అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మ‌రోసారి రిజ‌ర్వేష‌న్ల తుట్టెను క‌దుపుతున్న సీయం : ద‌ళిక క్రైస్త‌వుల‌ పై కీల‌క కామెంట్లు.

|
Google Oneindia TeluguNews

కాపు రిజ‌ర్వేష‌న్ల అంశం ఇంకా కొలిక్కి రాలేదు. దీని పై కాపు సంఘాలు మండి ప‌డుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యం లో ఇచ్చిన హామీ ఇప్ప‌టి దాకా అమ‌లు కాలేదు. కానీ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మ‌రోసారి ఏపి లో రిజ‌ర్వేష‌న్ల తుట్టెను క‌దిపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా, ద‌ళిత క్రైస్త‌వుల విష‌యంలో చేసిన కామెంట్లు కొత్త చ‌ర్చ‌కు కార‌ణ‌మయ్యాయి..

ఏపిలో 2014 ఎన్నిక‌ల్లో కాపుల‌ను రిజ‌ర్వేష‌న్లు ఇస్తామ‌ని టిడిపి హామీ ఇచ్చింది. ఇప్ప‌టికీ ఆ హామీ అమ‌లు కావ‌టం లేదు. అయితే, ఈ హామీ అమ‌లు కోసం బిసి క‌మిష‌న్ ను ఏర్పాటు చేసి ప్ర‌భుత్వం నివేదిక కోరింది. ఆ క‌మిటీ ఛైర్మ‌న్ -స‌భ్యులు రెండు ర‌కాలుగా నివేదిక ఇచ్చారు.

Chandra Babu assurance to Dalilt Christians..

మెజార్టీ స‌భ్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్ర‌భుత్వం కాపుల‌కు ఏపిలో రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ శాస‌న‌స‌భ‌లో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కేంద్రం ఇప్ప‌టి వ‌ర‌కు దాన్ని ఆమోదించ‌లే దు. సుప్రీం ఆదేశాల మేర‌కు 50 శాతం కు మించి రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయ‌టానికి లేదు. అయితే, త‌మిళ‌నాడు త‌ర‌హా లో రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాల‌ని కాపు నేత‌లు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం పై ఒత్తిడి తెచ్చి ఏపి ప్ర‌భుత్వ ముసాయిదాను ఆమోదించేలా చూడాలని ఒత్తిడి తెస్తున్నారు.

ఇది ఇలా కొన‌సాగుతండ‌గానే..ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ద‌ళిత క్రైస్త‌వుల విష‌యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. దళిత క్రైస్తవుల్లో ఎంతోమంది పేదవాళ్లు ఉన్నారు. వారు వెనుకబడిన కులాల్లో ఉండడం వల్ల చాలా నష్టపోతున్నారు. దళిత క్రైస్తవులను కూడా ఎస్సీ కులాల జాబితాలో చేర్చాలని తొలి నుంచీ టీడీపీ ప్రభుత్వం కోరుతోందని..

దీనిని కేంద్రం అమలు చేసే వరకు వారికి అండగా నిలబడుతుంది అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇదే చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది. ముఖ్య‌మంత్రి హామీ మాట‌ల‌కే ప‌రిమిత‌మా లేక ఆచ‌ర‌ణ‌లో సాధ్య‌మ‌వుతుందా అనే చ‌ర్చ మొద‌లైంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌..పూర్తిగా రాజ‌కీయ కోణంలో ఇస్తున్న హామీలు పార్టీకి ఇబ్బందిగా మారుతాయ‌నే ఆందోళ‌న సైతం ఏపి అధికార పార్టీలోని కొంద‌రు నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

English summary
AP C.M Chandra Babu Assured reservations for Dalit chritians in A.P. Now this assurance became political discussion in Ap political parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X