అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు భావోద్వేగం: అక్కడ మట్టికి సాష్టాంగ నమస్కారం: నాడు ప్రధాని మోదీతో..!

|
Google Oneindia TeluguNews

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. రాజధానిలో ఉద్రిక్తతల మధ్య చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కరకట్ట వద్ద చంద్రబాబు నివాసం వద్ద ప్రారంభమైన పర్యటన ఆ తరువాత వెంకటాయపాలెం చేరుకున్నాక కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఎదురయ్యాయి. కొందరు చంద్రబాబు కాన్వాయ్ మీద చెప్పులు..రాళ్లు వేసే ప్రయత్నం చేసారు. పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబుకు అనుకూల .. వ్యతిరేకంగా నినాదాలతో పర్యటన కొనసాగుతోంది. పలు చోట్ల నిరసనవ్యక్తం చేస్తూ నల్లజెండాలు ప్రదర్శించారు. ఇక..ఉద్దండరాయుని పాలె చేరుకున్నాక చంద్రబాబు గతంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వెళ్లారు. అక్కడ భావోద్వేగానికి గురయ్యారు. అక్కడ మట్టికి సాష్టాంగ నమస్కారం చేశారు.

చంద్రబాబు అప్పులు అప్పగించారు: మహారాష్ట్ర కొత్త ప్రభుత్వంలో ఏంటీ సమీకరణాలు: సీఎం జగన్..!చంద్రబాబు అప్పులు అప్పగించారు: మహారాష్ట్ర కొత్త ప్రభుత్వంలో ఏంటీ సమీకరణాలు: సీఎం జగన్..!

 చంద్రబాబు భావోద్వేగం..

చంద్రబాబు భావోద్వేగం..

అమరావతిలో చంద్రబాబు పర్యటనలో భాగంగా తొలుత వైసీపీ ప్రభుత్వం కూల్చి వేసిన ప్రజావేదికను ఆయన పరిశీలించారు. ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన చేసిన స్థలానికి చేరుకున్న బాబు అక్కడ అమరావతి మట్టికి సాష్టాంగ నమస్కారం చేశారు. 2015 అక్టోబర్ 21న ప్రధాని మోదీతో సహా పలువురు ప్రముఖులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ శంకుస్థాసన జరిగిన తరువాత ఎటువంటి నిర్మాణాలు చోటు చేసుకోలేదు. ప్రతిపక్ష నేతగా తొలిసారి అక్కడకు వచ్చిన చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ నేతలతో నాటి శంకుస్థాపన ప్రోగ్రాం జరిగిన తీరును గుర్తు చేసుకున్నారు.

పార్లమెంట్ నుండి మట్టి..నీరు

పార్లమెంట్ నుండి మట్టి..నీరు

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీ అదే వేదిక నుండి ఏపీ కి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదే సమయంలో పార్లమెంట్ నుండి తెచ్చిన మట్టి ను ఏపీ ముఖ్యమంత్రికి అందించారు. దీంతో..నాడు ప్రధాని ఏపికి మట్టి ఇచ్చి వెళ్లారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఆ తరువాత కేంద్రం రాజధానిలో విభజన బిల్లు మేరకు నిర్మాణాల కోసం రూ 1500 కోట్లు..ఆ తరువాత కేంద్ర పట్టణాభివుద్ది శాఖ నుండి రూ 1000 కోట్లు విడుదల చేసారు. ఆ తరువాత రాజధానికి సంబంధించి ఎటువంటి నిధులు కాలేదు. ఇక, ప్రస్తుత ప్రభుత్వంలో నిర్మాణాలు పూర్తిగా నిలిచి పోయాయి. ఇప్పుడు చంద్రబాబు తన పర్యటనలో సైతం అదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.

రెండు గా చీలన రాజధాని రైతులు..

రెండు గా చీలన రాజధాని రైతులు..

గతంలో ఒక్కటిగా వాయిస్ వినిపించిన రాజధాని ప్రాంత రైతుల్లో ఇప్పుడు రెండు వర్గాలు కనిపిస్తున్నాయి. అందునా దళిత రైతులను చంద్రబాబు మోసం చేసారంటూ ఆందోళనకు దిగుతున్నారు. నల్ల జెండాలతో ఆందోళన చేస్తున్నారు. చంద్రబాబు పర్యటన సమయంలో ఆయన కాన్వాయ్ మీద రాళ్లు..చెప్పులతో దాడికి ప్రయత్నించారు. రెండు వర్గాలుగా చీలి..చంద్రబాబు అనుకూల..వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, ఉద్దండరాయుని పాలెంలో చంద్రబాబుకు పార్టీ నేతల నుండి స్వాగతం లభించింది. అక్కడ నిరసనలు వ్యక్తం కాలేదు. చంద్రబాబు వెంట జాతీయ మీడియా సైతం ఉండటంతో వారికి రాజధాని పరిస్థితిని చంద్రబాబు వివరిస్తున్నారు.

English summary
CBN emotionl in place Amaravti foundation stone inagurated by PM Modi. As pat of Amaravati tour CBN visited Uddandarayunipalem in captial region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X