అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తప్పుచేస్తే ఎవరినీ వదలం.. వెల్లంపల్లిపై కామెంట్స్ సరికాదు: పేర్ని నాని

|
Google Oneindia TeluguNews

దుర్గగుడి ఉద్యోగుల అవినీతిపై ఏసీబీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై ఆరోపణలు చేయడం తగదని మరో మంత్రి పేర్నినాని అన్నారు. అవినీతికి పాల్పడితే ఈవో లేదు.. డీవో లేదన్నారు. మాజీ సీఎం చంద్రబాబు హయాంలో చీఫ్ ఇంజినీర్‌పై ఏసీబీ దాడులు జరిగితే.. అప్పటి మంత్రి నారాయణకి వాటిని అంటగట్టగలరా అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల కోసమే అమరావతికి నిధులు కేటాయించలేదని, చంద్రబాబు మెదడును విజయవాడ మ్యూజియంలో పెట్టాలని పేర్నినాని ఎద్దేవాచేశారు.

ఇటు మరోసారి దుర్గగుడిలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. జమ్మిదొడ్డిలోని ఆలయ పరిపాలన కార్యాలయంలో రైడ్స్ చేశారు. ఎస్టాబ్లిష్ మెంట్ విభాగంలో అధికారులు రికార్డుల పరిశీలించారు. 15 మంది ఏసీబీ అధికారుల బృందం.. ఇంద్రకీలాద్రి ఎస్టాబ్లిష్‌ విభాగంలో కూడా ఏసీబీ అధికారులు చేశారు. వెండి రథంలోని 3 సింహాల మాయానికి సంబంధించి రిపోర్ట్ కోసం ఏసీబీ అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. దుర్గగుడి అధికారుల నుంచి ఏసీబీ అధికారులు వివరాలు సేకరించారు.

culprits to be punished, minister perni nani

ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు మూడురోజులు దుర్గగుడిలో సోదాలు నిర్వహించిన ఏసీబీ బృందాలు కీలక విభాగాల్లో పేరుకుపోయిన అవినీతిని గుర్తించారు. ఏసీబీ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా అమ్మవారి చెంత అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులను వెంటనే సస్పెండ్‌ చేయాలని దేవదాయ శాఖ కమిషనర్‌ పీ అర్జునరావు దుర్గగుడి ఈవో ఎంవీ సురేశ్‌బాబును ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దుర్గగుడిలో ఆయా విభాగాలను పర్యవేక్షిస్తున్న ఏడుగురు సూపరింటెండెంట్, మరో ఎనిమిది మంది కిందిస్థాయి ఉద్యోగులపైన సస్పెన్షన్‌ వేటు పడిన సంగతి తెలిసిందే.

English summary
culprits to be punished andhra pradesh minister perni nani reacted on durga temple issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X