అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు అనుంగు మిత్రుడి ఫోన్‌! మై ఫ్రెండ్‌.. అంటూ!

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అఖండ విజ‌యాన్ని సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, కాబోయే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఓ అనూహ్య నాయ‌కుడి నుంచి అభినంద‌న‌లు అందాయి. ఆ నాయ‌కుడు మొన్న‌టి దాకా మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడితో భుజం భుజం రాసుకుని తిరిగారు.

ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌టానికి కొన్ని గంట‌ల ముందు వర‌కూ ఆయ‌న చంద్ర‌బాబుతో ట‌చ్‌లోనే ఉన్నారు. ఫలితాలు వెలువడిన మ‌రుస‌టి రోజే చంద్ర‌బాబును మ‌ట్టి క‌రిపించిన వైఎస్ జ‌గ‌న్‌కు ఫోన్ చేశారు. కాబోయే ముఖ్య‌మంత్రికి శుభాకాంక్ష‌లు అంటూ అభినంద‌న‌లు తెలిపారు.

DMK Chief MK Stalin congratulates to Next CM of AP YS Jagan

ఆయ‌నే- డీఎంకే అధినేత ఎం కే స్టాలిన్‌. కాంగ్రెస్‌తో సీట్ల స‌ర్దుబాటు చేసుకుని లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన డీఎంకే.. అక్క‌డ ఘ‌న విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. త‌మిళ‌నాడులో మొత్తం 38 లోక్‌స‌భ స్థానాలు ఉండ‌గా.. 36 చోట్ల ఆ పార్టీ అభ్య‌ర్థులు గెలుపొందారు. ప్ర‌స్తుతం పార్టీ విజ‌యోత్స‌వాల్లో ఉన్న స్టాలిన్‌.. ఈ ఉద‌యం చెన్నై నుంచి వైఎస్ జ‌గ‌న్‌కు ఫోన్ చేశారు.

ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించినందుకు ఆయ‌న వైఎస్ జ‌గ‌న్‌కు అభినంద‌న‌ల‌ను తెలియ జేశారు. దీనికి ప్ర‌తిగా వైఎస్ జ‌గ‌న్ కూడా ఆయ‌నకు శుభాకాంక్షలు తెలిపారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అత్య‌ధిక మెజారిటీ స్థానాల‌ను సాధించినందుకు అభినందించారు. ఇదే విష‌యాన్ని స్టాలిన్ ట్వీట్ చేశారు. ఆంధ్ర ప్ర‌దేశ్‌కు మాత్ర‌మే కాకుండా- ద‌క్షిణాది రాష్ట్రాల్లోనే అత్యుత్త‌మ ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్‌ పేరు తెచ్చుకోవాల‌ని తాను అకాంక్షిస్తున్న‌ట్లు తెలిపారు.

English summary
DMK President MK Stalin congratulates to Next Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy for landslide Victory inn Andhra Pradesh. He told that, I congratulate my friend and the Andhra Chief Minister-elect for his fantastic performance in the Parliament and Assembly elections. Wish him a successful tenure as Chief Minister to take Andhra and Southern India to greater heights, Stalin added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X