అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెవి కోసుకుంటా.. సీపీఐ నారాయణ సంచలనం... ఈ సారి ఎందుకంటే..

|
Google Oneindia TeluguNews

సీపీఐ నారాయణ.. ఏం చేసినా సంచలనమే.. ఇదివరకు ముక్కు కోసుకుంటానని.. చికెన్ తిననని బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సారి చెవి కోసుకుంటానని చెప్పి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి రైతులకు పోటీగా ఉద్యమం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఏపీ ప్రభుత్వ విధానాలను ఖండించారు. ప్రభుత్వంలో నేతలు శాశ్వతం కాదని.. ప్రభుత్వ యంత్రాంగం శాశ్వతం అని చెప్పారు.

హాట్ కామెంట్స్..

హాట్ కామెంట్స్..

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెవి కోసుకుంటానని హాట్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అమరావతి రైతులకు పోటీగా పెయిడ్ ఉద్యమాన్ని నడుపుతోందని విరుచుకుపడ్డారు. ఆ ఉద్యమాన్ని ప్రభుత్వం ఆరు నెలలు నడిపితే తాను చెవి కోసుకుంటానని చెప్పారు. అమరాతి విషయంలో బీజేపీ కూడా స్పష్టమైన వైఖరి ప్రకటించడం సంతోషమన్నారు.

 హర్షణీయం..

హర్షణీయం..

ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదీ హర్షించదగిన విషయం అని చెప్పారు. రాష్ట్ర బీజేపీ నేతలు అందరూ కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని ప్రకటన చేయించాలని కోరారు. అలా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.

వేధింపుల పర్వం..

వేధింపుల పర్వం..

జగన్ ప్రభుత్వం.. యంత్రాంగం, ఎస్ఈసీ, కోర్టులపై దాడి చేస్తోందని సీపీఐ నారాయణ మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీని అణగదొక్కానలి చూడటం సరికాదన్నారు. ఇలాంటి పాలన ప్రజాస్వామ్యానికి నష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని విరుచుకుపడ్డారు. ఏపీలో ఒకే రాజధాని ఉండాలని అభిప్రాయపడ్డారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని.. అందు కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామని నారాయణ స్పష్టం చేశారు.

 కామెంట్స్ కలకలం

కామెంట్స్ కలకలం

సీపీఐ నారాయణ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. చెవి కోసుకుంటాననే కామెంట్ కలకలం రేపింది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. వైసీపీ నేతలు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలీ.

English summary
cpi narayana hot comments on amaravati agitation. they paid Movement in amaravati he alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X