• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జైల్లో కూర్చుంటారు .. అఖిల‌ప‌క్షంలో కూర్చోరా : ఆ రోజు బ్లాక్ డే ..!

|
  Chandra Babu Fires on Modi,Jagan And Kanna Lakshminarayana | Oneindia Telugu

  అఖిల‌ప‌క్ష భేటీల‌కు హాజ‌రు కాని వైసిపి పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఫైర్ అయ్యారు. బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ గ‌త 16 ఏళ్ల కాలంలో త‌న పై మూడు పిటిష‌న్లు వేసార‌ని గుర్తు చేసారు. వైసిపి- బిజెపి కుట్ర‌ల‌ను ప్ర‌జ ల్లోకి తీసుకెళ్లాల‌ని ముఖ్య‌మంత్రి పిలుపునిచ్చారు. విప‌త్తు సాయంలోనూ ఏపి పై వివ‌క్ష చూపించార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

  జైల్లో కూర్చుంటారు కానీ...

  అఖిల‌ప‌క్ష స‌మావేశానికి హాజ‌రు కాక‌పోవ‌టం పై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసిపి పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. పార్టీ నేత‌ల‌తో జ‌రిగిన టెలి కాన్ఫిరెన్స్ లో ముఖ్య‌మంత్రి ఈ విష‌యం పై సీరియ‌స్ కామెంట్లు చేసారు. టీడీపీతో కలిసి భేటీలో కూర్చోబోమనడం హాస్యాస్పదమని... జైల్లో కూర్చుంటారు కానీ అఖిలపక్ష భేటిలో కూర్చోరా అం టూ ఫైర్ అయ్యారు. 16 ఏళ్లలో బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు కన్నా తనపై 3 పిటిషన్లు వేశారని, వైఎస్ స్వయంగా 13 పిటిష న్లు వేశారని, అనుచరులతో 12 కేసులు వేయించారని ఆయన గుర్తు చేశారు. 9 ఏళ్లలో మొత్తం 25కోర్టు కేసులు వేశార న్నారు. జగన్ తల్లితో 2, 464 పేజీల పిల్ వేయించారని తెలిపారు. తనపై వేసిన అన్ని పిటిషన్లను కోర్టులు కొట్టివేశాయ ని, ఒక్క ఆరోపణను రుజువు చేయలేక పోయారననారు. పోలవరం, అమరావతి, పట్టిసీమపై కేసులు వేశారని చంద్ర‌బాబు మండిప‌డ్డారు.

  Chandra Babu call for Block day on Feb 1st..!

  వైసిపి - బిజెపి కుట్ర‌ల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లండి..

  వైసిపి అధినేత జ‌గ‌న్‌..ప్ర‌ధాని మోదీ కుట్ర‌ల‌ను క‌న్నా అమ‌లు చేస్తార‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. వైసీపీ, బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. జగన్ అత్యాశ రాష్ట్రానికే పెను ప్రమాదమన్నారు. అత్యాశతో నే జగన్మోహన్‌రెడ్డి పతనం ఖాయమని స్పష్టంచేశారు. డబ్బు, అధికార వ్యామోహం ఉండకూడదని హితవుపలికారు. మోదీ పాలన వైఫల్యాలపై చైనాలో ప్రచారం జరుగుతోందని, చైనా గ్లోబల్‌ టైమ్స్‌ కథనాలే మోదీ వైఫల్యాలకు రుజువ ని పేర్కొన్నారు. మోదీపై నిరుద్యోగుల్లో వ్యతిరేకత ఉందని సీఎం తెలిపారు. విపత్తు సాయంలోనూ ఏపీపై మోదీ వివక్ష చూపించారని మండిపడ్డారు. మహారాష్ట్రకు రూ.4,717 కోట్లు ఇచ్చి ఏపీకి రూ.900 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. 347 మండలాల్లో కరువును కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఈ 60 రోజులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని నేతల కు సూచించారు. కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజు బ్లాక్‌ డే అని, నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో నిరసన తెలపాలని పార్టీ నేత‌ల‌ను ఆదేశించారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  AP CM Chandra Babu fore on YCP Chief Jagan BJP state president Kanna Lakshmi Narayana. He says that Jagan sit in Jail but not sit with TDP in All party meeting. CM call for Block day on Central Budget presentation day.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more