అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ రాక‌కు ముందు రోజే..అదే వ్యూహంతో : 13న అమ‌రావ‌తి స‌భ : జాతీయ నేత‌ల‌కు బాబు ఆహ్వానం..!

|
Google Oneindia TeluguNews

ప్ర‌ధాని మోదీ వ్య‌తిరేక ప‌క్షాల స‌భ అమ‌రావ‌తిలో నిర్వ‌హ‌ణకు ముహూర్తం ఖ‌రారైంది. స్థానిక‌.. జాతీయ రాజ‌కీయాల‌కు స‌మాధానం చెప్పేలా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఈ ముహూర్తాన్ని ఫిక్స్ చేసారు. ఫిబ్ర‌వ‌రి 14న కేసీఆర్ ఏపికి వ‌స్తార‌ని చెబుతున్న స‌మ‌యంలో..ఆయ‌న అమ‌రావ‌తికి రావ‌టానికి కొన్ని గంట‌ల ముందే ఈ స‌భ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించా రు. అందుకోసం ఫిబ్ర‌వ‌రి 13న అమ‌రావ‌తి స‌భ నిర్వ‌హ‌ణ‌కు నిర్ణ‌యించిన బాబు ఆహ్వానాలు పంపుతున్నారు.

కేసీఆర్ రాకకు ప్రాధాన్య‌త త‌గ్గించేలా..

కేసీఆర్ రాకకు ప్రాధాన్య‌త త‌గ్గించేలా..

ప్ర‌స్తుతం ఏపి - తెలంగాణ ముఖ్య‌మంత్రులు ఇద్ద‌రూ స్ప‌ష్ట‌మైన రాజ‌కీయ ల‌క్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. భ‌విష్య‌త్ ప్ర‌యెజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకొని అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా..ఏపిలోని చంద్ర‌బాబు ప్ర‌త్య‌ర్ధి పార్టీల ను త‌న‌తో క‌లుపుకు వెళ్లేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే..వైసిపి అధినేత జ‌గ‌న్ లో టి ఆర్‌య‌స్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. త‌రువాతి స‌మావేశం ఫిబ్ర‌వ‌రి 14న విజ‌య‌వాడ‌లో జ‌రుగుతుం ద‌ని స‌మ‌చారాం. ఆదే రోజు జ‌గ‌న్ తాడేప‌ల్లి లో త‌న కొత్త ఇంటి గృహ‌ప్ర‌వేశానికి రావాల‌ని కేసీఆర్ ను ఆహ్వానించారు. అదే స‌మ‌యంలో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌లో వైసిపి ని కేసీఆర్ ఆహ్వానించ‌నున్నారు. ఏపికి ప్ర‌త్యేక హోదా విష‌యంలో త‌మ వైఖ‌రిని విజ‌య‌వాడ కేంద్రంగా స్ప‌ష్టం చేయ‌టంతో పాటుగా చంద్ర‌బాబు లక్ష్యంగా రాజ‌కీయంగానూ కీల‌క వ్యాఖ్య‌లు చేస్తార‌ని చెబుతున్నారు. దీంతో..చంద్ర‌బాబు త‌న వ్యూహాల‌కు ప‌దును పెట్టారు. ఇందు కోసం ఇటు ఏపిలోనూ..అటు జాతీయ స్థాయిలోనూ అంద‌రి దృష్టి ఆక‌ర్షించ‌టానికి కొత్త వ్యూహం సిద్దం చేసారు.

ఫిబ్ర‌వ‌రి 1న ఏపి బంద్ : ఎన్నిక‌ల ముందు హోదా బ‌రిలోకి పార్టీలు..! ఫిబ్ర‌వ‌రి 1న ఏపి బంద్ : ఎన్నిక‌ల ముందు హోదా బ‌రిలోకి పార్టీలు..!

ఫిబ్ర‌వ‌రి 13న అమ‌రావ‌తి స‌భ‌..

ఫిబ్ర‌వ‌రి 13న అమ‌రావ‌తి స‌భ‌..

క‌ల‌క‌త్తాలో తృణ‌మూల్ అధినేత్రి ..ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ నిర్వ‌హించిన స‌భ‌కు ధీటుగా అమ‌రావ‌తిలో భారీ స‌భ ను నిర్వ‌హించాల‌ని టిడిపి అధినేత చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఇందు కోసం అమ‌రావ‌తి స‌భ‌ను ఫిబ్ర‌వ‌రి 13న ముహూర్తంగా ఖ‌రారు చేసారు. ఇందులో వ్యూహం దాగి ఉన్న‌ట్లుగా భావిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ‌లోనే కాకుండా ఏపిలోనూ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధిగా కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జ‌గ‌న్ తో మైత్రి క‌డుతున్నారు. ఎలాగైనా ఏపి ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఓడిపోవాల‌ని కేసీఆర్ కోరుకుంటున్నారు. ఇక‌, జాతీయ స్థాయిలో చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాల‌ను తిప్పి కొట్టే లా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ రాజ‌కీయాల‌కు ఊపిరి పోస్తున్నారు. దీంతో..జాతీయ స్థాయిలో త‌న పర‌ప‌త్తి ఏంటో చాటుకొనేందు కు కేసీఆర్ ఏపికి వ‌చ్చే కొద్ది గంట‌ల ముందే జాతీయ నేత‌ల‌న అమ‌రావ‌తికి ఆహ్వానించాల‌ని..భారీ స‌భ‌ను నిర్వ‌హించా ల‌ని నిర్ణ‌యించారు. దీని కోసం ముందుగా కాంగ్రెస్ అధినేత రాహుల్ తో చ‌ర్చించి..ఇదే ముహూర్తాన్ని ఖ‌రారు చేసా రు. జాతీయ నేత‌ల రాక‌తో ..కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌కు అంత‌గా విలువ ఉండ‌ద‌నేది చంద్ర‌బాబు అంచ‌నాగా క‌నిపిస్తోంది.

రాహుల్..జాతీయ నేత‌లకు ఆహ్వానం..

రాహుల్..జాతీయ నేత‌లకు ఆహ్వానం..

అమ‌రావ‌తి వేదిక‌గా జాతీయ నేత‌ల‌ను ఆహ్వానించి త‌న ఇమేజ్ పెంచుకోవాల‌నేది చంద్ర‌బాబు వ్యూహంగా క‌నిపిస్తోం ది. ఏపిలో ఇప్ప‌టికే సంక్షేమ ప‌ధ‌కాల ప్ర‌క‌ట‌న తో పాటుగా ఎన్నిక‌ల వ్యూహాల‌ను ఇప్ప‌టికే చంద్ర‌బాబు అమ‌లు చేస్తు న్నారు. జాతీయ నేత‌ల ద్వారా ఏపికి జ‌రిగిన అన్యాయం..చంద్ర‌బాబు చేసిన అభివృద్దిని వారి మాట‌ల ద్వారా చెబితే ఏపిలో త‌మ‌కు రాజకీయంగా మ‌రింత లాభం జ‌రుగుతుంద‌నే అంచ‌నాలో టిడిపి నేత‌లున్నారు. దీంతో...ముందుగా కాంగ్రెస్ అధినేత రాహుల్ తో ఈ అంశాన్ని ప్ర‌స్తావించారు. ఆయ‌న అమ‌రావ‌తికి రావ‌టానికి అంగీక‌రించిన‌ట్లు స‌మాచా రం. అదే వేదిక నుండి రాహుల్ మ‌రో సారి ఏపికి ప్ర‌త్యేక హోదాకు హామీ ఇవ్వ‌నున్నారు. ఇక‌, ఇదే స‌భ ద్వారా ఎన్నిక ల స‌మ‌ర‌శంకం పూరించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఈ స‌భ‌కు జాతీయ నేత‌ల‌ను ఆహ్వానించేందుకు మ‌రోసారి చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్ల‌నున్నారు.

English summary
Chandrababu strategies against KCR : Amaravati Meeting on Feb 13th..!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X