అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతికి కేంద్రం భారీ షాక్‌- రెండు విభజన హామీలకు మంగళం- కారణం జగన్‌ సర్కార్‌

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ సర్కార్‌ తీసుకొచ్చిన మూడు రాజధానుల వ్యవహారం మరో కీలక ప్రాజెక్టు ఉసురుతీసింది. అసలే కేంద్రం నుంచి అరకొర సాయం అందుతున్న తరుణంలో గతంలో ఒప్పుకున్న ఓ ప్రాజెక్టును కేంద్రం తాజాగా రద్దు చేసుకోవడం కలకలం రేపుతోంది. దీనికి ప్రధాన కారణం వైసీపీ సర్కారు మూడు రాజధానుల ప్రతిపాదన. ఇప్పటికే రాయలసీమతో అమరావతిని కలిపే ఎక్స్‌ప్రెస్‌ హైవే విషయంలో కోతలు, నిర్లక్ష్యం సాగుతుండగా.. ఇప్పుడు అమరావతి రైల్వే లైన్‌ ప్రతిపాదనకు సైతం కేంద్రం గుడ్‌ బై చెప్పేసింది. వైసీపీ సర్కారు అభిప్రాయం మీదటే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా చెప్పేసింది.

అమరావతికి మరో ఝలక్‌

అమరావతికి మరో ఝలక్‌

ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు ఒక్కొక్కటిగా మంగళం పాడేస్తున్న కేంద్రం తాజాగా అమరావతికి గతంలో ఇవ్వజూపిన రెండు కీలక ప్రాజెక్టులకు చెక్‌ పెట్టేసింది. రాజధానిగా అమరావతికి తగ్గిన ప్రాధాన్యంతో పాటు వైసీపీ సర్కార్‌ అనాసక్తత తోడు కావడంతో రెండు హామీలు చెత్త బుట్టలోకి చేరిపోయాయి. గతంలో కేంద్రం విభజన చట్టంలో స్వయంగా ఇచ్చిన హామీలను అమలు చేయించడంలో ఒత్తిడి తీసుకురాలేకపోతున్న వైసీపీ సర్కార్‌.. ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టుల విషయంలోనూ కేంద్రం వద్ద చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా కేంద్రం కూడా వాటిని బుట్టదాఖలు చేసేసింది.

అమరావతి రైల్వే లైన్‌కు మంగళం

అమరావతి రైల్వే లైన్‌కు మంగళం

విజయవాడ-గుంటూరు వయా అమరావతి రైల్వే లైన్‌ కోసం గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. రూ.1732 ఖర్చుతో చేపట్టే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటా పంచుకోవాల్సి ఉంటుంది. 2017-18 బడ్జెట్‌లోనే దీన్ని చేర్చారు. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరుకు సింగిల్‌ లైన్‌కు డీపీఆర్‌ కూడా సిద్ధం చేశారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు వ్యయం పంచుకునే విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించాలని నీతి ఆయోగ్‌ రైల్వేశాఖకు సూచించింది. అయితే ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు మూడు రాజధానుల నేపథ్యంలో దానికి అంగీకరించలేదు. దీంతో ప్రాజెక్టును కేంద్రం రద్దు చేసింది.

అమరావతి-హైదరాబాద్‌ ర్యాపిడ్ రైళ్లూ రద్దు

అమరావతి-హైదరాబాద్‌ ర్యాపిడ్ రైళ్లూ రద్దు

ఏపీ రాజధాని అమరావతి నుంచి హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలకూ ర్యాపిడ్‌ రైళ్లు వేయాలని గతంలో విభజన చట్టంలో హామీల మేరకు నిర్ణయించారు. అయితే ఈ ప్రతిపాదనకూ కేంద్రం తాజాగా మంగళం పాడేసింది. ఇప్పటికే అమరావతి నుంచి తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ బాగానే ఉన్నందున ర్యాపిడ్‌ రైళ్లు అవసరం లేదని రైల్వేశాఖ తాజాగా సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఓ దరఖాస్తుకు కేంద్రం సమాధానం ఇచ్చింది. దీంతో అమరావతికి రావాల్సిన ర్యాపిడ్‌ రైళ్ల ప్రాజెక్టు కూడా మూడు రాజధానుల వ్యవహారంతో రద్దయిపోయింది.

 అమరావతికి వరుస దెబ్బలు

అమరావతికి వరుస దెబ్బలు


అమరావతి రాజధానిని మూడుగా విభజించాలని వైసీపీ సర్కారు ఎప్పుడైతే నిర్ణయించిందో అప్పటి నుంచీ దీనికి అన్నీ ఎధురుదెబ్బలే. ఇప్పటికే గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు సంస్ధలు అంగీకరించిన పలు కీలక ప్రాజెక్టులు రాజధానుల వ్యవహారం తెరపైకి రాగానే ఒక్కొక్కటీ కనుమరుగు కావడం మొదలుపెట్టాయి. ఇప్పుడు మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులు కూడా రద్దవడం చూస్తుంటే భవిష్యత్తులో అమరావతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పూర్తిగా మంగళం పాడేయడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ సర్కారు ఆసక్తి లేనందువల్లే రైల్వే ప్రాజెక్టులు రద్దు చేసినట్లు చెబుతున్న కేంద్రం.. భవిష్యత్తులో ఇదే సాకుతో మరే ఇతర ప్రాజెక్టునూ అమరావతికి కేటాయించడం కష్టమేనన్న వాదన వినిపిస్తోంది.

English summary
the union government has dropped construction of amaravati railway line project due to a proposal rejecting to incurr state govt share from ysrcp govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X