అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు పాల‌న మీద విర‌క్తి పుట్టింది : గెలిచేది జ‌గ‌నే : వైసిపి లో చేరిన‌ జై ర‌మేష్..!

|
Google Oneindia TeluguNews

వైసిపి లో మ‌రో టిడిపి ముఖ్యుడు చేరారు. తెలుగుదేశం వ్య‌వ‌స్థాపక స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రించిన దాస‌రి జై ర‌మేష్ లోట‌స్ పాండ్ లో జ‌గ‌న్ ను క‌లిసారు. ఏపిలో చంద్ర‌బాబు పాలన పై విర‌క్తి పుట్టింద‌న్నారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన తొలి రెండేళ్ల లోనే ఒక్కో ఎమ్మెల్యే 50 కోట్ల నుండి 200 కోట్ల వ‌ర‌కు సంపాదించార‌ని పేర్కొన్నారు. త‌న‌కు ఏ బాధ్య‌త అప్ప‌గించినా ప‌ని చేస్తాన‌ని స్ప‌ష్టం చేసారు.

Dasari jai Ramesh Joined in ysrcp : serious allegations on Babu Govt

జ‌గ‌న్ తో జై ర‌మేష్ స‌మావేశం..
వైసిపి అధినేత జ‌గ‌న్ తో టిడిపి మాజీ నేత దాస‌రి జై ర‌మేష్ భేటీ అయ్యారు. దాదాపు రెండు గంట‌ల పాటు స‌మావేశం జ‌రిగింది. టిడిపి వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడిగా ఉన్న జై ర‌మేష్ టిడిపి నుండి 1998 లో విజ‌య‌వాడ నుండి ఎంపి అభ్య‌ర్దిగా పోటీ చేసారు. నాదెండ్ల భాస్క‌ర‌రావు వెన్నుపోటు స‌మ‌యంలోనూ చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రించారు. ద‌గ్గుబా టి తో స‌న్నిహితంగా ఉండే జై ర‌మేష్ వైసిపి లో చేరాల‌ని నిర్ణ‌యించారు. ఎన్టీఆర్ అంటే అభిమానం గా ఉండే జై ర‌మేష్ హైద‌రాబాద్ ఆబిడ్స్ లో ఉన్న ఎన్టీఆర్ నివాసం బ‌య‌టి వారికి ద‌క్క‌కుండా తానే ఉంచుకోవాల‌నే ఉద్దేశం తో ఆయ‌నే కొనుగోలు చేసారు. అయితే, పార్టీలో చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలి న‌చ్చ‌క ఆయ‌న టిడిపికి దూరంగా ఉంటున్నా రు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ నుండి వైసిపి అభ్య‌ర్ది బ‌రిలో దిగేందుకు జై ర‌మేష్ ను ద‌గ్గుబాటి ఒప్పించారు. జ‌గ‌న్ తో క‌లిసేందుకు జై ర‌మేష్ తో పాటుగా ఆయన వెంట దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్‌ కూడా ఉన్నారు.

ఈ స్థాయి అవినీతి ఎప్పుడూ జ‌ర‌గలేదు..
వైసిపి లో చేరిన జై ర‌మేష్ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు. ఈ స్థాయి లో అవినీతి గ‌తంలో ఎప్పు డూ జ‌ర‌గ‌లేద‌ని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అవ్వ‌టానికి గ‌తంలో తాను స‌హ‌క‌రించాన‌ని చెప్పుకొచ్చా రు. అమ‌రావ‌తి నిర్మాణం ఓ క‌ల గా మిగిలిపోయింద‌న్న జై ర‌మేష్‌..చంద్ర‌బాబు చెప్పేది ఒక‌టి చేసేది మ‌రొక‌టిగా మారింద‌ని విమ‌ర్శించారు. ఎన్టీఆర్ పై నాదెండ్ల వెన్నుపోటు స‌మ‌యంలో రామ‌కృష్ణ సినీ స్టూడియో లోనే ఉండి తాను ఎన్టీఆర్ కోసం ప‌ని చేసాన‌ని గుర్తు చేసారు. తాను ఇప్పుడు టిడిపికి పూర్తిగా దూరంగా ఉన్నాన‌ని..ముఖ్య‌మంత్రి ఇచ్చిన హామీలు ఏవీ నెర‌వేర‌టం లేద‌ని ఆరోపించారు. విజ‌య‌వాడ నుండి ఎంపీగా పోటీ చేయ‌టానికి తాను సిద్ద‌మేన‌ని స్ప‌ష్టం చేసారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గెలుస్తార‌ని ఆశాభావం వ్య‌క్తం చేసారు.

English summary
TDP founder member Dasari jai Ramesh Joied in YCP in presence of Jagan, Jai Ramesh cornered Chandra Babu on his administration. He says High corruption taking place in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X