అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపిని ప‌ట్టించుకోని కేంద్రం : పెరిగిన ప‌న్నుల వాటా : ఎందుకీ నిర్ల‌క్ష్యం..!

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్ర‌భుత్వం ఏపికి అండ‌గా నిలుస్తుందంటూ బిజెపి నేత‌లు చెబుతున్న మాట‌ల‌కు..చేత‌ల‌కు ఎక్క‌డా పొంతన ఉండ‌టం లేదు. ఎన్నిక‌ల ముందు ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో ఎక్క‌డా ఏపి ప్ర‌స్తావ‌న లేదు. ఏపి ప్ర‌జ‌ల సుదీర్ఘ డిమాండ్ల పై ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. ఏపిలోని కేంద్ర సంస్థ‌ల‌కు నిధులు కేటాయించగా..ప‌న్నుల వాటా కొంత పెరిగింది.

ఎందుకీ నిర్ల‌క్ష్యం..

ఎందుకీ నిర్ల‌క్ష్యం..

ఏపిలో కేంద్ర వైఖ‌రి పై సంవ‌త్స‌ర కాలంగా పెద్ద ఎత్తున ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. అధికార పార్టీ మొద‌లు ప్ర‌తిప‌క్ష పార్టీలు..ప్ర‌జా సంఘాలు కేంద్రం పై నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం ఎక్క‌డా వీటిని ప‌ట్టించు కోవ‌టం లేదు. పూర్తిగా ఏపి పై నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శిస్తోంది. ఓట్ల కోసం తాయిళాలు ప్ర‌క‌టించ‌గా..ఏపి లో మాత్రం ఓట్లు రావ నో..అవ‌స‌రం లేద‌నుకోనే గానీ 2019-20 మధ్యంతర బడ్జెట్‌ ప్రసంగం లో కనీసం ఆంధ్ర ప్రదేశ్‌ ప్రస్తావనే లేదు. పెం డింగ్‌ ప్రాజెక్టులపై ఊసే ఎత్తకపోగా, ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులకూ నిధులు కేటాయించలేదు. నూతన రాజధా ని అమరావతి... దుగరాజుపట్నం.. కడప స్టీల్‌ ప్లాంట్‌... విశాఖ రైల్వే జోన్‌ వంటి ప్రాజెక్టుల గురించి బడ్జెట్‌లో ప్రతిపాద నలే లేవు. మరీ ముఖ్యంగా గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ నిధులపై కేంద్రం నుంచి స్పంద న లేదు.

 కేంద్ర విద్యా సంస్థ‌ల‌కు ఆర‌కొర నిధులు

కేంద్ర విద్యా సంస్థ‌ల‌కు ఆర‌కొర నిధులు

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న విద్యాసంస్థల్లో కేవలం మూడింటికే నిధు లు కేటాయించింది. అవి కూడా అరకొర నిధులు కావడం గమనార్హం. కేంద్రియ విశ్వవిద్యాలయానికి రూ. 13 కోట్లు, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీకి(ఐఐపీఈ) రూ. 31.82 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రా ల గిరిజన విశ్వవిద్యాలయం కోసం ఉమ్మడిగా రూ. 8 కోట్లు కేటాయించారు. అలాగే, మనరాష్ట్రంలోని పలు కేంద్ర ప్రభు త్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు, విదేశీ సంస్థల ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు సాయం కోసం కొన్ని నిధులు కేటాయించింది. వేల కోట్ల రూపాయల అంచనా వ్యయాలతో స్థాపిస్తున్న విద్యాసంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.

పెరిగిన పన్నుల్లో వాటా

పెరిగిన పన్నుల్లో వాటా

గతేడాదితో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర పన్నులు, సుంకాల్లో వాటా దాదాపు రూ. 3573.23 కోట్లు పెరిగింది. 2019-20 సంవత్సరానికి రాష్ట్రానికి పన్నులు, సుంకాల్లో దక్కిన వాటా రూ. 36360.26 కోట్లు. గతేడాది పన్నుల వాటాగా రాష్ట్రానికి రూ. 32787.03 కోట్లు లభించాయి. ఇందులో కార్పొరేషన్‌ పన్నులపై రూ. 11775.31 కోట్లు, ఆదాయపన్ను రూపేనా రూ. 9893.51 కోట్లు, కేంద్ర జీఎస్టీ మొత్తం రూపేనా రూ.11004.42 కోట్లు, కస్టమ్స్‌ రూ. 2284.72 కోట్లు, కేంద్ర ఎక్సైజ్‌ సుంకం రూ. 1402.62 కోట్లు లభించాయి. మొత్తం పన్నుల సుంకాల్లో కేంద్రం నుంచి 4.3 శాతం లభించింది. అయితే, గతేడాది ఆంధ్ర ప్రదేశ్‌కు సమీకృత జీఎస్టీ కింద రూ. 904.05 కోట్లు వస్తాయని అంచనా వేసిన కేంద్రం, ఆ నిధులను ఇవ్వలేదు. మనకే కాకుండా ఏ రాష్ట్రానికీ ఈ నిధులు విడుదల చేయలేదు. ఈ బ‌డ్జెట్ పై ఏపి లో అధికార‌- విప‌క్ష నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ బ‌డ్జెట్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపిలో బిజెపి పై తీవ్ర ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది.

English summary
Central Govt totally ignored AP in budget allocations. In total budget speech did not mention AP name any where. Not mentioned about railway zone and special status in budget speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X