అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ జగన్ పాదయాత్రపై జయహో పుస్తకం: ఆ మంత్రం..ప్రతిక్షణం ఉత్తేజితుడిని చేసిందన్న సీఎం

Array

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో చిరస్మరణీయ ఘట్టం పాదయాత్ర. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లోనే.. వైఎస్ జగన్ కూడా ప్రతిపక్ష నేతగా రాష్ట్రం ఆ మూల నుంచి ఈ మూల వరకు పాదయాత్ర నిర్వహించారు. కడప జిల్లాలోని ఇడుపుల పాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ఆరంభమైన ఈ పాదయాత్ర 14 నెలల పాటు కొనసాగింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగిసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1475 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయగా.. జగన్ ఆ సంఖ్యను రెట్టింపు చేశారు. 3648 కిలోమీటర్లు నడిచారు. ఆ పాదయాత్ర.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీని అప్పగించింది. ముఖ్యమంత్రి పదవిని బంగారు పళ్లెంలో పెట్టి మరీ అప్పగించింది.

<strong>వీడియో: సముద్రంలో భగ్గుమన్న నౌక: విశాఖపట్నం సమీపంలో ఘటన</strong>వీడియో: సముద్రంలో భగ్గుమన్న నౌక: విశాఖపట్నం సమీపంలో ఘటన

పుస్తకంలో కొన్ని అరుదైన పిక్స్..

పుస్తకంలో కొన్ని అరుదైన పిక్స్..

రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన ఆ పాదయాత్రపై పుస్తకాన్ని రూపొందించారు సీనియర్ జర్నలిస్టు శ్రీరామచంద్ర మూర్తి. దీనికి జయహో అని నామకరణం చేశారు. ఈ పుస్తకాన్ని సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని తాడేపల్లిలో గల ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి `ది ప్రింట్` ఎడిటర్ శేఖర్ గుప్తా ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరయ్యారు. ఎమెస్కో సంస్థ దీన్ని ప్రచురించింది. వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్రలోని వివిధ సందర్భాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. పాదయాత్ర సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ అయిన దానికి భిన్నంగా కొన్ని అరుదైన ఫొటోలను ఇందులో చూడొచ్చు.

ఆ సంకల్పం ఒక్కటే స్పిరిట్ లా నడిపించింది..

ఆ సంకల్పం ఒక్కటే స్పిరిట్ లా నడిపించింది..

ప్రజలకు మేలు చేయాలని సంకల్పించుకోవడం ఒక్కటే తనను నడిపించిందని, ఆ మంత్రం ఒక్కటే స్పిరిట్ లా పనిచేసిందని వైఎస్ జగన్ అన్నారు. దీనికి ప్రజల ప్రోత్సాహం తోడైందని చెప్పారు. ప్రజల ప్రోత్సాహం, వారు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలు, మంచి చేయాలనే ఉద్దేశం తనను ప్రతిరోజు, ప్రతిక్షణం ఉత్తేజితుడిని చేసిందని, 3648 కిలోమీటర్ల పాటునడిపించిందని అన్నారు. 365 రోజులకు పైగా, 3648 కిలోమీటర్ల దూరం నడవటం అంటే సామాన్యమైన విషయం కాదని, ప్రజల సహకారంతోనే దాన్ని పూర్తి చేయగలిగానని అన్నారు. పార్టీకి చెందిన ప్రతి కార్యకర్తు, ప్రతి నాయకుడు, ప్రతి సోషల్ మీడియా సైనికుడు తన వెంట నడిచారని వైఎస్ జగన్ చెప్పారు. అందుకే- ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయకుండా పరిపాలిస్తానని అన్నారు.

నన్ను భయపెడుతున్నది అదే..

నన్ను భయపెడుతున్నది అదే..

మాట తప్పకూడదు.. మడమ తప్పకూడదనే భయం తనను వెంటాడుతుంటుందని వైఎస్ జగన్ చెప్పారు. 14 నెలల పాటు సాగిన ఈ ప్రయాణంలో ప్రతి పేదవాడిని కలిశానని, దాని ఫలితంగానే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 50 శాతం ఓట్లు తమ పార్టీకి లభించాయని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపన ఉంటే.. ఎలాంటి కష్టాన్నయినా అవలీలగా ఎదుర్కొనవచ్చనడానికి తన పాదయాత్రే ఉదాహరణ అని చెప్పారు. మంచి చేయాలనే తపనకు దేవుడి ఆశీర్వాదం తోడై, అనుకున్న లక్ష్యాన్ని అందుకోగలిగామని వైఎస్ జగన్ చెప్పారు. తాను అధికారంలోకి వచ్చిన ఈ కొద్దిరోజుల వ్యవధిలో ఏదైనా మంచి పని చేశానూ అని అంటే.. దానికి కారణం పాదయాత్రలో తాను చూసిన సందర్భాలేనని గుర్తు చేసుకున్నారు. పేదల కష్టాలను తీర్చడానికి పాదయాత్రలోే అనేక కీలక నిర్ణయాలను తీసుకున్నానని చెప్పారు.

వైఎస్ జగన్ ఓ ఫైటర్..

వైఎస్ జగన్ ఓ ఫైటర్..


3648 కిలోమీటర్ల మేర పాదయాత్రను చేయడం ద్వారా వైఎస్‌ జగన్‌ ఓ సరికొత్త చరిత్రకు నాంది పలికారని ప్రముఖ జర్నలిస్ట్‌ శేఖర్‌ గుప్తా అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనను తాను నిశితంగా పరిశీలించానని, అదే బాటలో ఆయన కుమారుడి పాలన కూడా సాగుతోందని చెప్పారు. వైఎస్ తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. తన పరిచయస్తులు ఎంతమందిలో ఉన్నా, గుర్తు పట్టి, పేరు పెట్టి పిలవడం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రత్యేకత అని చెప్పారు. కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టి కరిపించిన వైఎస్ జగన్.. తన దృష్టిలో ఓ గొప్ప పోరాటయోధుడని అన్నారు. దేశంలో జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయని, వైఎస్‌ జగన్‌ నాయకత్వం రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరముందని చెప్పారు.

English summary
A book on Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy's Praja Sankalpa Yatra was launched on Monday. The book titled 'Jaya Ho- From Idupulapaya To Icchapuram' was about the historical Praja Sankalpa Yatra, the mass outreach programme he had undertaken before the elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X