అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేడు ఢిల్లీకి చంద్ర‌బాబు..! రాహుల్ తో పాటు మ‌రికొంత మంది జాతీయ నేత‌ల‌తో భేటీ..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Chandrababu Meeting With The Leaders Of Non-BJP Parties In The Evening | Oneindia Telugu

అమరావతి/ హైద‌రాబాద్ : సాధార‌ణ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఏపీ సీయం చంద్ర‌బాబు నాయుడు దూకుడు పెంచిన‌ట్టు తెలుస్తోంది. బీజేపి ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న జాతీయ స్థాయిలో పావులు క‌దుపుతున్నారు. అందులో భాగంగా ఆయ‌న ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. వచ్చే ఎన్నికల కోసం బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటుపై కలిసివచ్చే నాయకులతో చర్చిలు జరుపుతున్న విషయం తెలిసిందే. సాయంత్రం బీజేపీయేతర పక్షాల నేతలతో చంద్రబాబు భేటీ అవుతారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మాయావతి, శరద్‌పవార్‌, ఫరూక్ అబ్దుల్లా, దేవెగౌడ, సీతారాం ఏచూరిని కలవనున్నారు. కూటమి విధివిధానాలు, భవిష్యత్‌ కార్యాచరణపై నేతలు చర్చించనున్నారు. అంతేకాకుండా టీడీపీ ఎంపీలతో సమావేశంకానున్నారు. కేంద్రంతో పోరాటంపై ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేస్తారు. ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు, పోలవరం, వెనుకబడిన జిల్లాల నిధులపై ఎంపీలతో బాబు చర్చించనున్నారు.

Chandrababu to Delhi today..! Meet Rahul with some national leaders..!!

ఇదిలా ఉండ‌గా తాను 2004 ముందు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు బ్లెయిర్ హైద‌రాబాద్‌కు వ‌చ్చారని ఏపీ సీఎం చ‌ంద్ర‌బాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింట‌న్ చంద్ర‌బాబు నాయుడు గురించి, హైద‌రాబాద్ గురించి చెప్పార‌ని, అందువ‌ల్లే ఇక్క‌డి వ‌చ్చాన‌ని టోనీ చెప్ప‌డం సంతోషం అనిపించింద‌ని బాబు గుర్తి చేసుకున్నారు. బ్లెయిర్ చాలా గొప్ప నేత‌. ఆయ‌న ఈ రోజు ఇక్క‌డ‌కు రావ‌డం, ఆయ‌న టోనీ బ్లెయిర్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ గ్లోబ‌ల్ ఛేంజ్ కోసం ఆయ‌న ప‌నిచేయ‌డం ఆనందంగా ఉందని. ఇటీవ‌లే సింగ‌పూర్‌లో తాను ఆయ‌న్ను క‌లిశానని, అమరావతికి రావాలని త‌న ఆహ్వానం మేర‌కు వ‌చ్చినందుకు బాబు టోనీకి క్రుత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

English summary
Chandrababu is going to Delhi today. He will be meeting with the leaders of non-BJP parties in the evening. Congress leader Rahul Gandhi, Mayawati, Sharad Pawar, Farooq Abdullah, Deve Gowda and Sitaram Yechury will meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X