అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి అయ్యన్న పాత్రుడి హ‌త్య‌కు కుట్ర : సిసి టివీ ఫుటేజ్ క‌ల‌క‌లం..!

|
Google Oneindia TeluguNews

ఏపి మంత్రి చింత‌కాయల అయ్య‌న్న పాత్రుడి హ‌త్య‌కు క‌ట్రు జ‌ర‌గుతుందంటూ సోష‌ల్ మీడియా లో వదంతులు హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌టంతో..దీని పై కేసు న‌మోదైంది. అయ్య‌న్న పాత్రుడు సోద‌రుడు స‌న్యాసి పాత్రుడు కొంత‌మంది వ్య‌క్తుల‌తో క‌లిసి కుట్ర ప‌న్నుతున్నారంటూ వీడియో వైర‌ల్ గా మారింది. దీంతో..స‌న్యాసి పాత్రుడు విశాఖ జిల్లా ఎస్పీ బాబూజీని క‌లిసి దీని పై చర్య తీసుకోవాల‌ని ఫిర్యాదు చేసారు.

ఏపి ఆర్ అడ్ బి శాఖ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడి హ‌త్య గ‌రించి సోష‌ల్ మీడియా లో హ‌ల్‌చ‌ల్ జ‌రుగు తోంది. కుటుంబంలోని వ్యక్తులే బయటివారితో చేతులు కలిపి అయ్యన్నని హతమార్చేందుకు కుట్ర పన్నుతున్నారంటూ గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అయ్యింది. ఆ వీడియోలో అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతుండగా, వారు మంత్రి అయ్యన్న పాత్రుడ్ని హతమార్చడానికి కుట్ర పన్నేందుకే అక్కడ సమావేశమైనట్టుగా చూపించారు.

Conspiracy to murder AP Minister Ayyanna Patrudu : Police Started Enquiry..

సన్యాసిపాత్రుడు కుమారుడు వరుణ్‌ తన తండ్రి ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ఓ పథకం ప్రకారం కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సన్యాసి పాత్రుడు విశాఖ పట్నంలో జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీని కలిసి ఈ ఘ‌ట‌న పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదు చేసారు.

ఈ ప్ర‌చారం పై అయ్య‌న్న సోద‌రుడు స‌న్యాసి నాయ‌డు స్పందించారు. తనపై ఓ పథకం ప్రకారమే దుష్ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసిపాత్రుడు ఎస్పీకి అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 21న నర్సీపట్నం సత్యకాంప్లెక్స్‌లో తన స్నేహితుడు షేక్‌ అల్లా ఉద్దీన్‌ కుమార్తె వివాహానికి తన బంధువు చింతకాయల రమణ, గన్‌మెన్‌లతో కలిసి తాను హాజరయ్యానని, ఆ ఫంక్షన్‌కు నాతవరానికి చెందిన పలువురు ప్రతిపక్ష నేతలు కూడా హాజరయ్యారన్నారు.

వరండాలో మెట్లు దిగుతున్న సమయంలో వారు ఎదురవడంతో మర్యాదపూర్వకంగా పలుకరించుకున్నామన్నారు. ఆ సమయంలో సీసీ టీవీ పుటేజ్‌ సేకరించి.. ఆ దృశ్యాలను తమకు అనుకూలంగా క్రోడీకరించి.. తన సోదరుడిని హత్య చేసేందుకు తామంతా ఏదో కుట్ర చేసేందుకు సమావేశమైనట్టుగా ఒక తప్పుడు వీడియోను సృష్టించి వైరల్‌ చేశారని ఆరోపించారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో వెనుక ఉన్నదెవరో గుర్తించి చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. జిల్లా పోలీసులు సైతం దీని పై సీరియ‌స్‌గా దృష్టి పెట్టారు.

English summary
Conspiracy to murder AP minister Ayyanna Patrudu became sensation in social media. minister Ayyanna patrudu brother Sanyasi Naidu lodge complaint on this social media campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X