అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి చుట్టు పక్కల స్థలాలు కొనొద్దు..!కొంటే పూర్తి బాద్యత మీదే అంటున్న ఎమ్మెల్యే ఆర్కే..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతి పరిసర ప్రాంతాల్లో ముందస్తు సమాచారం లేకుండా ఎక్కడ కూడా భూములు కొనొద్దని చెప్పుకొచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో లింగమనేని, ఐజేయం అక్రమాలు ఎన్ని చేశారో ప్రజలకు చెప్పాలని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి ప్రశ్నించారు. అక్రమంగా లే ఔట్లు వేసి వెంచర్లు వేశారన్నారు. నిబంధనలను పాటించలేదు, సుమారు 40 ఎకరాల్లో లే ఔట్లు వేశారని తెలిపారు. విలాసవంతమైన విల్లాలు కట్టి ఒక్కోదాన్ని రూ.5 కోట్లకు అమ్ముకున్నారని పేర్కొన్నారు. బిల్డింగ్ పర్మిట్, లే ఔట్ ఫీజు గ్రామానికి కట్టాల్సి ఉన్న ఇప్పటిదాకా కట్టలేదని తెలిపారు. గజం రూ.4 వేలు గా రిజిస్ట్రేషన్ విలువ చూపించారన్నారు. సుమారు 40 నుండి 50 కోట్లు పంచాయితీకి రావాల్సిన ఫీజు ఎగ్గొట్టారని తెలిపారు. ఎగ్గొట్టడమే కాకుండా పంచాయితీ మీదే కేస్ వేశారని, ఆ కేస్ లను బెంచ్ పైకి రాకుండా మేనేజ్ చేశారని పేర్కొన్నారు.

Dont buy places around Amaravathi.!mla RK directions..!!

ఈ అంశంపై ముఖ్యమంత్రిని విజిలెన్స్ దర్యాప్తు కొరతామన్నారు. ఒక్క నియోజకవర్గంలోనే 40 నుండి 50 కోట్లకు అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. కరకట్ట ఇల్లు ఇచ్చారు కాబట్టే చంద్రబాబు ఏమి మాట్లాడకుండా ఉండిపోయారని చెప్పారు. విల్లాలు కొనుక్కున్న వాళ్లకు తెలియకుండా కొనుక్కున్నారని, వాళ్ళు ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. సామాన్యులు అప్పులు తెచ్చుకుని కొనుక్కుని, తరువాత ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. గత 5 సంవత్సరాల్లో జరిగిన భూ బాగోతాలపై దర్యాప్తు జరగాలని ముఖ్యమంత్రిని కొరతామన్నారు. ప్రజలేవరూ మంగళగిరి నియోజకవర్గంలో నిర్దిష్ట సమాచారం లేకుండా అపార్టుమెంట్లు కానీ స్థలాలు కానీ కొనవద్దని సూచించారు. విజయవాడ క్లబ్ కూడా అక్రమ కట్టడమే, అనుమతి లేని ఏ భవనమైన సీఆర్డీఏ నోటీస్ లు ఇస్తుందని అనుకుంటున్నామన్నారు ఆళ్ల రామకృష్ణ రెడ్డి.

English summary
Mangalagiri MLA Ramakrishna Reddy made sensational comments. The land in Amravati has been told not to buy land without any prior information.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X