజుల పాటు అనుమ‌తి కోర‌గా..దీనిని మాత్రం నాలుగు రోజుల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేసింది. ముఖ్య‌మంత్రి బృందం ఈ నెల 22 నుండి 25 వ‌ర‌కు దావోస్ లో ప‌ర్య‌టించేందుకు అంగీకరిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వానికి స‌మాచారం ఇచ్చింది. తొలుత సీయం ప‌ర్య‌ట‌న పై కేంద్ర విదేశాంగ శాఖ ఆంక్ష‌లు విధించింది. ప‌ర్య‌ట‌న‌కు అయిదుగురు ప్ర‌తినిధులే వెళ్లాల‌ని..నాలుగు రోజులే ప‌ర్య‌టించాల‌ని ఆంక్ష‌లు విధించ‌టం పై రాష్ట్ర ప్ర‌భుత్వం తీవ్రంగా స్పందించింది. దీని పై ముఖ్య‌మంత్రి సూచ‌న‌ల మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం విదేశాంగ శాఖ‌లో సంప్ర‌దింపులు జ‌రిపింది. ఫ‌లితంగా నిర్ణ‌యంలో మార్పు చేసు కుంటూ కేంద్రం తాజాగా అనుమ‌తుల‌ను జారీ చేసింది.

సంబంధాలు..పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా..

సంబంధాలు..పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా..

ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఏపికి చెందిన అధికారిక బృందంతో ప్ర‌తీ ఏటా దావోస్ వెళ్ల‌టం సాధార‌ణంగా జ‌రుగుతూనే ఉంది. ఈ సారి ప‌ర్య‌ట‌న పై కేంద్రం నుండి కొన్ని స‌మ‌స్య‌లు ఎదురైనా..ప‌ర్య‌ట‌న య‌ధాత‌ధంగా ఉంటుంద‌ని ఏపి ప్ర‌భుత్వ వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. సీయం తో పాటుగా మంత్రులు య‌న‌మ‌ల‌, లోకేష్ ..ముఖ్య‌మైన అధికారులు దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. అక్క‌డ అంత‌ర్జాతీయ ప్ర‌ముఖుల‌ను క‌లుసుకోవ‌టం..వారితో ఏపికి సంబంధాల‌ను మెరుగు ప‌రుచుకోవ‌టం తో పాటుగా..ప్ర‌ముఖ కంపెనీల‌ను ఏపిలో పెట్టుబ‌డుల‌కు ఆహ్వానించ‌టం కోసం దావోస్ ప‌ర్య ట‌న ఏర్పాటు చేసుకున్న‌ట్లు ప్ర‌భుత్వం చెబుతోంది. కేంద్రం తో ఈ అంశంలో వివాదం త‌ప్ప‌ద‌నుకున్న స‌మ‌యం లో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణ‌యం తో స‌మ‌స్య స‌మిసిపోయింది..

English summary
Central Govt Back Step on restrictions on AP C.M Dawoos Tour. Foreign Affairs Ministry Cleared permission for Chandra Babu tour along with his team for four days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X