అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపిలో ఆ పార్టీదే పైచేయి.. పొత్తు తోనే ఎక్కువ లాభం : రిప‌బ్లిక్ టివి స‌ర్వే సంచ‌ల‌నం...!

|
Google Oneindia TeluguNews

ఏపిలో రాజ‌కీయ ప‌రిణామాలు..పార్టీల బ‌లాబ‌లాలు వేగంగా మారిపోతున్నాయి. రెండు నెల‌ల్లోనే అంచ‌నాలు మారి పోతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులే కీల‌కంగా మారుతున్నాయి. ప్ర‌ధానంగా వైసిపి- టిడిపి మ‌ధ్య ఉన్న పోటీ పొత్తు ల కార‌ణంగా నువ్వా..నేనా అన్న‌ట్లుగా మారుతోంది. తాజా రిప‌బ్లిక్ టివి సర్వే ప్ర‌కారం ఏపి లో వైసిపి దే పైచేయి గా క‌నిపిస్తోంది. అయితే, కాంగ్రెస్ -టిడిపి మ‌ధ్య పొత్తు కీల‌కంగా మారుతోంది..

ఏపిలో జ‌రగున్న ఎన్నిక‌ల పై రాష్ట్రంలోనే కాదు..దేశ వ్యాప్తంగా ఆస‌క్తి పెరుగుతోంది. ప్ర‌ధానంగా జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క భూమిక పోషించాల‌ని భావిస్తున్న టిడిపి అధినేత చంద్ర‌బాబుకు ఏపి లో బ‌లం చాటుకోవ‌టం అనివార్యం గా మారింది. దీంతో..ఏపిలో ఆయ‌న బ‌లం ఏంట‌నే అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. ఇదే క్ర‌మంలో జాతీయ ఛాన‌ల్ రిప‌బ్లిక్ టివి ఏపిలో లోక్‌స‌భ సీట్లు..ఎవ‌రికి ఎంత శాతం ఓట్లు అనే అంశం పై నిర్వ‌హించిన స‌ర్వే ఫ‌లితాల‌ను విడుదల చేసింది. ఇప్పుడు ఈ స‌ర్వే ఫ‌లితాలు ఏపిలో సంచ‌ల‌నం గా మారుతున్నాయి..

పొత్తులే కీల‌కం...క‌దిరితే ఇలా..

పొత్తులే కీల‌కం...క‌దిరితే ఇలా..

ఏపిలో పార్టీల బ‌లాబ‌లాల పై సీ ఓటర్‌తో కలిసి రిపబ్లిక్ టీవీ ప్రీ-పోల్ సర్వే నిర్వహించి సర్వే ఫలితాలను వెల్లడించిం ది. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉండబోతుందనే అంచనాలు వెలువరించింది. బీజేపీకి వ్యతిరేక పార్టీలు ఏకం చేయడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో టీడీ పీకి గ‌తంతో పోల్చుకుంటే కొంత అనుకూలంగా ఉన్నట్టు ఈ సర్వే తెలిపింది. అయితే, ఏపిలో టిడిపి - కాంగ్రెస్ మ‌ధ్య పొత్తు ఉంటుందా..

ఉండ‌దా అనేది ఇంకా తేలలేదు. తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత రెండు పార్టీల్లోనూ పొత్తు గురించి ఆందోళ‌న పెరుగుతోంది. దీంతో రిప‌బ్లిక్ టివి చేసిన స‌ర్వే టిడిపి - కాంగ్రెస్ పొత్తు ఉంటే ఏ విధంగా ఉంటుంద నే దాని పై ఆధారంగా నిర్వ‌హించారు. ఈ పొత్తు కార‌ణంగా టిడిపికి కొంత మెరుగైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని రిప‌బ్లిక్ టివి త‌న స‌ర్వే లో అంచనాకు వ‌చ్చింది. ఒక వేళ‌..టిడిపి - కాంగ్రెస్ మ‌ధ్య పొత్తు లేకుంటే..ఫ‌లితాలు మ‌రోలా ఉండే అవ‌కా శం ఉంది. దీంతో..పొత్తులే ఏపిలో కీల‌కంగా మార‌నున్నాయి..

జ‌గ‌న్ మాదిరిగా మాట్లాడుతూ : డ‌బ్బులు డిమాండ్జ‌గ‌న్ మాదిరిగా మాట్లాడుతూ : డ‌బ్బులు డిమాండ్

ఆధిక్యంలో వైసిపి..కోలుకుంటున్న టిడిపి..

ఆధిక్యంలో వైసిపి..కోలుకుంటున్న టిడిపి..

ఏపిలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే వైసిపి వైపే ప్ర‌జ‌లు ఉన్న‌ట్లు రిప‌బ్లిక్ టివి అంచ‌నా కు వ‌చ్చింది. రిప‌బ్లిక్ టివి స‌ర్వే ప్ర‌కారం ఏపిలో మొత్తం 25 లోక్‌స‌భ స్థానాల‌కు గాను..వైసిపి 14 సీట్లు గెలుస్తుంద‌ని అంచ‌నా కు వ‌చ్చారు. అదే విధంగా టిడిపి - కాంగ్రెస్ పొత్తు తో ఎన్నిక‌లకు వెళ్తే 11 సీట్ల‌ను కైవ‌సం చేసుకుంటుంద‌ని పేర్కొంది. అందులో భాగంగా..టిడిపి 8 స్థానాలు.. కాంగ్రెస్ 3 సీట్లు గెలిచే అవ‌కాశం ఉన్న‌ట్లు రిపబ్లిక్ టీవీ ప్రీ-పోల్ సర్వే వెల్లడించింది. ఇక‌, ఓట్ల శాతాల వారీగానూ అంచ‌నాల‌ను వెల్ల‌డించింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి ఓటమి ప్రభావం ఏపీలో ఉండబోదని స్పష్టం చేసింది. వైసీపీకి 41.6 శాతం ఓట్లు వస్తాయని, టీడీపీ- కాంగ్రెస్ కూటమికి 38.2 శాతం ఓట్లు దక్కించుకుంటుందని, బీజేపీకి 11 శాతం, ఇతరులు 9.3 శాతం ఓట్లు దక్కించుకుంటారని సర్వే ఫలితాలలో పేర్కొంది. దీని ప్ర‌కార‌మే అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో పార్టీలు త‌మ‌కు ద‌క్కే సీట్ల పై అంచ‌నాల‌కు వ‌స్తున్నాయి.

రెండు నెల‌ల్లో మారిన అంచ‌నాలు..బిజెపి కి నిల్‌..

రెండు నెల‌ల్లో మారిన అంచ‌నాలు..బిజెపి కి నిల్‌..

ఇదే రిప‌బ్లిక్ టివి అక్టోబరులో చేసిన‌ సర్వేలో వైసీపీ 21 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీడీపీకి కేవలం 4 సీట్లు మాత్ర మే దక్కుతాయని అంచనా వేసింది. అయితే, ఇప్పుడు చేసిన స‌ర్వేలో అంచ‌నాల్లో తేడా క‌నిపించింది. తాజా స‌ర్వే ప్ర‌కారం.. టీడీపీ తన స్థానాలకు 8కి పెంచుకోవడమే కాదు, మిత్రపక్షం కాంగ్రెస్‌తో కలిసి మొత్తం 11 సీట్లను గెలుచుకో నుందని అంచనా వేసింది. గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీచేసిన బీజేపీ ఏపీలో 2 పార్లమెంటు స్థానాలను చేజి క్కించుకుంది.

కానీ, ప్రస్తుతం ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేయడంతో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కే పరిస్థితి లేదు కదా డిపాజిట్లు కూడా దక్కవని రిపబ్లిక్ టీవీ ప్రీ-పోల్ సర్వే తెలియజేసింది. దీంతో...పొత్తులు..అంచ‌నాలు.. ఈ స‌ర్వే నిర్వ‌హించిన తీరు వంటి వాటి పై ఇప్పుడు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో హాట్ హాట్ చ‌ర్చ సాగుతోంది..

English summary
C Voter-Reublic tv pre poll survey in AP. Survey says YCP leading in Loksabha elections. TDP - Congress alliance may help for TDP in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X