ఆంగ్లంలో అదరగొట్టిన సర్కార్ బడి పిల్లలు.. ముచ్చటపడ్డ సీఎం జగన్, కలెక్టర్ అవుతా అంటూ
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన జరుగుతుంది. తెలంగాణతోపాటు ఏపీలో కూడా టీచ్ చేస్తున్నారు. ఆంగ్ల బోధనతో విద్యార్థులు చక్కగా భాషపై పట్టు సాధిస్తున్నారు. ఇంగ్లీషులో ముచ్చటగా మాట్లాడుతున్నారు. కాకినాడ బెండపూడికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడారు. వారు సీఎం జగన్ వద్ద.. తమ గురించి పరిచయం చేసుకున్నారు. తర్వాత ప్రభుత్వ పథకాలు.. ఏమీ అవుతామో అనే విషయాల గురించి మాట్లాడారు. ఆ ముగ్గురు ఇంగ్లీషులో ముచ్చటగా మాట్లాడగా.. సీఎం జగన్ కూడా సంబర పడిపోయారు.
హామీలు నెరవేరుస్తున్నారు: రేష్మా..
తాడేపల్లిలో
విద్యార్థులతో
సీఎం
జగన్
గురువారం
మాట్లాడారు.
రేష్మా
అనే
పదో
తరగతి
విద్యార్థిని
మాట్లాడిన
తీరును
చూసి
సీఎం
జగన్
మురిసిపోయారు.
హామీలను
నెరవేరుస్తున్న
సీఎం
మీరని
అన్నారు.
మీరు
ప్రజల
అభిమానం
చూరగొన్నారని
పేర్కొన్నారు.
ఇంగ్లీష్
నేర్చుకుంటే
అంతర్జాతీయ
స్థాయిలో
పోటీ
పడవచ్చని
చెప్పారు.
తమ
భవిష్యత్
మరింత
అందంగా
మారేందుకు
కారణం
మీరేనని
వివరించారు.
అమ్మ ఒడితో మేలు: మేఘన
మేఘన
అనే
విద్యార్థి
మాట్లాడారు.
అమ్మ
ఒడి
పథకం
పేదలకు
ఎంతో
ఉపయోగపడుతుందని
అభిప్రాయపడ్డారు.
సగటు
విద్యార్థిగా
ఉన్న
తనను
మంచి
వక్తంగా,
అదీ
ఇంగ్లీష్
ద్వారా
రాటుదేల్చారని
సంతోషం
వ్యక్తం
చేసింది.
సీఎం
జగన్
ఇంగ్లీష్
ఇంటర్వ్యూలు
ఎంతో
ఉపయోగపడ్డాయని
వివరించింది.
ఆంగ్లంపై
మరింత
పట్టు
వచ్చిందని
పేర్కొంది.
కలెక్టర్ అవుతా: అనుదీప్
అనుదీప్
అనే
విద్యార్థి
మాట్లాడారు.
సర్కార్
బడుల్లో
ఇంగ్లీష్
మీడియం
పెట్టడం
ఆనందంగా
ఉందన్నారు.
ఎవరెన్ని
విమర్శలు
చేసినా..
విద్యార్థులంతా
మీ
వెన్నంటి
ఉంటామని
చెప్పారు.
చిన్న
వాడు
అయినా..
చాలా
చక్కగా
చెప్పాడు.
తనకు
ఐఏఎస్
ఆఫీసర్
కావడమే
లక్ష్యం
అని
వివరించారు.
ఐఏఎస్
ఆఫీసర్
అయ్యేదాకా
మీరు
సీఎంగా
కొనసాగాలని
అన్నారు.
మీ
వద్ద
పని
చేయడం
తన
కోరికని,
ప్రామిస్
చేయమని
సీఎం
జగన్ను
కోరాడు.
దీంతో
సీఎం
జగన్
సహా
అక్కడున్న
వాళ్లంతా
ఒక్కసారిగా
నవ్వారు.
ఇంగ్లీష్
మాట్లాడటంలో
ప్రతిభ
చూపుతున్న
బెండపూడి
విద్యార్థులను
సీఎం
జగన్
మనసారా
అభినందించారు.