అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు : వైరల్‌ అవుతున్న చింతమనేని వీడియో ..!

|
Google Oneindia TeluguNews

ఏపి ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మ‌రోసారి వివాదంలో నిలిచారు. ఎప్పుడూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు..స‌మ‌స్య‌ల తో చింత‌మ‌నేని ఏపిలోనే ప్ర‌త్యేక గుర్తింపు సాధించారు. తాజాగా ఆయ‌న ద‌ళితుల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల వీడి యా ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఆయ‌న ద‌ళితుల తో రాజ‌కీయాలు మీకెందుకురా అంటూ ఉప‌యోగించిన ప‌ద‌జాలం పై ఇప్పుడు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

మీకెందుకురా రాజ‌కీయాలు..
చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ గత నెల మొదటివారంలో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో నిర్వహించిన 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమంలో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసారు. నాటి వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారంది. మీరు దళితులు మీకెందుకురా రాజకీయాలంటూ దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు వెనుకబడిన వారు.. షెడ్యూల్‌ క్యాస్ట్‌ వారంటూ ఇష్టమొచ్చినట్లు తనదైన శైలిలో దూషించారు. రాజకీయాలు మాకుంటాయి.. పదవులూ మాకేనంటూ తన అహంకారం ప్రదర్శించారు. మీకెందుకురా పిచ్చముండా కొడకల్లారా కొట్లాట అంటూ అసభ్య పదజాలంతో దళితులను కించపరిచారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.

Chintamaneni controversial comments over dalits became viral

అస‌భ్య ప‌ద‌జాలంలో వివాదంలోకి..
జ‌న్మ‌భూమి స‌భ‌లో భాగంగా .. ఓ దళితుడు తాను మాట్లాడతానని మైక్‌ అడగడంతో చింతమనేని ఆగ్రహంతో ఊగిపో యారు. మొన్న జగన్‌మోహన్‌రెడ్డి వచ్చినప్పుడు నేను కావాలంటే అడ్డుకునేవాడిని కదా.. నేను మాట్లాడానా.. అప్పుడు గొడవ పడితే మీరు రారా.. అంటూ ప్ర‌శ్నించారు. ఇప్పుడు వీడు మాట్లాడతానంటూ మైక్‌ అడుగుతున్నాడంటూ చింత మనేని మండిపడ్డారు. రాజకీయంగా మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీరు దళితులు. మీరు వెనుకబడిన వారు. మీరు షెడ్యూల్‌ క్యాస్ట్‌ వారు. రాజకీయాలు మాకుంటాయి. మాకు పదవులు. మీకెందుకురా పిచ్చముండా కొడకల్లారా కొట్లాట.. అంటూ చింతమనేని దళితులను ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేసారు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవ్వడంతో చింతమనేని వివక్షపూరిత వ్యాఖ్యలపై దళిత సంఘాలు నాయకులు ఫైర్ అవుతున్నారు.

English summary
AP govt whip Chintamaneni Prabhakar ocnce again in controversy comments on Dalit community leaders in Janmabhoomi. Now this video become viral in social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X