అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీపీయ‌స్ చ‌ట్టం ర‌ద్దు చేయాలి : బ‌ంద్ ను విజ‌య‌వంతం చేయాలి : ఎమ్మెల్సీ క‌త్తి న‌ర‌సింహారెడ్డి..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

సీపీయ‌స్ చ‌ట్టం ర‌ద్దు చేయాలి, బ‌ంద్ ను విజ‌య‌వంతం చేయాలి!!

సీపీయ‌స్ ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఆందోళ‌న చేస్తున్న ఉద్యోగుల‌కు ఎమ్మెల్సీ క‌త్తి న‌ర‌సింహా రెడ్డి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. వారిని అరెస్ట్ చేయ‌టం అన్యాయ‌మ‌ని..వారిని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేసారు. ఏపి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం చేస్తున్న బంద్ ను విజ‌య‌వంతం చేయాల‌ని ఆయ‌న కోరారు.

ఉద్యోగుల‌కు న్యాయం చేయాలి..
కాంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీం ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళ‌న న్యాయ బ‌ద్ద‌మైద‌ని శాన‌స మండ‌లి ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గ స‌భ్యుడు క‌త్తి న‌ర‌సింహా రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 86 వేల మంది సీపీ య‌స్ ఉద్యోగులు త‌మ ఉద్యోగ భ‌ద్ర‌త మీద ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని..ఆందోళ‌న చేస్తున్న వారిని అరెస్ట్ చేయ టం సరి కాద‌న్నారు. వారిని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేసారు. 2009 సెప్టెంబ‌ర్ 1 నుండి అమ‌లు చేస్తు న్న నూతన విధానం పై జారీ చేసిన జీవో ల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరారు. దీని పై ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన క‌మిటీ కంటి తుడుపు కోస‌మేన‌ని విమ‌ర్శంచారు. దీని పై ఇప్ప‌టికే అసెంబ్లీ, మండ‌లిలో డిమాండ్ చేసామ‌ని గుర్తు చేసారు. సీపీయ‌స్ ఉద్యోగులు చేసే పోరాటాల‌కు త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు.

Do not implement CPS in AP..MLC Katti Narasimha Rao Demand

బంద్ ను విజ‌య‌వంతం చేయాలి..
ఇక‌, ఏపికి ప్ర‌త్యేక హోదా..విభ‌జ‌న హామీల సాధ‌న కోసం ప్ర‌జా సంఘాలు నిర్వ‌హిస్తున్న ఏపి బంద్ ను విజ‌య‌వంతం చేయాల‌ని క‌త్తి న‌ర‌సింహారెడ్డి కోరారు. కేంద్రం ఏపికి చేస్తున్న అన్యాయానికి నిర‌స‌న‌గానే ఈ బంద్ నిర్వ‌హిస్తున్న‌ట్లు గా వివ‌రించారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ కేంద్రం పై ఒత్తిడి పెంచి ఏపి ప్రయోజ‌నాల‌ను ద‌క్కించుకొనేందుకు అన్ని పార్టీలు క‌లిసి రావాల‌ని విజ్క్ష‌ప్తి చేసారు. ఏపికి న్యాయ బద్దంగా రావాల్సిన అన్ని ప్ర‌యోజ‌నాలు రావాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసారు.

English summary
MLC katti Narasimha Reddy demanded for cancellation of CPS in AP. He also requested all political parties to fight for ap special status and also implementation of central govt assurances.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X